ఏపీలో రోడ్లు అధ్వానం టీడీపీ ఎమ్మెల్యే బాబుకు షాక్
Breaking News
నిస్సాన్ ఎంపీవీ గ్రావైట్
Published on Thu, 02/19/2026 - 05:03
ఉదయ్‌పూర్: జపాన్ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ తమ సెవెన్ సీటర్ ఎంపీవీ గ్రావైట్‌ని మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 5.65 లక్షల నుంచి రూ. 8.49 లక్షల వరకు (ఎక్స్–షోరూం) ఉంటుంది. ప్రస్తుతం మ్యాగ్నైట్ పేరిట భారత్‌లో ఒకే ఉత్పత్తిని విక్రయిస్తున్న నిస్సాన్‌కి ఇది రెండో మోడల్. ఈ ఏడాది టెక్టాన్ ఎస్‌యూవీతో పాటు విశాలమైన సెవెన్ సీటర్ సీ సెగ్మెంట్ ఎస్‌యూవీని కూడా ప్రవేశపెట్టనున్నట్లు నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ సౌరభ్ వత్స తెలిపారు.
మొత్తం మీద ఏడాది వ్యవధిలో మూడు వాహనాలను తీసుకొచి్చనట్లవుతుందని వివరించారు. రూ. 6 లక్షల నుంచి దాదాపు రూ. 20 లక్షల వరకు ధర శ్రేణిలో వాహనాలతో పోర్ట్‌ఫోలియోను పటిష్టం చేసుకుంటామన్నారు. ప్రస్తుతం 160 డీలర్íÙప్లు ఉండగా, ఈ ఏడాది ఆఖరు నాటికి వీటి సంఖ్యను 250కి పెంచుకోనున్నట్లు వత్స వివరించారు. అలాగే, ఎగుమతులపైనా దృష్టి పెడుతున్నామని, 2026–27 ఆర్థిక సంవత్సరంలో 1 లక్ష యూనిట్ల ఎక్స్‌పోర్ట్స్ మార్కును అధిగమిస్తామని ఆయన చెప్పారు.
Tags : 1