‘అమెరికాకు భారత్‌ తలొగ్గలేదు’

Published on Sun, 02/08/2026 - 19:12

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వస్తున్న విమర్శలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా ఖండించారు. 18 శాతం సుంకానికి అంగీకరించడం ద్వారా భారత్ అమెరికాకు తలొగ్గిందన్న వాదనల్లో నిజం లేదని స్పష్టం చేశారు. చైనా ఎగుమతులు 35 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారత ఎగుమతులకు లభించే 18 శాతం సుంకం దేశానికి పెద్ద ఊరటనిస్తుందని విశ్లేషించారు. ఇటీవల కుదిరిన ఈ ఒప్పందం అనంతరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గోయల్ కొన్ని అంశాలను వెల్లడించారు.

బలమైన ఆర్థిక శక్తిగా భారత్

ప్రస్తుతం భారత్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎంతో ఆత్మవిశ్వాసంతో చర్చల్లో పాల్గొంటోందని గోయల్ అన్నారు. ‘2047 నాటికి భారత్ 30-35 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. భవిష్యత్తులో మనం అందించే భారీ మార్కెట్‌ అంతర్జాతీయ వాణిజ్య చర్చల్లో దేశానికి అతిపెద్ద బలం’ అని ఆయన అభివర్ణించారు.

అమెరికా నుంచి కొనుగోళ్లు

వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయడంపై భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ‘భారతదేశం పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఈ లక్ష్యం చాలా తక్కువ. మొత్తం రెండు ట్రిలియన్ డాలర్ల దిగుమతి డిమాండ్‌లో అమెరికా వాటా కొంత భాగమే. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి కొంటున్న 300 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను, పోటీతత్వాన్ని బట్టి అమెరికా సరఫరాదారుల నుంచి తీసుకునే అవకాశం ఉంది. విమానయాన రంగం, ఇంధనం, సాంకేతిక ఉత్పత్తులు, కోకింగ్ కోల్‌ వంటి వాటికి భారత్ ప్రాధాన్యత ఇస్తుంది’ అన్నారు.

వ్యూహాత్మక చర్చలు

వాణిజ్య చర్చలంటే కేవలం అంకెలు కాదని, అవి దేశ ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని గోయల్ పేర్కొన్నారు. ‘మేము వివిధ దేశాలతో ఇప్పటివరకు కుదుర్చుకున్న తొమ్మిది ఒప్పందాల్లో ఎక్కడా జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడలేదు. చర్చల్లో ప్రశాంతత ఎంత ముఖ్యమో, అవసరమైనప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించడం కూడా అంతే ముఖ్యం’ అని ఆయన వెల్లడించారు.

భారత్-ఈయూ ఒప్పందంపై మాట్లాడుతూ, ప్రధాని మోదీకి ప్రపంచ దేశాధినేతలతో ఉన్న సాన్నిహిత్యం వల్ల కూటమిలోని 27 దేశాల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. ప్రధాని మార్గదర్శకత్వంలో హోం మంత్రి అమిత్ షా, కేబినెట్ సహకారంతో గ్లోబల్ ట్రేడ్ మార్కెట్‌లో భారత్ కీలకంగా మారుతుందని గోయల్ అన్నారు.

ఇదీ చదవండి: భారత్-యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌పై రైతు సంఘాల ఆగ్రహం

Videos

తప్పు ఒప్పుకున్న చంద్రబాబు.. ఫైన్ కట్టిన హెరిటేజ్

Perni Nani: మీరు మనుషులా.. రాక్షసులా..? రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు

గుంటూరు కోర్టుకు అంబటి రాంబాబు

చిరు పక్కన సారా అర్జున్.. కృతి శెట్టి కథ కంచికేనా..?

సౌందర్య, మోహన్ బాబు వివాదంపై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్

జాతిపిత ఎవరు? కేసీఆర్, జయశంకర్, శ్రీకాంతాచారి

గతంలో బూతు బొమ్మలు & బూతు పుస్తకాల కోసం చాలా కష్ట పడేవాళ్ళం.. కానీ ఇప్పుడు..!

వైఎస్ జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలు

డొల్ల కంపెనీలతో బిగ్ స్కామ్.. OTP లేకుండానే 5 వేల కోట్లు..

లక్షను 40 లక్షలు చేసిన స్టాక్.. జేబులు నింపుకున్న ఇన్వెస్టర్లు..

Photos

+5

గ్లామర్‌తో పడేస్తున్న శ్రద్ధా దాస్‌.. నెట్టింట ఫోటోలు వైరల్‌

+5

హైదరాబాద్ : చార్మినార్ వద్ద ఆధ్యాత్మిక శోభ (ఫొటోలు)

+5

కుటుంబ వివాహ వేడుక.. తమిళనాడు ప్రముఖులకు వైఎస్‌ జగన్‌ ఆత్మీయ పలకరింపు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలీల, థమన్‌, తేజ సజ్జా (ఫోటోలు)

+5

వివాహ వేడుకలో వైఎస్‌ జగన్‌.. జననేతకు ఆత్మీయ పలకరింపులు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ బర్త్ వేడుకల్లో మన్మధుడు హీరోయిన్ అన్షు.. (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్‌ 2026 (ఫొటోలు)

+5

టి20 వరల్డ్‌ కప్‌ ప్రారంభ వేడుక అదుర్స్‌ (ఫొటోలు)

+5

సాక్షి మీడియా గ్రూప్‌, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెంపుల్ రన్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)