చంద్రబాబుకు బిగ్ షాక్ సొంత సర్వేలో 40 MLAల అవినీతి
Breaking News
పవర్‌ఫుల్ సెయాన్
Published on Tue, 02/17/2026 - 00:05
శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమాకు ‘సెయాన్’ టైటిల్ ఖరారైంది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా పతాకాలపై కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ‘అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థలో శివ కార్తికేయన్ చేస్తున్న రెండో సినిమా ఇది.

సోమవారం ‘సెయాన్’ సినిమా టైటిల్‌ని ప్రకటించి, శివ కార్తికేయన్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘రూరల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రం ‘సెయాన్’. పవర్‌ఫుల్ అండ్ డైనమిక్ క్యారెక్టర్‌లో శివ కార్తికేయన్ కనిపిస్తారు. కమర్షియల్ మాస్ అంశాలు, భావోద్వేగాలు, వినోదం.. వంటి అంశాల మేళవింపుతో ఈ సినిమా కథనం సాగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: సంతోష్ నారాయణన్.
Tags : 1