Breaking News

రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌కు 2 కీలక మార్పులు

Published on Thu, 02/19/2026 - 11:19

సాక్షి, హైదరాబాద్‌: ‘రియల్‌ ఎస్టేట్‌’వేగంగా పుంజుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణ రంగంలో కీలక మార్పులు చేయనున్నట్టు విశ్వసనీయ సమా చారం. 250 చదరపు అడగుల విస్తీర్ణం కంటే అధిక విస్తీర్ణంలో చేపట్టే నిర్మాణాల్లో సెట్‌ బ్యాక్‌ నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండేందుకు భవన నిర్మా ణంలో 10 శాతం మేరకు సదరు స్థానిక సంస్థకు తనఖా పెట్టాలన్నది నిబంధన.

భవనం పూర్తయిన తర్వాత టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఇచ్చిన అనుమతుల మేరకు నిర్మించారని, ఎలాంటి ఉల్లంఘనలు లేవని తనిఖీల అనంతరం స్థానిక సంస్థలు లేదా పురపాలక సంఘాలు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) జారీ చే యాలి. ఓసీ జారీ చేసిన అనంతరమే తనఖా పెట్టిన ఆ 10 శాతం భవనాన్ని పురపాలక శాఖ బిల్డర్‌ పేరిట రిలీజ్‌ చేస్తుంది. ఆ తర్వాత మా­త్రమే తనఖా పెట్టిన నిర్మిత భవనాన్ని కొనుగోలు­దారులకు రిజి స్ట్రేషన్‌ చేయాలి.

అయితే ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ రంగం ఆశించిన స్థాయిలో పురోగతి లేదని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, క్రెడాయ్‌ సైతం రాష్ట్ర ప్రభుత్వా నికి తనఖా నిబంధనను తగ్గించాలని విజ్ఞప్తి చేశారని, అందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని అధికార వర్గాల కథనం. ప్రస్తుతం 10 శాతం ఉన్న తనఖా (మార్టిగేజ్‌) నిబంధనను ఐదు శాతా నికి తగ్గించడానికి అంగీకరించింది. ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడ­తాయని పుర పాలకశాఖ ఉన్నతాధికారి ఒకరు వివ­రించారు.

భారీ స్థాయిలో నిర్మాణాలు చేపట్టే బిల్డర్లు స్థానిక సంస్థలకు అభివృద్ధి పన్ను కింద చెల్లించాల్సిన మొత్తాలు రూ.కోట్ల­లో ఉండడంతో ఒకేసారి చెల్లించకుండా.. ఆరు వాయిదా పద్ధతుల్లో చెల్లించడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. అయితే ఆరు వాయిదాల్లో చె­ల్లించే అవకాశాన్ని వినియోగించుకున్న పక్షంలో వారు చెల్లించాల్సిన మొత్తం అభివృద్ధి పన్నుపై 5 శాతం అ­దనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ 5శాతం అదనంగా చెల్లించే మొత్తాన్ని రెండున్నర శాతానికి తగ్గించాలని చేసిన విజ్ఞప్తిపై కూడా ప్రభుత్వం సాను­కూలంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

Videos

ఏపీలో రోడ్లు అధ్వానం టీడీపీ ఎమ్మెల్యే బాబుకు షాక్

దేవుడితో పెట్టుకున్నాడు చుక్కలు చూస్తున్నాడు

వైరల్ గా మారిన ఆలియా భట్ డ్రెస్..

Tirumala : రెండు కాదు ఏడు కొండలే.. అసలు నిజాలు బయటపెట్టిన జగన్

జగనన్న కాలనీల కోసం.. అక్కచెల్లెమ్మలకు ఏకంగా 35,210 కోట్లు ఇచ్చాం

పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఉరి.. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇక దేవుడికే తెలియాలి

ఏమయ్యా అచ్చెన్న.. 6,309 కోట్లు ఇచ్చావా ..? సిగ్గుందా కొంచెమైనా..!

వారణాసిలో కిచ్చా సుదీప్ రోల్ ఏంటంటే..?

ఇందాపూర్ డెయిరీ రూపంలో బయటపడ్డ బాబు కల్తీ కుట్ర

మహేష్ బాబు NEXT మూవీ ఫిక్స్.. అంత్యంత క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా!

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ త్రిష (ఫోటోలు)

+5

పట్టుచీరలో అందంగా సోనియా ఆకుల (ఫోటోలు)

+5

శివబాలాజీ-మధుమిత కుమారుడికి మోహన్‌బాబు ఆశీస్సులు (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)

+5

హీరోయిన్ నయన్ సారిక బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

స్టన్నింగ్‌ ఔట్‌ఫిట్‌తో సమంత.. వైరల్‌ ఫోటోలు

+5

విశాఖ సాగరతీరంలో సాహస గర్జన (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో రంజాన్‌ శోభ (ఫొటోలు)

+5

శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం (ఫొటోలు)

+5

‘విష్ణు విన్యాసం’ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)