మంత్రి మీటింగ్ కోసం అంతిమయాత్రను అడ్డుకున్న పోలీసులు
Breaking News
నా జీవితంలో స్టార్ ఉన్నాడు!
Published on Sun, 02/08/2026 - 02:35
సొసైటీ ఇచ్చే స్టేట్‌మెంట్ లేబుల్స్ అంటే అలర్జీ. ఇతరుల అంచనాలన్నింటినీ లైట్‌గా స్కిప్ చేస్తూ, తనదైన దారిలో తన సొంత ప్రపంచంలో జీవిస్తోంది ఫారియా అబ్దుల్లా. ఇప్పుడు ఆ ప్రపంచం గురించిన విషయాలన్నీ ఆమె మాటల్లోనే...
⇒ నా పేరు ఫారియా. చాలామంది ‘ఫైరియా’ అని పిలుస్తారు. నటనకు ముందు ఆరు సంవత్సరాలు హైదరాబాద్‌లో థియేటర్ ఆర్టిస్ట్‌గా పని చేశాను. అక్కడే నటిగా పునాది పడింది. అంతకంటే ముందే నేను డాన్సర్, మ్యూజీషియన్ , క్రియేటివ్ ఆర్టిస్ట్‌ని.
⇒ ‘జాతి రత్నాలు’ వచ్చాక నా జీవితం ఫుల్ టర్న్ తీసుకుంది. ఎంతలా అంటే ‘ఎవరు ఈ అమ్మాయి?’ నుంచి, ‘మన చిట్టి!’ అంటూ ప్రతి కుటుంబం నన్ను వాళ్ల అమ్మాయిలా దగ్గరకు తీసుకుంది.
⇒ అవును, నేను రిలేషన్ లో ఉన్నాను. ఇది సీక్రెట్ కాదు, ప్రైవేట్. అతను ఒక కొరియోగ్రాఫర్. నేను ముస్లిం, అతను హిందువు. కాని, మా మధ్య ఇవన్నీ ఎప్పుడూ సమస్య కాలేదు. మాది ప్రేమకథ అనడం కన్నా పార్ట్‌నర్‌షిప్ అనడమే నాకు ఇష్టం. నా డాన్స్, నా ర్యాప్‌లో కనిపించే ఎనర్జీ వెనుక అతని సపోర్ట్ బోనస్‌లా పనిచేస్తుంది.
⇒ ఇప్పటివరకు అతని పేరు, ముఖం రివీల్ చేయలేదు. కాని, నా వీడియోల్లో క్లూస్ వెతుకుతున్న ఇంటర్నెట్ డిటెక్టివ్‌లను చూస్తే నవ్వొస్తుంది. ‘సారీ గైస్’ మీరు ఇంకా లెవెల్ అప్ కాలేదు.
⇒ ఐదు అడుగుల పది అంగుళాల ఎత్తు ఒకప్పుడు మైనస్ అన్నారు. కేవలం గెస్ట్ రోల్స్‌కే సరిపోతావు అని కామెంట్స్ చేసేవారు. నేను మాత్రం నా సినిమాలతోనే వాళ్లకు సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నా.
⇒ డాన్స్ నా ఫస్ట్ లవ్. నన్ను నేను ‘మూవ్‌మెంట్ ప్రాక్టీషనర్’గా పిలుచుకుంటాను. హిప్‌హాప్, కథక్, బెల్లీ, బీ–బాయింగ్ ఇలా నా శరీరమే నా భాష.
⇒ ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’, ‘రావణాసుర’, ‘మత్తు వదలరా 2’, ‘కల్కి’ ఇలా ప్రతి సినిమా నాకు కొత్త పాఠం నేర్పింది. ఇప్పుడు తమిళంలో ‘వల్లి మయిల్’. అందులో స్టంట్స్ కూడా చేశాను. ఈసారి కొత్త ఫారియాను చూడబోతున్నారు.
⇒ నటనతో పాటు సంగీతం కూడా నా ప్రాణం. నేను పాడుతాను, రాస్తాను, కంపోజ్ చేస్తాను. ‘డ్రామా నక్కో మామ’ పాట పూర్తిగా నా మ్యూజికల్ ఎక్స్‌పెరిమెంట్.
⇒ నా బ్యూటీ రొటీన్ చాలా సింపుల్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, కాన్షస్ ఈటింగ్ అదే నా గ్లో సీక్రెట్. మేకప్ తీసేయడానికి బేబీ ఆయిల్, హెయిర్‌కు వారానికి రెండు మూడుసార్లు ఆయిల్ మసాజ్ తప్పనిసరి.
⇒ తినడంలో బిర్యానీ నా బలహీనత. దోశ, ఇడ్లీ లాంటి సింపుల్ ఫుడ్ అంటే కూడా ఇష్టం. ట్రావెల్ చేసినప్పుడు మక్బూస్, లుకైమాత్ లాంటి రుచులు కూడా ట్రై చేశాను.
⇒ నా జీవితంలో ఇంకొక స్టార్ ఉన్నాడు. అదే నా పిల్లి ‘సెబాస్టియన్ ’. అతను లేకపోతే నా సోషల్ మీడియా అకౌంట్ అసంతృప్తిగానే ఉంటుంది.
Tags : 1