జోగి రమేష్‌ను పరామర్శించిన బొత్స
Breaking News
పూలమ్మే అమ్మాయి చెప్పిన గొప్ప జీవిత పాఠం..!
Published on Sat, 02/07/2026 - 10:49
కొన్ని చిన్న సంఘటలను మనల్ని ఎంతగానో కదలించి..నిశబ్దమైన జీవిత పాఠాన్ని నేర్పిస్తాయి. ఆ క్షణంలో మనకు నచ్చనిది కూడా ఎందుకనో ఇష్టంగా మారుతుంది. అది మనకు అపురూపమైన క్షణంగా మారుతుంది. చుట్టూ పరిస్థితులు ఎంత హృద్యంగా ఉన్నా.. వాళ్ల ముఖాల్లోని నవ్వు మనకెంతో నేర్పిస్తుంది. అందుకు ఉదాహరణ ఈ పూలు అమ్మే అమ్మాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
ఆ వీడియోలో పూలు అమ్మే అమ్మాయికి, ఒక యువతికి జరుగుతన్న చక్కటి సంభాషణ ఇది. మహెక్ షా అనే అమ్మాయి తనకెదురైన అనుభవాన్ని నెటిజన్లతో షేర్ చేసుకుంది. తనకు సాధారణంగా పూలంటే ఇష్టముండదని, అవి ఒక్కరోజులోనే వాడిపోతాయనే బాధతోనే ఇష్టపడని అన్నారామె. అందుకే తాను పూలకు చాలా చాలా దూరంగా ఉంటానని అన్నారామె. అయితే అదేం తెలియని ఆ పూలమ్మే అమ్మాయి..ఓ పువ్వుని తీసుకొచ్చి నేరుగా ఒళ్లో పెట్టేసింది.
తనకు నచ్చవని చెప్పిన పర్లేదు..ఉచితంగానైనా తీసుకోండని అభ్యర్థించింది. చివరికి తాను ధర ఎంత అని అడగగానే..తోచింది ఇమ్మని కోరింది. దాంతో కొంత మొత్తం చెల్లించాను. దాంతో ఆమె ఎంతో సంతోషంతో వెనుదిరిగింది. అయితే ఆమె ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ పూలు తన ఒళ్లోబెట్టిన విధానం..తనను ఆ క్షణం పూలను ఇష్టపడేలా చేసింది. పైగా ఎంతో అప్యాయంగా నవ్వతూ మాట్లాడిన ఆ అమ్మాయిని చూసి.సదా ఉల్లాసభరితంగా ఉండటం ఎలాగో తెలిసిందంటూ.. అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
అంతేగాదు షా ఆ వీడియోకి..ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్న మనం మాత్రం దయగానే ప్రవర్తించాలి. అలా ఉండాటానికి మించి గొప్ప నైపుణ్యం మరోకటి లేదంటూ క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. నెటిజన్లు..ఈ ఘటన దయకు చిరునామా, అలాగే..ఏ పనిచేసినా..నవ్వుతూ చేస్తే మనంత ధనవంతుడు మరొకరు ఉండరు అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: 50 తర్వాత ఇంట్లోనే చేసే వెయిట్‌లాస్ వ్యాయామాలు..!)
Tags : 1