మెక్సికోలో మాఫియా గ్యాంగ్ బీభత్సం..
Breaking News
మ్యూచువల్ ఫండ్స్.. ‘న్యూ ఆఫర్స్’..
Published on Mon, 02/23/2026 - 15:47
ఎల్‌ఐసీ ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్: సంప్రదాయ ఐటీ సర్వీసుల పరిధికి మించి విస్తరిస్తున్న టెక్నాలజీ రంగంలో పెట్టుబడుల అవకాశాలను అందించే దిశగా ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా టెక్నాలజీ ఫండ్‌ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మార్చి 6తో ముగుస్తుంది. సెమీకండక్టర్ ఆధారిత కంపెనీలు, డేటా సెంటర్ ఆపరేటర్లు, డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫాంలు, ఇంటర్నెట్ బిజినెస్‌లు, వర్ధమాన టెక్నాలజీ సంస్థలు సహా సాంకేతికతతో ముడిపడి ఉన్న వివిధ రంగాల సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. దీనికి బీఎస్‌ఈ టెక్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్ రూపంలోనైతే వ్యవధిని బట్టి రూ.100 నుంచి కట్టొచ్చు. కరణ్ దోషి, జైప్రకాశ్ తోషి్నవాల్ దీనికి ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు.
‘బరోడా బీఎన్‌పీ’ ఈఎస్‌జీ స్ట్రాటజీ ఫండ్
పర్యావరణహితంగా వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో బరోడా బీఎన్‌పీ పారిబా మ్యుచువల్ ఫండ్ తాజాగా ఈఎస్‌జీ బెస్ట్–ఇన్–క్లాస్ స్ట్రాటెజీ ఫండ్‌ని ఆవిష్కరించింది. దీనికి నిఫ్టీ100 ఈఎస్‌జీ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. సెబీలో నమోదు చేసుకున్న రేటింగ్ కంపెనీలు ఇచ్చే ఈఎస్‌జీ రేటింగ్స్, అలాగే, కంపెనీ అంతర్గతంగా నిర్వహించే ఫండమెంటల్ రీసెర్చ్, అనాలిసిస్ ఆధారంగా ఎంపిక చేసిన సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. కనీసం రూ. 1,000 నుంచి పెట్టుబడి పెట్టే విధంగా ఈ ఫండ్ ఉంటుంది. గడిచిన పదేళ్లలో ఏడేళ్ల పాటు నిఫ్టీ 100 టీఆర్‌ఐకి మించి నిఫ్టీ 100 ఈఎస్‌జీ టీఆర్‌ఐ మెరుగైన పనితీరు కనపర్చిందని సంస్థ సీఈవో సంజయ్ గ్రోవర్ తెలిపారు.
బజాజ్ లైఫ్ బీఎస్‌ఈ 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్
జీవిత బీమా సంస్థ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా బీఎస్‌ఈ 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 15 వరకు ఈ న్యూ ఫండ్ ఆఫర్‌లో (ఎన్‌ఎఫ్‌వో) ఇన్వెస్ట్ చేయొచ్చు. స్థిరంగా ఆదాయాలు ఆర్జిస్తూ, ఆర్థికంగా పటిష్టంగా ఉన్న దేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. కంపెనీకి చెందిన యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాలైన (యులిప్స్) బజాజ్ లైఫ్ స్మార్ట్ వెల్త్ గోల్, బజాజ్ లైఫ్ సుప్రీం, బజాజ్ లైఫ్ గెయిన్‌లతో దీన్ని తీసుకోవచ్చు. ఇటు జీవిత బీమా కవరేజీని పొందుతూనే అటు దీర్ఘకాలంలో సంపదను కూడా పంచుకునేలా ఇది రెండిందాల ప్రయోజనాలు అందిస్తుందని కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు రావూరి తెలిపారు.
వెల్త్ కంపెనీ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్
ఈక్విటీ, డెట్ సాధనాల్లో క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడిని పెంచుకునే అవకాశం కల్పించేలా ది వెల్త్ కంపెనీ మ్యుచువల్ ఫండ్ ..తాజాగా బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. ఇది ఫిబ్రవరి 10న ముగుస్తుంది. మార్కెట్ పరిస్థితులు, వేల్యుయేషన్లు, రిస్క్ ఇండికేటర్లను బట్టి ఈక్విటీ, డెట్ సాధనాల మధ్య పెట్టుబడులను సర్దుబాటు చేస్తూ మెరుగైన రాబడులు అందించడంపై ఇది దృష్టి పెడుతుంది. కనీసం 65 శాతం నిధులను ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సాధనాల్లోనూ, 35 శాతం భాగాన్ని డెట్, మనీ మార్కెట్ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేస్తుంది. దీనికి క్రిసిల్ హైబ్రిడ్ 50+50 మోడరేట్ ఇండెక్స్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది.
Tags : 1