Breaking News

పరమశివుడి భిక్షు పర్యావతారం

Published on Sun, 02/15/2026 - 00:32

పూర్వం విదర్భ రాజ్యాన్ని సత్యరథుడు పరిపాలించేవాడు. సత్యరథుడు పేరుకు తగినట్లే సత్యధర్మ పరాయణుడు. మహా శివభక్తుడు. విదర్భ రాజ్యాన్ని సత్యరథుడు సుభిక్షంగా పాలిస్తుండటం చూసి, సాల్వరాజుకు కన్నుకుట్టింది. ఒకనాడు అతడు విదర్భ రాజ్యంపై దండెత్తాడు. విదర్భ సాల్వ సేనలకు భీకర పోరాటం జరిగింది. సత్యరథుడు కూడా స్వయంగా యుద్ధంలో పాల్గొన్నాడు. యుద్ధంలో విదర్భ సేనలు ఓడిపోయాయి. సత్యరథుడు  సాల్వరాజు చేతిలో నేలకూలాడు.

శత్రుసైన్యం అంతఃపురాన్ని ముట్టడించడానికి వస్తున్నట్లు సత్యరథుడి పట్టపురాణికి సమాచారం తెలిసింది. అప్పటికి ఆమె గర్భవతి. నమ్మకస్తులైన దాసీల సాయంతో ఆమె రహస్యమార్గం గుండా అంతఃపురాన్ని వీడి, అటవీ మార్గంలోకి చేరింది. అడవిలో శిథిలావస్థలో ఉన్న ఒక శివాలయంలో తలదాచుకోసాగింది. కొన్నాళ్లకు నెలలు నిండి, ఆమెకు సర్వశుభలక్షణాలు కలిగిన కొడుకు పుట్టాడు. ఆమె ఆ బాలుడిని అల్లారుముద్దుగా పెంచుకోసాగింది.

ఒకనాడు ఆమె కొడుకును ఆలయంలోనే వదిలి, స్నానం చేయడానికి చేరువలోనే ఉన్న నదికి వెళ్లింది. స్నానం చేస్తుండగా ఆమె మొసలి నోటికి చిక్కింది. మొసలి ఆమెను అమాంతం తినేసింది. ఆలయంలో ఉన్న పసిబాలుడు తల్లి కోసం రోదించసాగాడు. 

అంతలో కొడుకుని చంకనెత్తుకుని అటుగా వెళుతున్న బ్రాహ్మణ వితంతువు ఆలయం నుంచి వినిపిస్తున్న శిశువు రోదనను గమనించి, ఆలయంలోకి వెళ్లింది. ఏడుస్తున్న బాలుడిని ఎత్తుకుని, అతడికి పాలిచ్చి ఓదార్చింది. అతడు ఎవరి బాలుడో తెలియక, ఆ బాలుడి కోసం ఎవరైనా వస్తారేమోనని ఆమె దిక్కులు చూడసాగింది. అప్పుడు పరమశివుడు భిక్షుక రూపంలో ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు.

‘తరుణీ! మనసులో శంకలు వీడి ఈ శిశువును కూడా నీ కుమారుడితో పాటే పెంచు. ఇతడి వల్ల నీకు భవిష్యత్తులో మేలు జరుగుతుంది’ అని చెప్పాడు.

‘భిక్షుకా! ఇంతకీ ఈ బాలుడెవరు? ఇతడి జన్మవృత్తాంతం ఏమిటి?ఈ పిల్లవాణ్ణి నేను తీసుకువెళితే, రాజభటులు నాపై అపహరణ నేరం మోపి, ఉరితీస్తారేమో! అదే జరిగితే ఈ బాలుడితో పాటు నా శిశువు కూడా అనాథ అవుతాడు’ అని భయంగా పలికిందా బ్రాహ్మణ వనిత.

‘తరుణీ! భయపడకు. నేను శంకరుడిని. నా సంకల్పం ప్రకారమే నువ్వు ఇక్కడకు వచ్చావు. నిస్సందేహంగా ఈ బాలుడిని తీసుకువెళ్లి పెంచు’ అని పలికి, ఆ బాలుడి వృత్తాంతమంతా వివరించి తన నిజరూపాన్ని ప్రదర్శించాడు.

ఆమె వెంటనే శంకరుడికి పాదాభివందనం చేసింది. 
‘పరమేశ్వరా! ఈ పసిబాలుడికి ఇంతటి దుర్గతి కలగడానికి కారణమేమిటి? అలాగే నా కుమారుడు నిరుపేద వితంతువునైనా నా కడపున పుట్టడానికి కారణమేమిటి?’ అని ప్రశ్నించింది.

‘తరుణీ! మానవుల జనన మరణాలకు, వారి సుఖదుఃఖాలకు వారు చేసుకున్న కర్మలే కారణం. ఈశ్వరుడిని అయిన నేను ఈ విషయంలో నిమిత్తమాత్రుడను. ఈ రాకుమారుడి తండ్రి సత్యరథుడు గత జన్మలో రాజుగా పాలిస్తూ, ముందు వెనుకలు విచారించకుండా తన సామంతరాజును ఉరితీయించాడు. ఈ జన్మలో అదే సామంతరాజు చేతిలో హతమయ్యాడు. ఇతడి తల్లి గత జన్మలో తన సవతిని విషప్రయోగంతో చంపించింది. ఇక నీ కుమారుడు గత జన్మలో బ్రాహ్మణుడై, ఆశ్రమధర్మాలను విడనాడి నీచులైన వారి వద్ద నీచ ద్రవ్యాన్ని దానాలుగా స్వీకరించి, ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోకుండా జీవించాడు. అందుకే ఇప్పుడిలా జన్మించాడు’ అని పలికి అంతర్ధానమయ్యాడు.

ఆ తర్వాత బ్రాహ్మణ స్త్రీ ఇద్దరు బాలకులను తీసుకుని ఏకచక్రపురానికి చేరుకుంది. అక్కడ నివాసం ఉంటూ ఇద్దరు బాలురను అల్లారుముద్దుగా పెంచసాగింది. తగిన వయసు రాగానే ఇద్దరికీ ఉపనయనాది సంస్కారాలను జరిపించింది. వారికి నిత్యం శివలీలలను వినిపిస్తూ, వారిచేత శివలీలలను గానం చేయిస్తూ, ఇద్దరినీ శివభక్తులుగా తీర్చిదిద్దింది. 

కొన్నాళ్లకు ఇద్దరు బాలకులను ఒక గురువు వద్ద గురుకులంలో చేర్చింది. బ్రాహ్మణ బాలకుడికి బ్రాహ్మణోచిత విద్యలలోను, క్షత్రియ బాలకుడికి క్షత్రియోచిత విద్యలలోను శిక్షణ ఇప్పించింది. ఇద్దరు బాలకులూ గురువు వద్ద వినయ విధేయతలతో మెసలుకొంటూ శీఘ్రంగానే సమస్త విద్యలనూ నేర్చుకున్నారు. 
యుక్తవయసు రాగానే బ్రాహ్మణ బాలకుడు తగిన కన్యను వివాహం చేసుకుని, ఏకచక్రపురం రాజు వద్దనే రాజ పురోహితుడిగా కుదురుకున్నాడు.

క్షత్రియ కుమారుడు ఆ బ్రాహ్మణ కుమారుడి సాయంతో రాజాశ్రయం సంపాదించాడు. తన వృత్తాంతం చెప్పి, రాజును సైనిక సహాయం అర్థించాడు. రాజు సమకూర్చిన సైన్యంతో తన తండ్రిని హతమార్చిన సాల్వరాజుపై యుద్ధం ప్రకటించాడు.

యుద్ధంలో సాల్వరాజును అంతం చేసి, తన తండ్రి పరిపాలించిన విదర్భ దేశాన్ని హస్తగతం చేసుకున్నాడు. విదర్భ రాజ్యానికి పట్టాభిషిక్తుడైన తర్వాత «సత్య ధర్మాలను తప్పకుండా జనరంజకంగా పరిపాలన కొనసాగించాడు.

∙సాంఖ్యాయన

Videos

బడ్జెట్ లో నిరుద్యోగులకు టోకరా.. బాబుపై 420 కేసు!?

ఇది రాష్ట్రం కోసం పెట్టిన బడ్జెట్ కాదు జగన్ కోసం పెట్టిన బడ్జెట్..

చెయ్యి ఆయనది, గడ్డం ఆయనది.. మీకేంటి నొప్పి?

అనిత ఓవరాక్షన్ కు అంబటి కూతురు ఊర మాస్ వార్నింగ్

కాపుతో పెట్టుకున్నారు.. వంగవీటి నరేంద్ర మాస్ వార్నింగ్

పవన్ వారసుడు అకీరా ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?

చంద్రబాబు లడ్డూ కల్తీ జరిగిందని చెప్పడానికి అసలు కారణం ఇదే..

నీకు అంత దమ్ముంటే హెరిటేజ్ నాది కాదు అని చెప్పు

ఛత్తీస్ గఢ్ లోని దాంతరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

పంచారామ క్షేత్రంలో అపచారం

Photos

+5

సాహసం శ్వాసగా సాగిపో: విశాఖలో నేవీ విన్యాసాలు (ఫొటోలు)

+5

విశ్వక్‌సేన్‌ 'ఫంకీ' సక్సెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రావెల్‌ అడ్వెంచర్‌ టాక్‌ షో 'సోల్‌ ట్రిప్‌' (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నరేశ్‌- పవిత్ర (ఫోటోలు)

+5

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ ! (ఫొటోలు)

+5

డాక్టర్‌గా హీరోయిన్ శ్రీలీల.. పట్టా అందుకున్న మధుర క్షణాలు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ హల్దీ వేడుక (ఫొటోలు)

+5

క్రిస్టల్‌ ఐవరీ లెహంగాలో పాలరాతి శిల్పంలా రాధికా స్టన్నింగ్‌ లుక్స్‌ ..! (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మరో డాక్టర్ (ఫొటోలు)

+5

బ్యూటీ విత్‌ బ్రెయిన్‌.. MBBS మధ్యలోనే ఆపేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? (ఫోటోలు )