Breaking News

ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్న.. ఉద్యోగం వచ్చేసింది!

Published on Mon, 02/16/2026 - 13:41

జాబ్‌ ఇంటర్వ్యూలలో అభ్యర్థులను అంచనా వేయడానికి ఇంటర్వ్యూయర్లు ఎన్నో సృజనాత్మక పద్ధతులను ఉపయోగిస్తుంటారు. కొన్నిసార్లు వారు అడిగే ప్రశ్నలు అక్కడికక్కడే సమాధానం ఇవ్వడానికి కష్టంగా అనిపిస్తాయి. అలాంటి అనుభవాన్ని ఇటీవల ఒక మహిళ ఎదుర్కొని, దానిని ఉద్యోగ అవకాశంగా మార్చుకుంది.

అనుకోని ప్రశ్న
కాత్యాయని శుక్లా (Katyayani Shukla) అనే ఉద్యోగ అభ్యర్థిని తన అనుభవాన్ని ‘ఎక్స్‌’(గతంలో ట్విట్టర్) లో పంచుకున్నారు. ఆమె ఇటీవల హాజరైన ఉద్యోగ ఇంటర్వ్యూలో ఆ సంస్థ సీఈవో ఒక అసాధారణమైన ప్రశ్న అడిగారు.. “మిమ్మల్ని నియమించుకోకుండా ఉండటానికి ఒక మంచి కారణం చెప్పండి” అని. ఆ ప్రశ్నకు తక్షణం సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేకపోయిన శుక్లా, ఆలోచించడానికి కొంత సమయం కావాలని చెప్పి, తరువాత ఈమెయిల్ ద్వారా సమాధానం పంపుతానని తెలియజేశారు.

“ఆ ప్రశ్నకు నేను సిద్ధంగా లేను. కాబట్టి ఆలోచించడానికి కొంత సమయం కావాలని చెప్పాను” అని ఆమె వివరించారు. కొన్ని గంటల తరువాత సీఈవో ఫాలో-అప్ మెసేజ్ పంపి ఆమె సమాధానాన్ని కోరారు. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత, శుక్లా తన సమాధానాన్ని ఈమెయిల్ ద్వారా పంపించారు. అదే ఆమెకు ఉద్యోగ ఆఫర్‌గా మారింది.

కాత్యాయని ఇచ్చిన సమాధానం ఇదే.. 
సీఈవో అడిగిన గమ్మత్తైన ప్రశ్నకు తాను ఏం సమాధానం చెప్పిందో తన ఈమెయిల్ స్క్రీన్‌షాట్‌ను కూడా కాత్యాయని శుక్లా పంచుకున్నారు. తన సమాధానాన్ని క్షమాపణతో ప్రారంభించిన ఆమె.. “నన్ను నియమించుకోకుండా ఉండటానికి ఒక మంచి కారణం ఏమిటంటే.. నా జీవితం సవ్యంగా అంటే నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను సమతుల్యంగా, వ్యవస్థీకృతంగా ఉంచుకుంటాను” అని రాసుకొచ్చారు.

తాను రోజూ (వీక్‌ డేస్‌లో) 9 గంటల నుండి 5 వరకు మాత్రమే పని చేస్తానని, పని-వ్యక్తిగత జీవితం మధ్య స్పష్టమైన సరిహద్దులు ఉంచుతానని చెప్పారు. ‘ప్రతిదీ అర్జెంట్‌ అని చెబుతుంటారు కానీ నిజానికి ఏదీ అర్జెంట్‌ కాదు’ అని తాను నమ్ముతుంటానన్నారు.

తన సమయం, ఇతరుల సమయం పట్ల గౌరవం చూపడం తనకు అత్యంత ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. కొంతమంది దీనిని ఒక సానుకూల లక్షణంగా చూస్తారని, మరికొందరు వ్యతిరేకంగా భావించే అవకాశం ఉందని ఆమె అంగీకరించారు.

Videos

మీ ముగ్గురి నోరు యాసిడ్ తో కడిగినా ఆ కంపు పోదు... బడ్జెట్ పై జడ శ్రవణ్ సెటైర్లు

నీ పని నువ్వు చూసుకో నాగబాబు తీరుపై టీడీపీ, బీజేపీ నేతల ఆగ్రహం

చంపేసి కారులో పెట్టి..? ప్రమాదం వెనుక మిస్టరీ

లైవ్ లో హెరిటేజ్ నెయ్యిని చూపిస్తూ.. చంద్రబాబు బండారం మొత్తం బట్టబయలు

ఇజ్రాయెల్‌ మహిళపై అత్యాచారం.. ముగ్గురు దోషులకు మరణశిక్ష విధించిన కోర్టు

తెలంగాణలో జనసేన అభ్యర్థికి 2 ఓట్లు.. నిన్ను వెంకటేశ్వర స్వామి కడిగేయడం ఖాయం..

ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నిక పూర్తి వివరాలు ఇవే..!

కష్ట కాలంలో మాకు... మీ అందరినీ మా ఫ్యామిలీ జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది

Stock Market: ఈ ఒక్క స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలు.. కోటీశ్వరులు అయిపోయినట్టే..!

Punjagutta: సైలెంట్ గా కిలో బంగారం కొట్టేశాడు

Photos

+5

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (ఫోటోలు)

+5

‘హే భగవాన్’ మూవీ హీరోయిన్ శివానీ నగరం (ఫొటోలు)

+5

'పెద్ది' సెట్‌లో బుచ్చిబాబు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

భార‌త్ vs పాకిస్తాన్‌ మ్యాచ్‌ సూపర్ హీరో ఇషాన్ కిషన్‌ స్పెషల్ (ఫొటోలు)

+5

శని దోష నివారణకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం..12.5 అడుగుల ఎత్తైన శనిదేవుడి విగ్రహం (ఫొటోలు)

+5

నౌకాదళ పండగ వాతావరణంతో విశాఖ తీరం కళకళ (ఫొటోలు)

+5

నెక్లెస్‌ రోడ్డులో సందడిగా ఉమెన్‌ పింకథాన్‌ రన్‌ (ఫొటోలు)

+5

గెలుపంటే ఇదేరా.. ట్యాంక్‌బండ్ వద్ద క్రికెట్‌ అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

కీసరగుట్టకు పోటెత్తిన భక్తజనం (ఫోటోలు )

+5

ప్రముఖ సినీతారల వాలైంటైన్స్ డే విషెస్ (ఫోటోలు )