Breaking News

వృద్ధాప్యం ఆధ్యాత్మిక సాధనకు వరం

Published on Mon, 02/16/2026 - 00:22

వృద్ధాప్యం అనేది జీవితమనే పుస్తకంలో చివరి అధ్యాయం కావచ్చు, కానీ అది అత్యంత విలువైన గౌరవప్రదమైన దశ. దీనిని కేవలం శారీరక క్షీణతగా కాకుండా, ‘అనుభవాల పండగ’గా చూడాలి. వయసు పెరిగే కొద్దీ కంటి చూపు తగ్గొచ్చు కానీ, జీవితాన్ని చూసే దృష్టి పెరుగుతుంది. ఏది ముఖ్యం, ఏది అనవసరం అనే విచక్షణ వారికి ఉన్నంతగా మరెవరికీ ఉండదు. అందుకే వారిని జ్ఞాన నిధులు అంటారు.

వృద్ధాప్యంలో ఆధ్యాత్మికత అనేది కేవలం పూజలు, పునస్కారాలకే పరిమితం కాదు. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి., జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన పెంచుకోవడానికి చేసే ప్రయాణం. వృద్ధాప్యంలో శారీరక శక్తి తగ్గడం వల్ల కలిగే అసహనాన్ని ఆధ్యాత్మికత తగ్గిస్తుంది. రోజుకు కొద్దిసేపు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవడం వల్ల ఒత్తిడి తగ్గి, మనసు నియంత్రణలోకి వస్తుంది. జీవితంలో జరిగిన మంచి చెడులను సమానంగా స్వీకరించే గుణం అలవడుతుంది. 
వృద్ధాప్యం అనేది కేవలం శారీరక శక్తిని కోల్పోయే దశ కాదు, అది ఆధ్యాత్మిక పురోగతికి అత్యంత అనుకూలమైన సమయం. జీవితంలో బాధ్యతలన్నీ తీరిన తర్వాత, మనసును బయటి ప్రపంచం నుండి మళ్లించి లోపలికి (అంతర్ముఖం) పంపడానికి ఇది ఒక గొప్ప అవకాశం. యవ్వనంలో ఉన్నప్పుడు ధనం, పదవి, పిల్లల భవిష్యత్తుపై ఉండే విపరీతమైన వ్యామోహం వృద్ధాప్యంలో క్రమంగా తగ్గుతుంది. కుటుంబంలో జరిగే విషయాలను ఒక సాక్షిలా గమనించడం అలవడుతుందిఅంతా ‘దైవేచ్ఛ’ అని భావించడం ఆధ్యాత్మిక పురోగతికి మొదటి మెట్టు.

వృద్ధాప్యంలో శారీరక కదలికలు తగ్గినప్పుడు, మనసు లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఈ జీవిత పరమార్థం ఏమిటనే ప్రశ్నలకు సమాధానం వెతకడం మొదలవుతుంది. అనవసరమైన మాటలు తగ్గించి, మౌనంగా ఉండటం వల్ల ప్రాణశక్తి వృధా కాకుండా ఆత్మజ్ఞానానికి తోడ్పడుతుంది. వృద్ధాప్యంలో అహంకారం సహజంగానే తగ్గుతుంది. నా వల్ల ఏమీ కాదు అని తెలిసినప్పుడు, భగవంతుడిపై నమ్మకం పెరుగుతుంది. ‘‘నేను నీ వాడిని, నీవే నన్ను నడిపించు’’ అని భగవంతుడికి పూర్తిగాఅప్పగించుకోవడం (శరణాగతి ) వల్ల కలిగే ప్రశాంతత అద్భుతమైనది. ఇది మరణం పట్ల భయాన్ని పోగొట్టి, ప్రశాంతమైన చిరనిద్రకు (మరణానికి) సిద్ధం చేస్తుంది. తమకున్న అనుభవాన్ని యువతరానికి పంచడం, నిస్వార్థంగా సలహాలు ఇవ్వడం కూడా ఒక ఆధ్యాత్మిక సాధనే.

అందరికీ వృద్ధాప్య దశ వరకు చేరుకునే అదృష్టం కలగదు. ఉన్న పెద్దలను గౌరవించడం అంటే మన భవిష్యత్తును మనం గౌరవించుకోవడమే. జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, అనుభవాలను గడించి, ఒక తరాన్ని తీర్చిదిద్దిన వ్యక్తులు వృద్ధులు. దురదృష్టవశాత్తూ నేటి సమాజంలో లేదా కొన్ని కుటుంబాలలో వారిని ఒక భారంలా చూడటం కనిపిస్తుంది, కానీ అది సరైన దృక్పథం కాదు. ఈరోజు మనం వృద్ధులను ఎలా చూస్తామో, రేపు మన పిల్లలు మనల్ని అలాగే చూస్తారు.
వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరికీ వచ్చే ఒక సహజ ప్రక్రియ. వారిని అనాథ శరణాలయాలకు పంపడం లేదా ఇంట్లో ఒక మూలకు పరిమితం చేయడం వంటివి కాకుండా, వారిని గౌరవప్రదంగా చూసుకోవడం మన సంస్కృతి.

వృద్ధాప్యం అనేది ఒక పండు పక్వానికి వచ్చినట్లు. పండు పండితే తీపి పెరుగుతుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ మనిషిలో శాంతి, క్షమ, ప్రేమ అనే ఆధ్యాత్మిక గుణాలు పెరగాలి. అదే నిజమైన పురోగతి. ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే మనలోని అశాంతిని వదిలి, శాశ్వతమైన ఆనందాన్ని వెతుక్కోవడం. వృద్ధాప్యంలో ఈ సాధన మరింత సులభం, ఎందుకంటే లోకజ్ఞానం మనకు అప్పటికే అనుభవంలోకి వచ్చి ఉంటుంది.

వృద్ధులను వేధించే ప్రధాన సమస్య ఒంటరితనం. ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే భజనలు, ప్రవచనాలు లేదా ఆధ్యాత్మిక చర్చల (సత్సంగం ) ద్వారా సమాజంతో సంబంధం ఏర్పడుతుంది. పరమాత్మ ఎప్పుడూ నాతోనే ఉన్నాడు (భగవంతునితో అనుసంధానం) అనే నమ్మకం వారిలో ధైర్యాన్ని నింపుతుంది. జీవితం ఒక నిరంతర ప్రక్రియ అని, మరణం కేవలం ఒక మార్పు మాత్రమే అనే సత్యాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు బోధిస్తాయి. భగవద్గీత వంటి గ్రంథాల పఠనం ద్వారా మరణం పట్ల ఉండే భయం పోయి, చిత్తశుద్ధి కలుగుతుంది. గతాన్ని తలచుకుని బాధపడకుండా, ఉన్నదానితో తృప్తి చెందడం (సంతోషం) అనేది గొప్ప ఆధ్యాత్మిక లక్షణం. బాధ్యతలు తీరిపోయాయి, ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాననే భావన వారికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.

– రామలక్ష్మీ సదానందమ్‌

Videos

మీ ముగ్గురి నోరు యాసిడ్ తో కడిగినా ఆ కంపు పోదు... బడ్జెట్ పై జడ శ్రవణ్ సెటైర్లు

నీ పని నువ్వు చూసుకో నాగబాబు తీరుపై టీడీపీ, బీజేపీ నేతల ఆగ్రహం

చంపేసి కారులో పెట్టి..? ప్రమాదం వెనుక మిస్టరీ

లైవ్ లో హెరిటేజ్ నెయ్యిని చూపిస్తూ.. చంద్రబాబు బండారం మొత్తం బట్టబయలు

ఇజ్రాయెల్‌ మహిళపై అత్యాచారం.. ముగ్గురు దోషులకు మరణశిక్ష విధించిన కోర్టు

తెలంగాణలో జనసేన అభ్యర్థికి 2 ఓట్లు.. నిన్ను వెంకటేశ్వర స్వామి కడిగేయడం ఖాయం..

ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నిక పూర్తి వివరాలు ఇవే..!

కష్ట కాలంలో మాకు... మీ అందరినీ మా ఫ్యామిలీ జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది

Stock Market: ఈ ఒక్క స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలు.. కోటీశ్వరులు అయిపోయినట్టే..!

Punjagutta: సైలెంట్ గా కిలో బంగారం కొట్టేశాడు

Photos

+5

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (ఫోటోలు)

+5

‘హే భగవాన్’ మూవీ హీరోయిన్ శివానీ నగరం (ఫొటోలు)

+5

'పెద్ది' సెట్‌లో బుచ్చిబాబు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

భార‌త్ vs పాకిస్తాన్‌ మ్యాచ్‌ సూపర్ హీరో ఇషాన్ కిషన్‌ స్పెషల్ (ఫొటోలు)

+5

శని దోష నివారణకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం..12.5 అడుగుల ఎత్తైన శనిదేవుడి విగ్రహం (ఫొటోలు)

+5

నౌకాదళ పండగ వాతావరణంతో విశాఖ తీరం కళకళ (ఫొటోలు)

+5

నెక్లెస్‌ రోడ్డులో సందడిగా ఉమెన్‌ పింకథాన్‌ రన్‌ (ఫొటోలు)

+5

గెలుపంటే ఇదేరా.. ట్యాంక్‌బండ్ వద్ద క్రికెట్‌ అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

కీసరగుట్టకు పోటెత్తిన భక్తజనం (ఫోటోలు )

+5

ప్రముఖ సినీతారల వాలైంటైన్స్ డే విషెస్ (ఫోటోలు )