రూ.2–3 కోట్ల ప్రాపర్టీ.. 15 రోజుల్లోనే..

Published on Sat, 02/21/2026 - 15:49

ఇల్లు కొనుగోలు చేయాలంటే సవాలక్ష ఎంక్వైరీలు.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు.. ఇలా చాలా మందికి ప్రత్యక్షంగా ఇల్లు చూపించి, ధర గురించి చర్చించి నిర్ణయం తీసుకోవడం సహజం. కానీ, విలాసవంతమైన ఇంటిని కొందరు కస్టమర్లు చిటికేసినంత సులువుగా కొనుగోలు చేస్తున్నారు. రూ.2–3 కోట్ల ధర ఉన్న ఇళ్లు కొనేందుకు కేవలం 15 రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటున్నారని ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్, ఏఐ విశ్లేషణ వేదిక అస్త్ర రీసెర్చ్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. 2024 సంవత్సరంలో 28 రోజుల సమయం తీసుకునే వారని తెలిపింది.             – సాక్షి, సిటీబ్యూరో  


ప్రాపర్టీ కొనేందుకు అన్వేషించే వారు వాస్తవ కొనుగోలుదారులుగా మారేందుకు పట్టే సమయం.. మొత్తం మార్కెట్‌ డిమాండ్, సెంటిమెంట్‌ను అంచనా వేసేందుకు కీలకమైన కొలమానం. బడ్జెట్‌ను అనుసరించి కస్టమర్లు నిర్ణయం తీసుకునే ప్రాధాన్యతను ఇది సూచిస్తుంది. ‘లీడ్‌ టు బై కన్వర్షన్‌’ డేస్‌లో తగ్గుదలకు ప్రధాన కారణం మెట్రో నగరాలలో పెద్ద టికెట్‌ సైజు ఇళ్ల అమ్మకాలు ఎక్కువగా ఉండటమే. 2025లో అమ్ముడైన అన్ని బడ్జెట్‌ గృహాల్లో రూ.2–3 కోట్ల మధ్య ధర ఉన్న ఇళ్లకు లీడ్‌ టు బై కన్వర్షన్‌ సమయం అత్యల్పంగా ఉంది. 2024లో ఈ ఇళ్ల కొనుగోలు నిర్ణయానికి 28 రోజులు పట్టగా.. గతేడాది కేవలం 15 రోజుల్లోనే ముగించేశారు.

యువ కస్టమర్లకు నచ్చితే చాలు.. 
నేటి యువతరం ఇల్లు కొనుగోలు నిర్ణయాన్ని చిటికేసినంత ఈజీగా తీసేసుకుంటున్నారు. నాణ్యత, ప్రాంతం, వసతులు నచ్చితే చాలు ధర గురించి ఆలోచించకుండా ముందుకెళ్తున్నారు. సాధారణంగా గృహ కొనుగోలులో ధరకే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ, నేటి యువ కస్టమర్లు ధర గురించి పట్టించుకోవట్లేదు. మన దేశంలో అత్యంత ప్రాధాన్య పెట్టుబడి స్థిరాస్తి రంగమే. ఆర్థికంగా సన్నద్ధమయ్యాకే ప్రాపర్టీలను కొనేందుకు ముందుకొస్తున్నారు. అలాగే కొన్ని ఏళ్లుగా మార్కెట్‌లో బ్రాండెడ్‌ డెవలపర్ల నుంచి గృహాల సరఫరా పెరిగింది. నిర్మాణంలో నాణ్యత, గడువులోగా పూర్తి చేస్తారనే విశ్వాసం ఆయా సంస్థలపై ఉండటంతో కొనుగోలుదారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రూ.1–2 కోట్ల ధర ఉన్న ప్రాపరీ్టలను కొనేందుకు 30 రోజులు, రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్న యూనిట్లకు 29 రోజులు పడుతుంది.

విక్రయానికి ఎన్ని రోజులంటే.. 
రూ.1–2 కోట్ల విలువ చేసే ప్రాపర్టీలను విక్రయించేందుకు బ్రోకరేజ్‌ సంస్థలకు 2024లో 47 రోజులు పట్టింది. ఇవి 56 శాతం వేగంగా అమ్ముడయ్యాయి. ఇక, రూ.3 కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే యూనిట్ల అమ్మకానికి 2024లో 17 రోజులు పట్టగా.. గత ఏడాదికి 27 రోజులకు పెరిగింది. అలాగే రూ.50 లక్షలలోపు ధర ఉన్న సరసమైన గృహాలకు గత ఏడాది 19 రోజులు పట్టగా.. అంతకుముందు ఏడాది ఏకంగా 28 రోజులు వేచి చూడాల్సి వచ్చింది.

ఇది చదివారా? సిటీ శివారులో రియల్‌ ఎస్టేట్‌ డిమాండ్‌!

Videos

AP: 8వ తరగతి బాలుడిపై ముగ్గురు తోటి విద్యార్థుల లైంగిక దాడి..

విజయ్ & రష్మిక పెళ్లిపై నటుడు ప్రమోద్ శెట్టి కీలక వ్యాఖ్యలు

మీ బెదిరింపులకు భయపడను.. నోటీసులపై పూజిత రియాక్షన్

అది ఏక సభ్య కమిషన్ కాదు.. తెలుగుదేశం పార్టీ కమిషన్

Dharmavaram: నా భర్త అలాంటోడే ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

అన్ని దేశాలకు 10% గ్లోబల్ టారిఫ్

హిందువుల ద్రోహి చంద్రబాబు.. వెంటనే క్షమాపణ చెప్పాలి

ఇంకోసారి లడ్డు గురించి మాట్లాడాలంటే... బాబుపై కన్నెర్రజేసిన జడ శ్రవణ్

ప్రభాస్ కల్కి 2.. దీపిక ప్లేస్ లో సాయిపల్లవి

ప్రేమలో ప్రభాస్ వైరల్ అవుతున్న వీడియో

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

పళని మురుగన్‌ని దర్శించుకున్న హీరో నిఖిల్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అంబానీ ఇంద్రభవనానికి హిల్లరీ క్లింటన్‌ (ఫోటోలు)

+5

నరేశ్‌కు ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే? (ఫోటోలు)

+5

సింగర్ మంగ్లీ 'ఇషా' ట్రిప్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

రాధిక, శివకార్తికేయన్‌ కోసం వచ్చిన కమల్‌ హాసన్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అభినయం..అనన్యం (ఫొటోలు)

+5

గ్రాండ్‌ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. ఫుల్‌ జోష్‌లో హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

వైభవంగా శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

బెంగళూరు AMB మల్టీఫ్లెక్స్‌లో సందడి చేసిన మహేష్‌ బాబు (ఫోటోలు)