Breaking News

భారీ బోనస్‌.. ఐటీ కంపెనీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

Published on Sat, 02/14/2026 - 16:20

సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలోని డిసెంబర్ త్రైమాసికం (Q3) కోసం సంస్థ సగటున 85 శాతం పనితీరు బోనస్ ప్రకటించింది. ఈ బోనస్ ఫిబ్రవరి జీతంతో పాటు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కంపెనీ ఈమెయిల్ ద్వారా తెలిపింది.

ఈసారి మెరుగైన చెల్లింపులు
ఈసారి బోనస్ చెల్లింపులు మంచి వ్యాపార ఫలితాలు, కొత్త ఒప్పందాల విజయాల నేపథ్యంలో పెరిగినట్లు సమాచారం. టెక్నాలజీ స్టాక్స్ మార్కెట్లో ఒత్తిడి ఉన్న సమయంలో ఈ ప్రకటన ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.

కొంతమంది ఉద్యోగులు చెప్పినదాని ప్రకారం..  గత త్రైమాసికంతో పోలిస్తే సుమారు 15% ఎక్కువ బోనస్ ఈసారి అందనుంది. కొందరికైతే 100% వరకు కూడా వేరియబుల్ పే లభిస్తోంది. వ్యక్తిగత పనితీరు ఆధారంగా 75% నుంచి 100% మధ్య బోనస్ జమ చేయనున్నట్లు తెలిసింది.

ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కాకుండా, గత ఆర్థిక సంవత్సరంలోని ఏ త్రైమాసికంతో పోల్చినా మెరుగైన చెల్లింపుగా ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ షాజీ మాథ్యూ గత నెల టౌన్‌హాల్ సమావేశంలో ఈసారి వేరియబుల్ పే మెరుగ్గా ఉండొచ్చని సంకేతాలు ఇచ్చారు.

ఇన్ఫోసిస్‌లో ప్రస్తుతం సుమారు 3,23,000 మంది ఉద్యోగులు ఉన్నారు. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో అర్హులైన ఉద్యోగులకు సగటున 75% వేరియబుల్ పే చెల్లించిన సంస్థ, ఈసారి మరింత ఎక్కువగా అందించడం గమనార్హం.

Videos

బడ్జెట్ లో నిరుద్యోగులకు టోకరా.. బాబుపై 420 కేసు!?

ఇది రాష్ట్రం కోసం పెట్టిన బడ్జెట్ కాదు జగన్ కోసం పెట్టిన బడ్జెట్..

చెయ్యి ఆయనది, గడ్డం ఆయనది.. మీకేంటి నొప్పి?

అనిత ఓవరాక్షన్ కు అంబటి కూతురు ఊర మాస్ వార్నింగ్

కాపుతో పెట్టుకున్నారు.. వంగవీటి నరేంద్ర మాస్ వార్నింగ్

పవన్ వారసుడు అకీరా ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?

చంద్రబాబు లడ్డూ కల్తీ జరిగిందని చెప్పడానికి అసలు కారణం ఇదే..

నీకు అంత దమ్ముంటే హెరిటేజ్ నాది కాదు అని చెప్పు

ఛత్తీస్ గఢ్ లోని దాంతరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

పంచారామ క్షేత్రంలో అపచారం

Photos

+5

సాహసం శ్వాసగా సాగిపో: విశాఖలో నేవీ విన్యాసాలు (ఫొటోలు)

+5

విశ్వక్‌సేన్‌ 'ఫంకీ' సక్సెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రావెల్‌ అడ్వెంచర్‌ టాక్‌ షో 'సోల్‌ ట్రిప్‌' (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నరేశ్‌- పవిత్ర (ఫోటోలు)

+5

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ ! (ఫొటోలు)

+5

డాక్టర్‌గా హీరోయిన్ శ్రీలీల.. పట్టా అందుకున్న మధుర క్షణాలు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ హల్దీ వేడుక (ఫొటోలు)

+5

క్రిస్టల్‌ ఐవరీ లెహంగాలో పాలరాతి శిల్పంలా రాధికా స్టన్నింగ్‌ లుక్స్‌ ..! (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మరో డాక్టర్ (ఫొటోలు)

+5

బ్యూటీ విత్‌ బ్రెయిన్‌.. MBBS మధ్యలోనే ఆపేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? (ఫోటోలు )