బంగారం, వెండి కొనాలనుకునేవారికి షాక్.. ఇవాళ ధరలు ఎలా ఉన్నాయంటే..!
Breaking News
విజయ్, రష్మిక సంగీత్ వీడియో వైరల్.. క్రికెట్ బ్యాట్‌పై పెళ్లి డేట్!
Published on Wed, 02/25/2026 - 11:09
రష్మిక, విజయ్ దేవరకొండ మరికొన్ని గంటల్లో వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబాలలో పెళ్లి సందడి మొదలైంది. మోహందీ, సంగీత్ సందడి కూడా జరిగిపోయింది. సంగీత్‌లో విజయ్, రష్మిక కలిసి నటించిన చిత్రాల్లోని క్యూట్ ఫోటోలతో కలర్‌పుల్‌గా డెకరేషన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో అధికారికంగా షేర్ చేయాలని కోరుతూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.

దీంతో పాటు సంగీత్‌లో ఇరుకుటుంబ సభ్యులు సరదగా ‘విరోష్ ప్రీమియర్ లీగ్’ను కూడా సెలెబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోని విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు. అందులో క్రికెట్ బ్యాట్, సిల్వర్ మెడల్‌పై ఫిబ్రవరి 26 అని రాసి పెళ్లిడేట్‌ని డిఫరెంట్‌గా ప్రకటించారు.
From the #Virosh Premier league! #VijayDeverakonda pic.twitter.com/ghf7F7TMDF
— Hourly Vijay Deverakonda (@HourlyDVS) February 24, 2026
ఈ రోజు హల్దీ వేడుకలు జరుగనున్నాయి. సాయంత్రం మెహందీ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోనున్నారు. గురువారం(ఫిబ్రవరి 26) ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరగనుంది. ఇదే రోజు సాయంత్రం కొడవ స్టైల్‌లో మరోసారి విజయ్-రష్మిక వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. ఉదయ్‌పూర్‌లోని మెమెంటోస్ హోటల్ జరిగే ఈ పెళ్లికి కేవలం 100 మంది లోపే అతిథులు హాజరుకానున్నారు. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షెన్ ఏర్పాటు చేశారు.
We need those original pictures @iamRashmika please 🥹❤️❤️#ViRosh pic.twitter.com/uVx2O2gWLz
— Rahul (@The_pathbreaker) February 24, 2026
Tags : 1