బీమా వృద్ధికి ఎఫ్‌డీఐల దన్ను 

Published on Sun, 02/22/2026 - 05:06

దేశీయంగా బీమా రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం పరిశ్రమ వృద్ధికి దోహదపడే పురోగామి చర్యగా కోటక్‌ మహీంద్రా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఎండీ మహేష్‌ బాలసుబ్రమణియన్‌ అభివరి్ణంచారు. జీఎస్‌టీపరమైన చర్యలతో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు 18 శాతం, సంప్రదాయ పథకాలు 4.5 శాతం చౌకగా లభిస్తాయని సాక్షి బిజినెస్‌ బ్యూరోకి ఇచి్చన ఇంటర్వ్యూలో చెప్పారు. మరిన్ని విశేషాలు.. 
 

భారత బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించడం వల్ల పెట్టుబడులు, పోటీ తదితర విషయాల్లో ఎలాంటి ప్రయోజనాలు  ఉంటాయి? 
ఇది దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు సకాలంలో తీసుకున్న పురోగామి చర్య. తదుపరి దశలో అధిక  వృద్ధిని వేగవంతంగా సాధించడానికి పరిశ్రమకు కావల్సిన దీర్ఘకాలిక పెట్టుబడులు లభించేందుకు ఇది ఉపయోగపడుతుంది. కస్టమర్‌ కోణంలో చూస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి. పెట్టుబడి పెరగడం వల్ల సహజంగానే ఆవిష్కరణలకు ఊతం లభిస్తుంది. బీమా సంస్థలు డిజిటల్‌ ప్లాట్‌ఫాంలపై భారీగా ఇన్వెస్ట్‌ చేసేందుకు వీలవుతుంది. దీనితో జీవిత బీమా మరింత సరళంగా మారి, ఇంకా అందుబాటులోకి వస్తుంది. 

అంతిమంగా కస్టమర్ల అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులు, దీటైన ధరలో లభిస్తాయి. సరీ్వసులు కూడా మెరుగుపడతాయి. ఇక, ఏజెంట్లు, బ్రోకర్స్, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లులాంటి ఇంటరీ్మడియరీలకు ఈ సంస్కరణతో మరింత విస్తృతమైన, వైవిధ్యమైన మార్కెట్‌ ఏర్పడుతుంది. బీమా సంస్థలు ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లో కూడా విస్తరిస్తున్న తరుణంలో బీమాపై అవగాహనను పెంచడంలో, ఆఖర్లో ఉన్న వారికి కూడా బీమాను చేరువ చేయడంలో వారి పాత్ర ఇంకా కీలకంగా మారుతుంది. ఇన్సూరెన్స్‌ విస్తృతి ఇంకా అంతంతమాత్రంగానే ఉన్న పరిస్థితుల్లో కవరేజీని విస్తరించడం, ఆర్థిక భద్రతను పటిష్టం చేయడానికి సంబంధించిన దీర్ఘకాలిక విజన్‌కి ఇది దన్నుగా నిలుస్తుంది.  

ప్రీమియంలు, డిమాండ్‌పై జీఎస్‌టీ సంస్కరణల ప్రభావం ఎలా ఉంది? 
ఇది వినియోగదారులకు కచ్చితంగా ప్రయోజనం చేకూర్చేదే. భారత్‌లో సాధారణంగా సున్నా శాతం శ్లాబ్‌ను నిత్యావసరాలకు, మనుగడ సాగించేందుకు కీలకమైన ఉత్పత్తులకు రిజర్వ్‌ చేశారు. బీమాను ఈ ‘ఎసెన్షియల్‌’ విభాగంలోకి చేర్చడం ద్వారా, ఆర్థిక భద్రత అనేది ఉన్నా లేకున్నా ఫర్వాలేదు అనుకోవడానికి లేదని, ప్రతి కుటుంబానికి ఇది కీలక అవసరమని ప్రభుత్వం ఒక శక్తివంతమైన సందేశం ఇచి్చనట్లయింది. 18 శాతం మేర చౌకగా లభించడం వల్ల, పూర్తిగా ప్రొటెక్షన్‌ పథకాలైన టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్ల విషయంలో ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటోంది.

 ప్రొటెక్షన్‌లో సాధారణంగా వెనుకబడి ఉన్న భారత్‌లాంటి మార్కెట్లో ఇది చాలా పెద్ద కరెక్షన్‌గా చెప్పవచ్చు. దీన్ని రెండు రకాలుగా చూడొచ్చు. మొదటిదేమిటంటే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఇప్పుడు 18 శాతం చౌకగా లభించడం వల్ల తొలిసారిగా తీసుకునే వారికి మరింత అందుబాటులోకి వస్తుంది. ఇక రెండో కోణంలో చూస్తే, ప్రస్తుత కస్టమర్లకు అదనపు భారం పెరగకుండా 18 శాతం అధిక కవరేజీ లభించినట్లవుతుంది. అసలు బీమా లేని వారికి, సరైన కవరేజీ లేని వర్గాలకి కూడా జీఎస్‌టీ కోతతో ప్రయోజనాలు లభిస్తాయి. సాంప్రదాయ పథకాలు 4.5 శాతం, రెన్యువల్స్‌ 2.25 శాతం చౌకగా లభించడం వల్ల కస్టమర్లకు సానుకూలంగా ఉంటుంది.  

తెలుగు రాష్ట్రాల్లో బీమా ధోరణులు ఎలా ఉంటున్నాయి? 
ఆర్థికంగా భారీ ఆకాంక్షలు, పురోగామి ఆలోచనా ధోరణులున్న వినియోగదారులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జీవిత బీమాకి సంబంధించి విశిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయి. కాంటార్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం హైదరాబాద్‌లాంటి అర్బన్‌ సెంటర్ల సారథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో క్రియాశీలక ప్లానింగ్, పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ, జీవిత బీమాపై అత్యధిక స్థాయిలో అవగాహన ఉన్నట్లు వెల్లడైంది. ఆర్థిక భద్రతకు నెలకొన్న డిమాండ్‌ని ఈ డేటా సూచిస్తోంది. సర్వే ప్రకారం ఈ ప్రాంతంలోని వినియోగదారుల్లో 78 శాతం మందికి సేవింగ్స్‌ ప్లాన్స్‌ గురించి అవగాహన ఉంది. 

గ్యారంటీగా ఏకమొత్తాన్ని అందించే, లేదా, స్థిరంగా నెలవారీ ఆదాయాన్ని అందించే ప్లాన్లను పరిశీలిస్తామని 87 శాతం మంది తెలిపారు. పొదుపు ఆధారిత పథకాలకు ప్రాథమికంగా ప్రాధాన్యమిస్తున్నప్పటికీ, సమగ్ర భద్రతవైపు మళ్లుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లోని మొత్తం ఎన్‌వోపీల్లో టర్మ్‌ పాలసీల వాటా 32 శాతంగా ఉండగా, వీటి వృద్ధి 50 శాతం మేర ఉంటోందని కోటక్‌ లైఫ్‌ గమనించింది. సంపదను పెంపొందించుకోవడానికి ఎంత ప్రాధాన్యం ఉంటోందో ప్రొటెక్షన్‌కి కూడా అంతే ప్రాధాన్యత లభిస్తోంది. బ్యాంకెష్యూరెన్స్‌ వాటా 48 శాతంగా, ప్రొప్రైటరీ మాధ్యమాల వాటా 52 శాతంగా మా పంపిణీ వ్యవస్థ సమతూకమైన విధంగా ఉంటోంది.  

వచ్చే మూడు నుంచి అయిదేళ్లలో వృద్ధి, విస్తరణ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? 
కార్యకలాపాలు ప్రారంభించిన 25వ సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్ల ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) సాధించడమనేది జీవిత బీమాలాంటి దీర్ఘకాలిక వ్యాపారంలో కోటక్‌ లైఫ్‌ సంపాదించుకున్న విశ్వసనీయతకు నిదర్శనం. మేము ఇప్పుడు 4.3 కోట్ల మందికి భద్రతనిస్తూ, దేశీయంగా దిగ్గజ ప్రైవేట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థల్లో ఒకటిగా కార్యకలాపాలు సాగిస్తున్నాం. 

హ్యాపీయూ యాప్‌లాంటి వాటితో మరింత ఆరోగ్యకరమైన, సురక్షితమైన విధంగా జీవించేలా కస్టమర్లను ప్రోత్హిస్తున్నాం. వచ్చే మూడు నుంచి ఐదేళ్ల వ్యవధిలో గణనీయంగా విస్తరించనున్నాం. ప్రస్తుత 333 శాఖల స్థాయి నుంచి రాబోయే కొన్నేళ్లలో రెట్టింపు స్థాయికి పెంచుకోనున్నాం. ఈ క్రమంలో 1 లక్ష మందికి పైగా ఉన్న మా డి్రస్టిబ్యూటర్ల వ్యవస్థను పటిష్టం చేసుకుంటూ, సర్వీసింగ్‌ .. ఆటోమేషన్‌ని బలోపేతం చేసుకునేందుకు డిజిటల్‌కి సంబంధించి పెట్టుబడులను కొనసాగిస్తాం.   

సంస్థ కార్యకలాపాల్లో కృత్రిమ మేథ వినియోగం ఎలా ఉంటోంది? 
కస్టమర్లు, భాగస్వాములు, ఉద్యోగులు అందరికీ సమగ్రమైన ప్రయోజనాలను అందించే విధంగా ఏఐ, ఎంఎల్‌ (మెషిన్‌ లెరి్నంగ్‌), ఆటోమేషన్‌ కలిసికట్టుగా పని చేయాలని మేము భావిస్తాం. కస్టమర్ల విషయానికొస్తే సోర్సింగ్‌ నుంచి క్లెయిమ్స్‌ వరకు టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తున్నాం. క్లెయిమ్‌ల విషయంలో ఏఐ చాట్‌బాట్‌ల దన్నుతో 80 శాతం లావాదేవీలను డిజిటల్‌కు మార్చగలిగాం. 2 లక్షల క్లెయిమ్‌ల్లో 65 శాతం క్లెయిమ్‌లను ఫైనల్‌ డాక్యుమెంట్లు అందిన రోజే సెటిల్‌ చేశాం. పాలసీల విక్రయాలు, సరీ్వసు కోసం అడ్వైజర్లకి ఆప్టిమస్, బూస్ట్‌ 360, స్మార్ట్‌సెల్‌లాంటి సాధనాలను అందుబాటులోకి తెచ్చాం. ఉద్యోగులకు పూర్తి స్థాయిలో మద్దతు లభించేలా, కావ్య పేరిట ఏఐ ఆధారిత హెచ్‌ఆర్‌ అసిస్టెంట్‌ని ప్రవేశపెట్టాం.  

బీమా విస్తృతి పెరగడానికి ఎలాంటి వ్యూహాలు అవసరం? 
దేశీయంగా జీవిత బీమా విస్తృతి ప్రస్తుతం గ్లోబల్‌ బెంచ్‌మార్క్‌ల కన్నా చాలా దిగువన దేశ జీడీపీలో అత్యంత తక్కువగా 2.8 శాతం స్థాయిలోనే ఉంటోంది. ప్రొటెక్షన్‌ అంతరం దాదాపు 17 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో 80 శాతం మేర ఉంటోంది. 2050 నాటికి రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ అవసరాలు, లభ్యత మధ్య అంతరం 85 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సవాళ్ల తీవ్రత, సత్వరం చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను సూచిస్తున్నాయి. దీన్ని పరిష్కరించేందుకు పరిశ్రమ ప్రధానంగా ట్రిపుల్‌ ‘ఏ’ ఫ్రేమ్‌వర్క్, అంటే అవగాహన పెంపొందించడం (ఎవేర్‌నెస్‌), మరింత అందుబాటులోకి తేవడం (యాక్సెసబిలిటీ), చౌకగా అందించడమనే (అఫోర్డబిలిటీ) వ్యూహాన్ని అమలు చేస్తోంది.  

– హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో

Videos

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

బాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో లడ్డూ వివాదంపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్

ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ వైమానిక దాడి.. 17 మంది మృతి

దేవుడి సన్నిధిలో దందా.. ప్రక్షాళన అంటే ఇదేనా!

నా భర్త అలాంటోడే.. ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

AP: 8వ తరగతి బాలుడిపై ముగ్గురు తోటి విద్యార్థుల లైంగిక దాడి..

విజయ్ & రష్మిక పెళ్లిపై నటుడు ప్రమోద్ శెట్టి కీలక వ్యాఖ్యలు

మీ బెదిరింపులకు భయపడను.. నోటీసులపై పూజిత రియాక్షన్

అది ఏక సభ్య కమిషన్ కాదు.. తెలుగుదేశం పార్టీ కమిషన్

Dharmavaram: నా భర్త అలాంటోడే ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

Photos

+5

సోఫీ షైన్‌ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

పళని మురుగన్‌ని దర్శించుకున్న హీరో నిఖిల్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అంబానీ ఇంద్రభవనానికి హిల్లరీ క్లింటన్‌ (ఫోటోలు)

+5

నరేశ్‌కు ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే? (ఫోటోలు)

+5

సింగర్ మంగ్లీ 'ఇషా' ట్రిప్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

రాధిక, శివకార్తికేయన్‌ కోసం వచ్చిన కమల్‌ హాసన్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అభినయం..అనన్యం (ఫొటోలు)

+5

గ్రాండ్‌ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. ఫుల్‌ జోష్‌లో హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

వైభవంగా శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)