ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక

Published on Sun, 02/08/2026 - 15:41

ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు గూగుల్ షాకింగ్ వార్తను అందించింది. ఆండ్రాయిడ్ 12 (Android 12) లేదా అంతకంటే పాత వెర్షన్లపై పనిచేస్తున్న స్మార్ట్‌ఫోన్లకు ఇకపై అధికారికంగా సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లు అందవని ధ్రువీకరించింది. దీనివల్ల దాదాపు 42.1% ఆండ్రాయిడ్ ఫోన్లు సైబర్ దాడులు, మాల్వేర్, స్పైవేర్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అసలు సమస్య ఇదే!

తాజా గణాంకాల ప్రకారం కేవలం 57.9% పరికరాలు మాత్రమే ఆండ్రాయిడ్ 13 లేదా అంతకంటే కొత్త వెర్షన్లను వాడుతున్నాయి. ఆండ్రాయిడ్ వ్యవస్థలోని ‘ఫ్రాగ్మెంటేషన్’ సమస్యే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. గూగుల్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినప్పటికీ గూగుల్‌ పిక్సెల్ ఫోన్లు మినహా మిగిలిన కంపెనీలపై (శాంసంగ్, షావోమి, ఒప్పో, మోటరోలా మొదలైనవి) అప్‌డేట్‌ల విషయంలో గూగుల్‌కు పూర్తి నియంత్రణ ఉండదు. ఫోన్ తయారీదారులు తమ సొంత షెడ్యూల్స్ పాటిస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత పాత మోడళ్లకు అప్‌డేట్‌లు నిలిపివేస్తున్నారు. యాపిల్ తన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రెండింటినీ నియంత్రిస్తుంది కాబట్టి, పాత ఐఫోన్‌లకు కూడా అప్‌డేట్‌లు వేగంగా అందుతాయి. ఉదాహరణకు ఐఓఎస్‌ 26 ఇప్పటికే 50% ఐఫోన్‌ల్లో నడుస్తుండగా ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్ కేవలం 7.5%ఫోన్లలో మాత్రమే ఉంది.

ఏ వెర్షన్లు సురక్షితం? ఏవి కావు?

ప్రస్తుతం సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందుతున్న, నిలిపివేసిన వెర్షన్ల జాబితా ఇక్కడ ఉంది.

భద్రతా అప్‌డేట్‌ ఉన్నవిసాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ నిలిపేసినవి
ఆండ్రాయిడ్ 16ఆండ్రాయిడ్ 12
ఆండ్రాయిడ్ 15ఆండ్రాయిడ్ 11
ఆండ్రాయిడ్ 14ఆండ్రాయిడ్ 10
ఆండ్రాయిడ్ 13ఆండ్రాయిడ్ 9, అంతకంటే పాతవి

 

ముప్పులేమిటి?

సెక్యూరిటీ అప్‌డేట్‌లు లేని ఫోన్ వాడటం అంటే తాళం లేని ఇంట్లో ఉండటమే. మాల్వేర్ దాడుల వల్ల కొన్ని నష్టాలు సంభవించవచ్చు.

  • మీ యూజర్ నేమ్స్, పాస్‌వర్డ్‌ల చోరీ.

  • బ్యాంకింగ్, ట్రేడింగ్ యాప్స్ హ్యాకింగ్.

  • ఓటీపీ సందేశాలను అడ్డగించడం.

  • మీ ఆర్థిక ఖాతాల నుంచి డబ్బు మాయం కావడం.

గూగుల్ ప్లే ప్రొటెక్ట్ సరిపోదా?

ఆండ్రాయిడ్ 7 నుంచి అన్ని వెర్షన్లలో ‘ప్లే ప్రొటెక్ట్’ రియల్ టైమ్ మాల్వేర్ స్కానింగ్ అందిస్తుందని గూగుల్ తెలిపింది. అయితే ఇది కేవలం యాప్స్ స్థాయిలోనే రక్షణ ఇస్తుంది. సిస్టమ్ స్థాయిలో ఉండే లోపాలను (Security Patches) ఇది సరిదిద్దలేదు. కాబట్టి పాత ఫోన్లు ప్రమాదంలో ఉ‍న్నట్లేనని గమనించాలి.

ఇప్పుడేం చేయాలి?

మీ ఫోన్ సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేయండి.

1. ఫోన్‌లో Settings ఓపెన్ చేయండి.

2. తర్వాత About Phone కు వెళ్లండి.

3. Android Versionను తనిఖీ చేయండి.

ఒకవేళ మీ ఫోన్ ఆండ్రాయిడ్ 12 లేదా అంతకంటే పాతది అయితే దాన్ని అప్‌గ్రేడ్ చేయడం శ్రేయస్కరం. గూగుల్ సలహా ప్రకారం.. మీ ఫోన్‌ ఖరీదైన ఫ్లాగ్‌షిప్ ఫోన్ కానవసరం లేదు. కనీసం ఆండ్రాయిడ్ 13 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉన్న ఫోన్ కొనుగోలు చేసినా మీకు భద్రత లభిస్తుంది.

ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ ‘ఇడియట్ ఇండెక్స్’

Videos

తప్పు ఒప్పుకున్న చంద్రబాబు.. ఫైన్ కట్టిన హెరిటేజ్

Perni Nani: మీరు మనుషులా.. రాక్షసులా..? రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు

గుంటూరు కోర్టుకు అంబటి రాంబాబు

చిరు పక్కన సారా అర్జున్.. కృతి శెట్టి కథ కంచికేనా..?

సౌందర్య, మోహన్ బాబు వివాదంపై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్

జాతిపిత ఎవరు? కేసీఆర్, జయశంకర్, శ్రీకాంతాచారి

గతంలో బూతు బొమ్మలు & బూతు పుస్తకాల కోసం చాలా కష్ట పడేవాళ్ళం.. కానీ ఇప్పుడు..!

వైఎస్ జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలు

డొల్ల కంపెనీలతో బిగ్ స్కామ్.. OTP లేకుండానే 5 వేల కోట్లు..

లక్షను 40 లక్షలు చేసిన స్టాక్.. జేబులు నింపుకున్న ఇన్వెస్టర్లు..

Photos

+5

గ్లామర్‌తో పడేస్తున్న శ్రద్ధా దాస్‌.. నెట్టింట ఫోటోలు వైరల్‌

+5

హైదరాబాద్ : చార్మినార్ వద్ద ఆధ్యాత్మిక శోభ (ఫొటోలు)

+5

కుటుంబ వివాహ వేడుక.. తమిళనాడు ప్రముఖులకు వైఎస్‌ జగన్‌ ఆత్మీయ పలకరింపు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలీల, థమన్‌, తేజ సజ్జా (ఫోటోలు)

+5

వివాహ వేడుకలో వైఎస్‌ జగన్‌.. జననేతకు ఆత్మీయ పలకరింపులు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ బర్త్ వేడుకల్లో మన్మధుడు హీరోయిన్ అన్షు.. (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్‌ 2026 (ఫొటోలు)

+5

టి20 వరల్డ్‌ కప్‌ ప్రారంభ వేడుక అదుర్స్‌ (ఫొటోలు)

+5

సాక్షి మీడియా గ్రూప్‌, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెంపుల్ రన్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)