Breaking News

ఆ గాయం జీవితాన్ని మార్చి..స్ఫూర్తిగా నిలిపింది..!

Published on Sat, 02/07/2026 - 14:02

మార్పు అన్నది ఎక్కడ నుంచో కాదు మన నుంచే రావాలి అంటుంటారు పెద్దలు. ఆ మాటకు నిలువెత్తు నిదర్శనం ప్రతీక్ ఖండేల్వాల్. కష్టం రాగానే అనిపించేది.. 'నాకే ఎందుకు అని'..కానీ ప్రతీక్‌ తనలా ఇబ్బంది పడుతున్న వాళ్లెందరూ.. అని ఆలోచించాడు. తనకు సవాలుగా మారిన పరిస్థితులన్ని..తనలాంటి వాళ్లెందరు ఎదుర్కొంటున్నారో గమనించాడు. ఆ మార్పుకు తానే ఎందుకు శ్రీకారం చుట్టుకూడదు అనుకున్నాడు. ఆ క్రమంలో కూడా ఎన్నో వ్యతిరేకతలు, సవాళ్లు. అయితేనేం తను అనుకున్నట్లుగా మార్పు వచ్చేలా చేసి..అందరికీ ఆమోదయోగ్యమైన వాతావరణాన్ని సృష్టించి శెభాష్‌ అనిపించుకోవడమే గాక 'ది బెస్ట్‌ రోల్‌మోడల్‌'గా జాతీయ అవార్డు అందుకుని స్ఫూర్తిగా నిలిచాడు. 

అతడే బెంగళూరుకి చెందిన ప్రతీక్ ఖండేల్వాల్. 2014లో జరిగిన కారు ప్రమాదంలో వెన్నుముక తీవ్రంగా దెబ్బతింది. దాంతో అతడు పూర్తిగా మంచానికే పరిమితయ్యాడు. 20 ఏళ్లకే అతడి జీవితం..గమనం లేకుండా అయిపోయింది. వీల్‌ఛైర్‌కే పరిమితమైపోయాడు. అయితే అప్పుడే తెలిసింది తనలాంటి దివ్యాంగులు పడుతున్న కష్టాల గురించి. ఈ నగరాలన్నీ అవయవాలు బాగున్న వాళ్లకే సౌకర్యంగా ఉన్నాయని గుర్తించాడు. పబ్లిక్‌ ప్రదేశాలు..కార్యాలయాలు, ఆస్ప​త్రులు ఇలా ప్రతీది దివ్యాంగులకు అననుకూలమైనవని గుర్తించాడు. 

ఈ మహానగరాలు మాలాంటి వాళ్లకు సౌలభ్యాన్ని అందిచలేనివా.. అనే ప్రశ్నలు ప్రతీక్‌ని చుట్టుముట్టాయి. అక్కడ నుంచి పుట్టుకొచ్చిందే.."ర్యాంప్‌మైసిటీ" సంస్థ. నగరాలను అందరికీ సౌలభ్యకరంగా మార్చే లక్ష్యంతో ర్యాంప్‌మైసిటీని ప్రారంభించి..ఎన్నో ‍ప్రదేశాల్లో వికలాంగులు, పెద్దవాళ్లు, ఈజీగా నడవ గలిగేలా ర్యాంప్‌లు ఏర్పాటు చేశాడు. పోలీస్‌ స్టేషన్‌తో సహా అన్ని ప్రదేశాల్లో ఇవి ఏర్పాటు చేసేలా అవగాహన కల్పించాడు. మొదట్లో ఇవెందుకు చాలా ఖర్చు అనే ప్రశ్నలతో వ్యతిరేత వచ్చినా..ఆగలేదు ప్రతీక్‌. 

ఎలాగైనా, ఏనాటికైనా..తాను అనుకున్నది నెరవేరాలనే సంకల్పంతో ముందగుకు సాగి..ఇప్పటి వరకు మొత్తం 600 బహిరంగ ‍ప్రదేశాల్లో ఈ ర్యాంప్‌లను ఏర్పాటు చేశాడు. పట్టణ జీవితం అందరికీ అనుకూలంగా ఉండాలి..అన్ని సౌకర్యాలు అనుభవించాలి అన్న ఆ కాంక్ష నుంచి వచ్చిన ఈ ఆలోచన..తనలాంటి వాళ్లకు ఎందరికో ఉపయోగపడింది. అనుకోని వైకల్యం శాపమైందని అనిపించేలా పబ్లిక్‌ ప్రదేశాలు..రోజువారీ ప్రదేశాలు కనిపించకూడదు..మాలాంటి వాళ్ల ఉనికి సులభతరం చేసేలా ఉండాలి అంటాడు ప్రతీక్‌. అతడి నిస్వార్థపూరితమైన ఆ ఆలోచనే ప్రతీక్‌ని ఏకంగా రాష్ట్రపతిచే ది బెస్ట్‌ రోల్‌ మోడల్‌గా జాతీయ అవార్డుని అందుకునేలా చేసింది. 

అంతేగాదు అనుకోని వైకల్యం లేదా పుట్టుకతో వైకల్యం అయినా..మన సంకల్ప శక్తి ముందు చాలా చిన్నది..మన గమనాన్ని ఎన్నటికీ ఆపలేదని నొక్కి చెబుతుంటాడు ప్రతీక్‌. ఇక్కడ ప్రతీక్‌ తన గాయాన్నే బలంగా మార్చుకుని..తనలాంటి వాళ్లకు నగరాలకు అనుకూలంగా మార్చే ఆవిష్కరణకు నాంది పలికి..శెభాష్‌ అనిపించుకున్నాడు. ఈ కథ విధి వెక్కిరించే ప్రయత్నం చేస్తే..తగిన విధంగా బదులివ్వాలే గానీ నిరాశ నిస్ప్రుహల్లోకి వెళ్లిపోకూడదు అని చెబుతోంది కదూ..!. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే నానుడికి అసలైన అర్థం ఈ ప్రతీక్‌.

(చదవండి: అందువల్లే భారత్‌ చాలా స్పెషల్‌..! ఫ్రెంచ్‌ మహిళ ప్రశంసల జల్లు)

 

(చదవండి: అందువల్లే భారత్‌ చాలా స్పెషల్‌..! ఫ్రెంచ్‌ మహిళ ప్రశంసల జల్లు)

 

Videos

రాజు ఎక్కడున్నా రాజే.. చెన్నైలో వైఎస్ జగన్ ప్రభంజనం

నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లిని ములాఖత్ లో కలిసిన చెవిరెడ్డి

రాంబాబు భౌతికకాయానికి నివాళులర్పించిన వైఎస్సార్సీపీ నేతలు

పవన్ కల్యాణ్ ఇప్పుడే గుర్తొచ్చారా? అంబటి మౌనిక అదిరిపోయే రిప్లై

50 మంది విద్యార్థులకు అస్వస్థత.. రంపచోడవరం ప్రభుత్వాస్పత్రికి తరలింపు

సౌందర్యతో సినిమా నా జన్మ ధన్యమైంది.. 365 రోజులు ఆడిందంటే నేనే నమ్మలేదు

ఈ నెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తిరుమల లడ్డు ప్రసాదంపై ది వైర్ వెబ్ సైట్ సంచలన కథనం

చంద్రబాబు, పవన్ కుట్రలు చేస్తున్నారు.. కూటమిలో భయం మొదలైంది

టీడీపీ నేతలే షాక్ అయ్యేలా ఎల్లో భజన చేస్తున్న జనసేన బ్యాచ్

Photos

+5

వైట్ టాప్ లో టాప్ లేపుతున్న జాక్వెలిన్.. గ్లామర్ (ఫొటోలు)

+5

సమ్మక్క–సారలమ్మ జాతర హుండీల లెక్కింపు (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈజలపాతం తెలుసా.. కదిలే వంతెనలు..అదిరే గుండెలు (ఫొటోలు)

+5

కొత్త సినిమా ప్రారంభోత్సవంలో సాయి పల్లవి, శ్రీలీల (ఫొటోలు)

+5

అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)

+5

ఐస్‌క్రీం ఈవెంట్ లో సినీ నటి రీతూవర్మ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఆభరణాల ప్రదర్శనలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో జన జాతరను చూశారా? (ఫొటోలు)

+5

హైదరాబాద్ : షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీ (ఫొటోలు)