Breaking News

అంతర్జాతీయ మోడల్‌గా సివిల్‌ ఇంజనీర్‌..! ఒక్క రోజుకే..

Published on Wed, 02/11/2026 - 13:20

ఇంజనీరింగ్‌ చదువుకుంటూనే ఫ్యాషన్‌ ప్రపంచం వైపుకి అడుగులు వేశాడు ఈయువకుడు. ఒక పక్క చదువుని, అభిరుచిని..రెండిటిని సమతుల్యం చేస్తూ..మోడలింగ్‌లో మంచి సక్సెస్‌ని అందుకున్నాడు. అంతేగాదు ఇంజనీర్‌గా ఒక్క ఏడాదిలో సంపాదించే మొత్తం మోడల్‌గా ఒక్కరోజులోనే ఆర్జిస్తూ..గ్లామర్‌కున్న క్రేజ్‌ని చాటి చెప్పాడు. అంతేగాదు రెండు విభిన్న రంగాలను బ్యాలెన్స్‌ చేస్తూ కెరీర్‌ని విజయవంతంగా నిర్మించుకోవచ్చని నిరూపించి, స్ఫూర్తిగా నిలిచాడు. 

అతడే శుభమ్‌ వైద్కర్‌. 24 ఏళ్ల ఈ యుకువడు సివిల్‌ ఇంజనీర్‌ గ్రాడ్యేయేట్‌. కానీ ఇవాళ అంతర్జాతీయ మోడల్‌గా లక్షలు ఆర్జిస్తున్నాడు. అంతర్జాతీయ ఫ్యాషన్‌ బ్రాండ్‌ అర్మానీ కోసం చాలాసార్లు ర్యాంప్‌పై నడిచాడు. ముంబైలో పుట్టి పెరిగిన శుభమ్‌ అక్కడే సివిల​ ఇంజనీరింగ్‌ని పూర్తి చేశాడు. ఇంజనీరింగ్‌ రెండో ఏడాది నుంచే మోడలింగ్‌ ప్రారంభించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక రీల్‌ చూసి దీనిపై ఆసక్తి పెరిగిందని చెప్పుకొచ్చాడు. అయితే అప్పడు తన బరువు 83 నుంచి 84 కిలోలు వరకు ఉండేవాడినని అన్నాడు. 

మోడల్‌ వైపుకి వచ్చానే కానీ..ఎలా అనేది అంతగా తెలియదు. అందుకోసం అని గూగుల్‌లో వెతకగా..మనకు ప్రాతీనిధ్యం వహించడానికి ఏజెన్సీలు అవసరమని తెలుసకున్నానని అంటున్నాడు శుభమ్‌. దాతో తన ఫోటోలు ఏజెన్సీలకు పంపాను..వాటిలో ఒక ఏజెన్సీ తనను మీటింగ్‌కి పిలిచి..నేరుగా బరువు తగ్గాలని సూచించారని తెలిపాడు. అందుకు ఒక నెల సమయం ఇచ్చారని చెప్పుకొచ్చాడు. అయితే వెంటనే శుభమ్‌ టైం వేస్ట్‌ చేయకుండా వెయిట్‌లాస్‌ అయ్యే పనిలో పడ్డాడట. 

అప్పటి నుంచే చక్కెర, జంక్‌ పదార్థాలు, నూనె పదార్థాలకు చాలా దూరంగా ఉండేవాడట. అలా మోడల్‌గా మారేందుకు కష్టబడుతున్న తరుణంలో 2024 జనవరిలో అర్మానీ షో కోసం ఇటలీలోని మిలన్‌కు వెళ్లే అవకాశం తనకు మొదటిసారి లభించిందని చెప్పుకొచ్చాడు. అంతకుమందు భారత్‌లో మోడలింగ్‌గా చేశానని, కానీ విదేశాలకు వెళ్లే ఛాన్స్‌ మాత్రం రాలేదని అంటున్నాడు. ఆ ఏడాదే జూన్‌లో రెండోసారి మిలన్‌ నుంచి పారిస్‌కి ప్రయాణించినట్లు తెలిపాడు. 

జూన్‌లో తన గ్రాడ్యుయేషన్‌ పరీక్షలు పూర్తిచేసుకుని మరి వెళ్లినట్లు పేర్కొన్నాడు. మిలన్‌లో రెండు నెలలు ఉన్నట్లు తెలిపాడు. అయితే మోడలింగ్‌ అనేది స్థిరంగా పనిదొరికే రంగం కాదు. ఈవెంట్లను బట్టి వర్క్‌ అనేది ఉంటుంది. దాంతో శుభమ్‌ వెంటనే భారత్‌కి వచ్చేసి..తన డిగ్రీకి తగిన ఉద్యోగం వెతుక్కుని మరి జాయిన్‌ అయ్యిపోయాడు. నెలకు రూ. 30 వేల వేతనం చెల్లించేది. అయితే మోడలింగ్‌ని పూర్తి సమయం కొనసాగించే నిమిత్తం జాబ్‌లో జాయిన్‌ అయ్యిన ఆరునెలలకే రాజీనామా చేసేశాడు. 

మోడల్‌గా సంపాదన..
సివిల్‌ ఇంజనీర్‌గా నెలకు రూ. 30 వేలు సంపాదిస్తే..మోడల్‌గా ఒక్కరోజు షూట్‌ కోసం లక్షల్లో డబ్బు సంపాదించడం విశేషం. మిలన్‌లో జరిగే రన్‌వే షో కోసం దాదాపు లక్ష నుంచి రెండు లక్షలకు వరకు సంపాదించొచ్చని చెబుతున్నాడు. అడ్వర్టైస్‌మెంట్‌లకే బాగా వేతనం లభిస్తుందని అంటున్నాడు శుభమ్‌. ఒక్కోసారి ప్రాజెక్ట్‌ని బట్టి..రూ. 5 లక్షలు పైనే ఆర్జించొచ్చే అవకాశం ఉందని చెబుతున్నాడు. అయితే ఇక్కడ మొత్తం మోడళ్ల చేతికి వెళ్లదని, ఏజెన్సీ 30% కోత విధిస్తుందని చెప్పుకొచ్చాడు. కేవలం  70%  తాము ఉంచుకుంటామని అన్నాడు. 

ఇక మోడలింగ్‌ పైకి ఆకర్షణీయంగా కనిపిస్తున్నా..తెరవెనుక చాలా కష్టం ఉంటుందని చెబుతున్నాడు శుభమ్‌. తన గ్లామర్‌ లుక్‌ కోసం చాలా ఖర్చు చేయాల్సి కూడా ఉంటుందని అంటున్నాడు. అలాగే ఈవెంట్ల గురించి ఒకరోజు ముందు మాత్రమే తెలుస్తుందట.  అక్కడ వసతికి సంబంధించి..ఏజెన్సీనే చూసుకుంటుంది. గానీ ఇతర ఖర్చులు మనమే భరించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు.  

ఇక ఈ రంగంలో ఒక్కోసారి ప్రదర్శన సమయంలో చివరి క్షణంలో మనల్ని తొలగించే అవకాశం కూడా ఉంటుందట. ఆ టైంలో మానసికంగా  స్థైర్యంగా ఉండటం అంత ఈజీ కాదని అంటున్నాడు శుభమ్‌. అంతేగాదు మోడల్‌గా రాణించాలంటే బరువుని కూడా అదుపులో ఉంచుకోవడమే గాక, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి కూడా. చివరగా శుభమ్‌ ఈ గ్లామర్‌ ఫీల్డ్‌లో నిలదొక్కుకోవాలంటే..తిరస్కరణలను తట్టుకోవాలి, ఓపికతో ఉండాలని అంటున్నాడు. ఎందుకంటే ఒక్కోసారి అసలు పనే ఉండదు..అయినప్పటికీ..అవకాశం కోసం చాలా నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

 

(చదవండి: 'రెండు రకాల తల్లులు'..! థైరోకేర్‌ వ్యవస్థాపకుడి పేరెంటింగ్‌ పాఠాలు..)
 

Videos

మండలిలో మంచి సంఖ్యా బలం ఉంది: వైఎస్ జగన్

బంగారం కంటే ఖరీదైన చెట్టు... కిలో ..రూ. కోటి

కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్

డ్రెస్సింగ్ పై.... హగ్ చేసుకుందాం అనుకున్న కానీ.. చీరలతో వచ్చారు

Konaseema : భారీ అగ్ని ప్రమాదం సిలిండర్ పేలి 10 ఇల్లు అగ్నికి ఆహుతి

ఇప్పుడు అందరినోటా ఈ అమ్మాయి మాటే..

ఇక పై హీరోయిన్ శ్రీలీల కాదు.. డాక్టర్ శ్రీలీల..!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఇవాళ రేట్లు ఎంతంటే..?

ఖానామెట్ లో హైడ్రా కూల్చివేతలు అడ్డుకుంటున్న స్థానికులు, తీవ్ర వాగ్వాదం

కూటమి కుట్ర... అంబటికి మరోసారి 14 రోజుల రిమాండ్

Photos

+5

హీరోయిన్ స్నేహ బిజినెస్‌.. సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

థాయ్‌లాండ్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఐశ్వర్య రాజేశ్‌ (ఫొటోలు)

+5

'హే భగవాన్‌' మూవీ ట్రైలర్‌ లాంచ్ (ఫొటోలు)

+5

మహారాణిలా మెరిసిపోతున్న హీరోయిన్‌ నభా నటేష్ (ఫొటోలు)

+5

'స్వయంభు' మూవీ ప్రెస్‌మీట్‌లో మెరిసిన హీరోయిన్‌ సంయుక్త మీనన్ (ఫొటోలు)

+5

అరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ శివుడు ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : ఘనంగా గుణదల మేరీమాత ఉత్సవాలు (ఫొటోలు)

+5

శ్రీ కాళహస్తీలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

శ్రీశైలం నడకదారి.. భక్తుల రద్దీ (ఫోటోలు)