మెక్సికోలో మాఫియా గ్యాంగ్ బీభత్సం..
Breaking News
నాని 'ది ప్యారడైజ్' టైటిల్ సాంగ్ ప్రోమో
Published on Mon, 02/23/2026 - 11:41
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి టైటిల్ సాంగ్ ప్రోమో వచ్చేసింది. ఆయా షేర్... అంటూ వందలాదిమంది డ్యాన్సర్లతో నాని వేసిన స్టెప్పులకు అదిరిపోయేలా అనిరుధ్ రవిచందర్ సంగీతం ఉంది. కాసర్ల శ్యామ్ కుమార్ రచించిన ఈ పాటను అడ్డుల జంగిరెడ్డి, ఆకునూరి దేవయ్య, అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. ఫిబ్రవరి 24న పూర్తి సాంగ్‌ను విడుదల చేస్తామని ప్రోమోలో ప్రకటించారు.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మోహన్‌బాబు, సంపూర్ణేశ్‌బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి నటిస్తున్నారు. భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్, స్పానిష్‌లో ఆగష్టు 21న ఈ మూవీ విడుదల కానుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాని ఒక ప్రేత్యకమైన గెటప్‌లో కనిపించనున్నారు. మొదటి సాంగ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రవర్గాలు ఇప్పటికే తెలిపాయి.
Tags : 1