Breaking News

900 పైగా ల్యాండ్ క్రూయిజర్లు రీకాల్‌..

Published on Sun, 02/22/2026 - 19:10

టొయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ సంస్థ తన ప్రముఖ లగ్జరీ ఎస్‌యూవీ టొయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌ 300 (Toyota Land Cruiser 300)కు సంబంధించి 969 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2024 సెప్టెంబర్ 4 నుంచి 2025 సెప్టెంబర్ 30 మధ్య తయారైన వాహనాలు ఈ రీకాల్ పరిధిలోకి వస్తాయి.

ట్రాన్స్‌మిషన్ సాఫ్ట్‌వేర్ లోపమే కారణం
కంపెనీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ట్రాన్స్‌మిషన్ పనితీరును నియంత్రించే ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో సంభావ్య లోపం గుర్తించారు. ట్రాన్స్‌మిషన్‌లో గేర్ మార్పులను నిర్వహించేందుకు లీనియర్ సోలెనాయిడ్లు ఉపయోగిస్తారు. కొన్ని నిర్దిష్ట డ్రైవింగ్ పరిస్థితుల్లో ఈ సోలెనాయిడ్ సరిగా పనిచేయకపోతే, సాఫ్ట్‌వేర్ లోపం వల్ల ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ యూనిట్, ఇంజిన్ ఈసీయూ మధ్య కమ్యూనికేషన్ లోపం ఏర్పడే అవకాశం ఉంది.

ఈ లోపం సరిచేయకపోతే కొన్ని గేర్లలో ట్రాన్స్‌మిషన్ ఓవర్-రివింగ్‌కు దారితీసే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో ఇది ట్రాన్స్‌మిషన్‌కు నష్టం కలిగించడమే కాకుండా, అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు పవర్ లాస్ సమస్యను కూడా కలిగించవచ్చు. ట్రాన్స్‌మిషన్ హౌసింగ్ దెబ్బతింటే ఫ్లూయిడ్ లీకేజ్ సంభవించి, చివరికి ట్రాన్స్‌మిషన్ వైఫల్యానికి దారితీసే ప్రమాదం ఉందని సంస్థ స్పష్టం చేసింది. అయితే భారత్‌లో ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలు నమోదు కాలేదని తెలిపింది.

లెక్సస్ ఎల్‌ఎక్స్‌లోనూ ఇదే యూనిట్
గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇదే 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌ను లెక్సస్‌ ఎల్‌ఎక్స్‌ మోడల్‌లో కూడా ఉపయోగిస్తున్నారు. ఆ మోడల్‌కు సంబంధించి కూడా ఇలాంటి సమస్యల పరిష్కారానికి రీకాల్ జారీ చేసినట్లు కంపెనీ పేర్కొంది.

రీకాల్‌లో భాగమైన అన్ని వాహన యజమానులను టొయోటా డీలర్ ప్రతినిధులు వ్యక్తిగతంగా సంప్రదిస్తారు. అవసరమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లేదా సరిదిద్దే చర్యలు ఉచితంగా చేపడతామని కంపెనీ వెల్లడించింది. కస్టమర్లు తమకు ఏవైనా సందేహాలు ఉంటే సమీప డీలర్‌ను లేదా కస్టమర్ అసిస్టెన్స్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించింది.

భారత్‌లో టొయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.15 కోట్లు. ఇందులో 3.3-లీటర్ వి6 టర్బో డీజిల్ ఇంజిన్‌తో కూడిన 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 304 బీహెచ్‌పీ పవర్‌, 700 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Videos

మెక్సికోలో మాఫియా గ్యాంగ్ బీభత్సం..

Ram Charan: మళ్లీ బుచ్చిబాబుతోనే..!

యుద్ధం తధ్యం.. ఇరాన్‌లోని ఇండియన్స్ కు పిలుపు

నన్ను, నా కుటుంబాన్ని కాల్చేయమని.. బాబు, లోకేష్ పై అంబటి సంచలన కామెంట్స్

ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్.. పెళ్లిపై విజయ్ ఎమోషనల్

4 రోజులుగా షాకిస్తున్న గోల్డ్ రేట్స్... రూ.7 వేల పైనే పెరిగిన బంగారం ధర..

విఎస్ఆర్ వెంచర్స్ వెనుక హెరిటేజ్ ఫిన్ లీజ్ ! అజిత్ పవార్ మృతిపై రామ్మోహన నాయుడు కామెంట్స్

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాక్..!

హెరిటేజ్ పై చర్చకు ఎందుకు భయపడుతున్నావ్.. చంద్రబాబు?

ఎండాకాలం వాన.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

Photos

+5

'D/o ప్రసాదరావు' ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

విజయవాడలో నోరూరించే రంజాన్ రుచులు.. మీరూ ఓ లుక్కేయండి (ఫొటోలు)

+5

జ్యోతిరాయ్ 'కిల్లర్' మూవీ టీజర్ రిలీజ్ (ఫొటోలు)

+5

చిరంజీవికి సన్మానం.. టాలీవుడ్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

అమలాపురంలో సందడి చేసిన 'రాకాస' మూవీ టీమ్ (ఫొటోలు)

+5

కొచ్చిలో 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. ట్రెండింగ్‌ ఫోటోలు చూశారా?

+5

వైభవంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఈకో రన్ 2.0లో బిగ్ బాస్ దివి వద్త్య సందడి (ఫొటోలు)

+5

లాంచనంగా మొదలైన రిషభ్ శెట్టి 'జై హనుమాన్' (ఫొటోలు)

+5

లక్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నంబర్‌-1 లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)