ఏపీలో రోడ్లు అధ్వానం టీడీపీ ఎమ్మెల్యే బాబుకు షాక్
Breaking News
ఐటీపై ఇన్వెస్టర్ల ఆందోళన అర్థరహితం
Published on Thu, 02/19/2026 - 08:39
ఐటీ కంపెనీల భవిష్యత్తుపై ఇన్వెస్టర్లలో వ్యక్తమవుతున్న ఆందోళన ‘అర్ధరహిత’మైనదిగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ వ్యాఖ్యానించారు. కృత్రిమ మేథ మరింతగా విస్తరించడంలో పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, డేటా స్క్రబ్బింగ్‌లాంటివి ఇందుకు ఉదాహరణలని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు.
ఆంథ్రోపిక్‌లాంటి కంపెనీలు వినూత్న ఏఐ ప్లాట్‌ఫాంలను ప్రవేశపెడుతుండటంతో ఐటీ కంపెనీల షేర్లు గత కొద్ది రోజులుగా క్షీణించిన నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొన్నాళ్లుగా వివిధ దేశాలు, యూరోపియన్ యూనియన్‌లాంటి కూటములతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు, అమెరికాను కూడా కలిపితే తొమ్మిది డీల్స్ అవుతాయని గోయల్ చెప్పారు.అమెరికాతో ఒప్పందంలో రైతులు, చిన్న సంస్థల ప్రయోజనాలను కాపాడే విధంగా చర్యలు ఉన్నాయన్నారు.
ఇదీ చదవండి: ఏఐ.. మనిషికి సూపర్ పవర్!
Tags : 1