Breaking News

దేశంలో తొలి రోడ్డు - రైలు సొరంగం

Published on Sun, 02/15/2026 - 14:58

అస్సాంలో గోహ్‌పూర్ నుంచి నుమాలీగఢ్ వరకు నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ విలువ ఏకంగా రూ. 18,662 కోట్లు. ఇందులో భాగంగా బ్రహ్మపుత్ర నది కింద దేశంలో తొలి రోడ్డు - రైలు సొరంగం నిర్మించనున్నారు. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలవనుంది.

ప్రస్తుతం.. NH715లోని నుమాలిఘర్ & NH-15లోని గోహ్‌పూర్ మధ్య దూరం 240 కి.మీ. ఇది NH-52లోని సిల్‌ఘాట్ సమీపంలోని కాలియాభంభోరా మీదుగా వెళుతుంది. ఈ ప్రయాణం నుమాలీగఢ్, కాజిరంగ నేషనల్ పార్క్, బిస్వనాథ్ టౌన్ వంటి ప్రాంతాల గుండా సాగుతుంది. కొత్త గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ నిర్మాణంతో దూరం & ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది.

ఈ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. దీనిని ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్స్ట్రక్షన్ (EPC) మోడల్ ద్వారా అభివృద్ధి చేయనున్నారు. బ్రహ్మపుత్ర నదికి కింద నిర్మించే ఈ రోడ్డు - రైలు టన్నెల్ ద్వారా.. అస్సాం మాత్రమే కాకుండా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ & ఇతర ఈశాన్య రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది.

ఇదీ చదవండి: స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీ

ఈ కారిడార్ 11 ఆర్థిక కేంద్రాలు, మూడు సామాజిక కేంద్రాలు, రెండు పర్యాటక కేంద్రాలు & ఎనిమిది లాజిస్టిక్ కేంద్రాలకు అనుసంధానంగా ఉంటుంది. అంతే కాకుండా నాలుగు ప్రధాన రైల్వే స్టేషన్లు, రెండు విమానాశ్రయాలు, రెండు అంతర్గత జలమార్గాలతో కూడిన మల్టీ మోడల్ కనెక్టివిటీని ఇది బలోపేతం చేస్తుంది. ఇది సరుకు రవాణా సామర్థ్యం పెంచడానికి మాత్రమే కాకుండా.. ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది.

#

Tags : 1

Videos

Badvel : పేదల భూములు కొట్టేస్తున్న పచ్చ గద్దలు.. మాకు చావే గతి

చైర్మన్ పదవిపై జీవన్ రెడ్డి క్లారిటీ

కరీంనగర్ లో చక్రం తిప్పిన సీఎం రేవంత్.. సప్ప పడ్డ బీజేపీ..

శివరాత్రి ఉత్సవాల్లో RK రోజా

బూతులు తిట్టిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు... బాధితుడు అంబటి గారు జైల్లో ఉన్నారు

కొడుకు పెళ్లి సమయంలో వైరలవుతున్న సచిన్ లవ్ స్టోరీ

అంబటి రాంబాబు కుమార్తె మౌనికతో స్ట్రయిట్ టాక్

TDP: కోర్టుని లెక్కచేయకుండా.. రూ. 8000 కోట్లు మాయం

జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చే బాధ్యత నాది..

నేనే రాజు.. నేనే మంత్రి.. శృతిమించిన స్వాతిశయం

Photos

+5

కీసరగుట్టకు పోటెత్తిన భక్తజనం (ఫోటోలు )

+5

ప్రముఖ సినీతారల వాలైంటైన్స్ డే విషెస్ (ఫోటోలు )

+5

టాలీవుడ్ యాంకర్‌ మ్యారెజ్ డే.. భర్తలో లాస్య జ్ఞాపకాలు (ఫోటోలు )

+5

అరుదైన చీరల మేళవింపులో మహారాణిలా సోనమ్..! (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఫిబ్రవరి 15-22)

+5

బ్రహ్మమురారి.. సురార్చితలింగం (ఫొటోలు)

+5

సాహసం శ్వాసగా సాగిపో: విశాఖలో నేవీ విన్యాసాలు (ఫొటోలు)

+5

విశ్వక్‌సేన్‌ 'ఫంకీ' సక్సెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రావెల్‌ అడ్వెంచర్‌ టాక్‌ షో 'సోల్‌ ట్రిప్‌' (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నరేశ్‌- పవిత్ర (ఫోటోలు)