Breaking News

అమెరికన్ కంపెనీ భారీ రీకాల్!

Published on Tue, 02/24/2026 - 16:50

ఇటీవల దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలకు రీకాల్ జారీ చేస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికన్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ భారీ రీకాల్ ప్రకటించింది. దీని ప్రభావం ఏకంగా 4,12,774 వాహనాల మీద పడింది. ఈ విషయాన్ని యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.

రియర్ సస్పెన్షన్ టో లింక్‌లలో సమస్య ఉండటం వల్లనే కంపెనీ ఈ భారీ రీకాల్ ప్రకటించింది. ప్రభావిత వాహనాలకు పరిష్కారంగా డీలర్లు టో లింక్‌లను ఉచితంగా భర్తీ చేయాలని రెగ్యులేటర్ సూచించింది. అంతే కాకుండా.. బ్యాటరీ వైఫల్యాలు & బ్రేక్ పెడల్స్‌లోని లోపాల కారణంగా ఫోర్డ్ అమెరికాలో మరో 40,655 వాహనాలకు రీకాల్ జారీ చేసింది.

భారత్‌కు ఫోర్డ్ కంపెనీ
అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్.. తమిళనాడులోని చెన్నై ప్లాంట్‌లో తయారీ కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి సిద్ధమైంది. దీనికోసం సంస్థ తమిళనాడు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది.

ఫోర్డ్ కంపెనీ మరైమలై నగర్ ప్లాంట్‌లో నెక్స్ట్ జనరేషన్ ఇంజిన్ తయారీకి కొత్త లైన్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది నాలుగు సంవత్సరాల విరామం తర్వాత.. భారతదేశంలో ఉత్పత్తికి పునరాగమనాన్ని సూచిస్తుంది. ఒప్పందం ప్రకారం.. ఫోర్డ్ సంస్థ ఈ ప్రాజెక్టు కోసం రూ.3,250 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించిన తరువాత 600 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు, అనేక పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సంస్థకు చెందిన కొత్త సౌకర్యంలో సంవత్సరానికి 2,35,000 ఇంజిన్లను ఉత్పత్తి చేయనుంది. ఈ ఉత్పత్తి 2029లో ప్రారంభం కానుంది. కాగా ఇక్కడ ఉత్పత్తి చేసిన ఇంజిన్లను కంపెనీ.. ఎగుమతి చేయనుంది. కాబట్టి ఇవన్నీ గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా ఉంటాయి.

#

Tags : 1

Videos

భారీగా తగ్గిన వెండి.... దూసుకుపోతున్న బంగారం.. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే?

రెండుకు రెండూ గెలిచినా సెమీస్ చేరడం కష్టమేనా..!

బయటపడ్డ బ్యూటీ బండారం.. నిమిషాల్లోనే 1.4 లక్షల ఫాలోవర్లు గాన్..!

పులివెందుల చేరుకున్న జగన్

తేజస్ యుద్ధ విమానాలపై అనుమానాలు క్లారిటీ ఇచ్చిన HAL

వరల్డ్ ఫేమస్ హలీమ్ తయారీ.. పిస్తా హౌజ్ లో

జగన్ చేతుల మీదుగా రేపే నందీశ్వరాలయం ఓపెనింగ్

Ram Role: ఇటు మహేశ్.. అటు రణబీర్ ఎవరు పర్ఫెక్ట్?

జీవో 746,747 జగన్ ప్రశ్నకు పలాయనం.. దొరికిన చంద్రబాబు

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Photos

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

బీచ్ ఒడ్డున అలా సరదాగా సింగర్ సునీత (ఫొటోలు)

+5

నాని స్టైల్లోనే అతడికి బర్త్‌డే విషెస్ చెప్పిన అక్క (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ఒకప్పటి హీరోయిన్ (ఫొటోలు)

+5

అమెరికాలో విరుచుకుపడుతున్న మంచు తుపాను (ఫొటోలు)

+5

ట్రెండింగ్ లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

గుర్తుపట్టలేని విధంగా సీనియర్ నటి.. మేకప్‌ తీయడానికే 2 గంటలు (ఫోటోలు)

+5

తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం (ఫొటోలు)

+5

సోమాజిగూడలో హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ సందడి (ఫొటోలు)

+5

'D/o ప్రసాదరావు' ప్రీ రిలీజ్ (ఫొటోలు)