2026లో పెరగనున్న వేతనాలు!

Published on Wed, 02/25/2026 - 13:52

భారతీయ కార్పొరేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు రానున్న ఆర్థిక సంవత్సరంలో తీపి కబురు అందనుంది. 2025లో నమోదైన 8.9 శాతం వేతన పెంపు 2026లో 9.1 శాతానికి చేరుకోనుందని గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఏయాన్ తన తాజా నివేదికలో వెల్లడించింది. తాజాగా విడుదలైన ‘32వ వార్షిక వేతన పెంపు, టర్నోవర్ సర్వే 2025-26’ ప్రకారం.. దేశంలోని 45 పరిశ్రమలకు చెందిన సుమారు 1,400 సంస్థల గణాంకాలను విశ్లేషించి ఈ అంచనాలను రూపొందించారు.

రంగాల వారీగా వేతనాల జోరు

ఈ ఏడాది వేతన పెంపులో రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, ఎన్‌బీఎఫ్‌సీ (బ్యాంకింగ్ ఏతర ఆర్థిక సంస్థలు) రంగాలు అగ్రస్థానంలో నిలవనున్నాయి. సాంకేతికత, ఇంజినీరింగ్, కస్టమర్ ఫేసింగ్ విభాగాల్లో నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కోసం సంస్థలు పోటీ పడుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని నివేదికలో చెప్పారు.

ప్రధాన రంగాల అంచనాలు

పరిశ్రమ2025 వాస్తవ పెంపు (%)2026 అంచనా (%)
ఎన్‌బీఎఫ్‌సీ9.710.1
రియల్టీ / ఇన్‌ఫ్రా10.510.2
ఆటోమోటివ్‌9.89.9
రిటైల్‌9.09.5
టెక్నాలజీ7.06.6

 

తగ్గిన వలసలు

గడిచిన మూడేళ్లుగా ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్‌-ఉద్యోగ మార్పు) క్రమంగా తగ్గుముఖం పట్టడం విశేషం.

2023: 18.7%

2024: 17.7%

2025: 16.2%

ప్రస్తుతం ఈ రేటు కొవిడ్‌ పూర్వపు స్థాయికి చేరుకుంది. కంపెనీలు అనుసరిస్తున్న మెరుగైన నియామక ప్రక్రియలు, ఉద్యోగుల నిలుపుదల కోసం చేపడుతున్న కెరీర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు ఈ సానుకూల మార్పుకు కారణమని నివేదిక పేర్కొంది.

ఈ సందర్భంగా ఏయాన్ ఇండియా పార్టనర్ రూపాంక్ చౌదరి మాట్లాడుతూ..‘భారతదేశం ప్రస్తుతం బలమైన స్థూల ఆర్థిక పునాదులతో వృద్ధి పథంలో ఉంది. దేశీయ గిరాకీ పెరగడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం వల్ల కంపెనీలు ప్రతిభావంతులపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి’ అని చెప్పారు. దేశంలో కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తుండటంతో కంపెనీలు తమ వేతన నిర్మాణాలను మారుస్తున్నాయని ఏయాన్ అసోసియేట్ పార్టనర్ అమిత్ కుమార్ ఓత్వానీ తెలిపారు.

ఇదీ చదవండి: రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేస్తున్నారా?

Videos

అధైర్య పడొద్దు.. నేనున్నా.. టీడీపీ అరాచకాలపై ప్రజలకు జగన్ భరోసా

పవన్ కళ్యాణ్ కళ్లు మూసుకుపోయాయ..? హై కోర్టు అడ్వకేట్ సావిత్రి స్ట్రాంగ్ రియాక్షన్

జైల్లో ఉంచితే దారికొస్తారా? ఏపీ సీఎస్ పై హైకోర్టు ఫైర్

నేడు కీలక మ్యాచ్.. నిలవాలంటే గెలవాల్సిందే..

ఎప్ స్టీన్ కేసులో కొత్త ట్విస్ట్.. ట్రంప్ ఫైళ్లు మాయం?

ఒక నిష్ట దరిద్రుడివి.. పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్

నిన్ను చూసి ఊసరవెల్లి కూడా ఉరేసుకుంటుంది.. పవన్ పై తాటిపర్తి ఫైర్

బాబుకు దెబ్బ మీద దెబ్బ

రాజంపేట లాడ్జిలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరి మృతి

ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్.. కోడింగ్ రాసేది, ఎగ్జిక్యూట్ చేసేది అంతా AI

Photos

+5

#Virosh : పెళ్ళి సందడి..ట్రెండింగ్ లో రష్మికా మండన్న (ఫొటోలు)

+5

’విష్ణు విన్యాసం‘ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

ప్రియురాలితో బిగ్‌బాస్ షణ్ముఖ్ ఎంగేజ్‌మెంట్‌ (ఫోటోలు)

+5

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బంధువుల పెళ్లిలో మెరిసిన అల్లు స్నేహారెడ్డి (ఫోటోలు)

+5

విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి విశేషాలు (ఫొటోలు)

+5

కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

బ్లాక్ అండ్ బ్లాక్‌లో మెరిసిపోతున్న శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

నందిపల్లిలో వైఎస్‌ జగన్‌ పర్యటనతో పండుగ వాతావరణం (ఫొటోలు)

+5

Telangana Inter Exams : ఇంటర్ పరీక్షలు ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీదేవి 'బ్యాండ్ మేళం' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)