Breaking News

రష్మిక మందన్న మేలి ముసుగుపై శక్తిమంతమైన ఆ పదాలు..!

Published on Fri, 02/27/2026 - 13:14

టాలీవుడ్‌ సెలబ్రిటీ జంట రష్మిక మందన్న,  విజయ్ దేవరకొండ ఫిబ్రవరి26, 2026న గురువారం అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయపూర్ వెలుపల 50 కి.మీ దూరంలో ఉన్న అద్భుతమైన ఐటీసీ మెమెంటోస్‌లో వీరి వివాహం జరిగింది. అయితే వీరిద్దరు తమ పెళ్లిలో ఎంచుకున్న కాస్ట్యూమ్స్‌ మొత్తం సాంస్కృతిక వారసత్వానికి అర్థం పట్టేలా ఎంచుకున్నారు. ఆధునికతను జోడిస్తూ..సాంప్రదాయ విలువలకు అనుగుణంగా తీర్చిద్దిన డిజైనర్‌ వేర్‌లో ముగ్ధమనోహరంగా మెరిశారు. అయితే పెళ్లిలో దాంపత్య విలువను తెలియజేసే పెళ్లి మంత్రాల మాదిరిగా తాను ధరించిన చీరలో సైతం దాన్ని ప్రదర్శించింది రష్మిక. అది ఆ వేడుకనే నిశబ్దంగా హైలెట్‌ చేసింది. ఇక్కడ రష్మిక ధరించిన ముసుగుపై ఉన్న మూడు శక్తిమంతమైన పదాలు వైవాహిక బంధం గొప్పతనం తెలియజేసేలా చాలాచక్కగా పొందుపరిచారు. ఇంతకీ అక్కడ ఏమని రాశారంటే..

రష్మిక పెళ్లివేడుకలో లేత ఎరుపు గోల్డ్‌ అంచు చీరలో మెరిశారు. మొత్తం చీరపై ఆలయ ప్రేరేపిత ఎంబ్రాయిడరీలు, తోరణాలు, స్థంబాలు, పవిత్రమైన మోటీఫ్‌లతో చాలా వివరణాత్మకంగా తీర్చిదిద్దారు. వాటిలో  హైదరాబాద్ చారిత్రాత్మక వాస్తుశిల్పం నుంచి గర్భగుడులు, ఆధ్యాత్మికతకు సంబంధించి.. ఆలయ గృహనమునాలతో ఎంబ్రాయిడరీ చేశారు. బంగారు జరీ వర్క్‌తో డిజైన్‌ చేశారు. 

దానికి తగ్గట్టుగా బ్లౌజ్‌ సైతం బంగారు థ్రెడ్‌వర్క్‌తో చక్కటి ఎంబ్రాయిడరీతో హుందాగా ఉంది. దానికి రాయల్టీ లుక్క్‌ఇచ్చేలా ధరించిన బంగారు మేలి ముసుగు అత్యంత ఆకర్షణీయంగా కనిపించింది. చూపురులను ఆ ముసుగు బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా దానిపై ఉన్న బంగారు ఎంబ్రాయిడరీతో రాసిన ఆ " ప్రతి జీవితకాలంలో" అనే పద బంధం అందర్నీ ఆలోచింపచేసేలా ఆకర్షించింది. అంటే.. జీవితాంతం ఒకరికొకరు మనం వేరు కాదు, ఇది జన్మజన్మల బంధం అని చెబుతూ భావోద్వేగంగా అందరి హృదయాలను తాకింది. 

వైవాహిక జీవిత గొప్పదనాన్ని ఈ చిన్న పద బంధంతో చాలా అద్భుతంగా హైలెట్‌ చేసి చెప్పారు. ఒకరకంగా ఇది ఆ డిజైనర్‌ నైపుణ్యాన్ని నొక్కి చెప్పింది కూడా. ఇక రష్మిక అందుకు తగ్గట్టు ధరించిన ఆభరణాలు గజిబిజి కాకుండా చాలా చక్కగా పెట్టిన తీరు చాలా బాగుంది. నెక్‌లైన్‌ నుంచి లేయర్డ్‌ ఆభరణాలు, చోకర్‌లు ఆ చీర లుక్‌ని మరింత హైలెట్‌ చేశాయి.

అలాగే తలపై ధరించిన పాపిడి బొట్టు సైతం చెదరకుండా చక్కగా అమర్చారు. రష్మిక మొత్తం ఆహార్యం దివి నుంచి భువికి వచ్చిన దేవ కన్యలా అబ్బురపరిచింది. ఇక హీరో విజయ్‌ దేవరకొండ అనామిక ఖన్నా డిజైనర్‌ వేర్‌ ఐవరీ ధోతీ సిల్హౌట్‌ ధరించి అద్భుతమైన వెర్మిలియన్ అంగవస్త్రంతో రాజకుమారుడిలా కనిపించారు. ఆయన ధరించి ధోతి హైదరాబాద్‌ వారసత్వం వనసింగారం నేత, దానిపై అడవి, ఆలయ మూలాంశాలతో కూడిన ఎంబ్రాయిడరీ మన సాంస్కృతిక వారసత్వ శక్తిని హైలెట్‌ చేశాయి.

(చదవండి: నటి రష్మిక మందన్న 'కొడగు' శారీ స్టైల్‌..! ఈ చీరకట్టు స్పెషాల్టీ ఇదే..)

 

Videos

విజయు ఎఫైర్ ఉంది.. విడాకులు కోరిన దళపతి భార్య

మొదటి సారి సీఎం అయినప్పుడు అసెంబ్లీలో ఎవ్వరికి తెలియని పచ్చి నిజం

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

పెళ్లి సీజన్‌లో ఊరట.. 22, 24 క్యారెట్ల బంగారం ధరలు తగ్గింపు

లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్ చిట్ కన్నీళ్లు పెట్టుకున్న కేజీవాల్

ఉదయపూర్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేసిన 'విరోష్‌' జోడీ

చిలుకూరులో విషాదం ఆలయ ప్రధాన అర్చకులు ఇకలేరు

అవినీతి, అరాచక పాలనతో కాంగ్రెస్ సర్కార్

కోల్‌కతాలో భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

Mangalagiri : జనసేన ఆఫీస్ లో దాడి.. కారు అద్దాలు ధ్వంసం

Photos

+5

జాలీగా గడిపేస్తున్న మెహరీన్‌ (ఫోటోలు)

+5

పిల్లాడే కాదు, మేమూ మిస్‌ అవుతాం: కాజల్‌ (ఫోటోలు)

+5

బ్లాక్‌ చీరలో నటి నివేథా థామస్.. గ్లామ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

నాని 'ది ప్యారడైజ్' HD మూవీ స్టిల్స్‌

+5

ఈ అమ్మడి అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే (ఫొటోలు)

+5

ప్రియుడితో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఇదిగో విజయ్‌ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు

+5

ఒకదానికొకటి సంబంధమే లేదు.. మీనాక్షి చౌదరి ఫన్నీ (ఫొటోలు)

+5

థాయ్‌ల్యాండ్‌ ఏనుగులతో రీతూవర్మ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)