జోగి రమేష్‌ను పరామర్శించిన బొత్స
Breaking News
బాహుబలి బాటలో RRR.. రాజమౌళి ప్రకటన
Published on Sat, 02/07/2026 - 13:04
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’.. ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్‌తో పాటు ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా హాలీవుడ్ మీడియాకి రాజమౌళి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన చివరి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్.. ఆస్కార్ అవార్డ్ దక్కడంతో ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ పేరు వైరల్ అయింది. అయితే, తాజాగా ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. RRR అనిమేషన్ చిత్రంగా రూపొందించాలని యోచిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ గురించి తాను అనేక జపనీస్ స్టూడియోలతో చర్చలు జరుపుతున్నానని ఆయన అన్నారు.

అధికారికంగా ఇంకా ఏమీ ప్రారంభం కానప్పటికీ, ప్రస్తుతం ఆయన చేసిన ఈ ప్రకటనపై అనిమేషన్ ప్రేమికులు అభినందిస్తున్నారు. బాహుబలి రెండు భాగాలను యానిమేషన్ సిరీస్‌గా ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం 2027 లో విడుదల కానుంది. ఇప్పుడు తెరపైకి ఆర్‌ఆర్‌ఆర్ కూడా చేరడంతో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
Tags : 1