Breaking News

శంషాబాద్‌కు కొత్త ఫేమ్‌.. ఇక మరో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌!

Published on Sat, 02/07/2026 - 08:56

భాగ్యనగరానికి దక్షిణ ద్వారంగా పిలిచే శంషాబాద్‌.. ఇకముందు దేశానికే ఏరోట్రోపోలిస్‌ హబ్‌గా నిలవనుంది. బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై.. దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్‌ సిటీలను కలిపే ఏకైక హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌ నగరంగా శంషాబాద్‌ అభివృద్ధి చెందనుంది. ఇక్కడ హైస్పీడ్‌ టరి్మనల్‌ ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనతో.. శంషాబాద్‌ ఇక శివారు ప్రాంతం కాదు.. దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారనుంది. – సాక్షి, సిటీబ్యూరో

ఇప్పటికే రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో ఏరోస్పేస్‌ హబ్‌గా అభివృద్ధి చెందిన శంషాబాద్‌.. తాజా ప్రకటనతో అటు ఏరోస్పేస్, ఇటు ట్రయిన్‌ నెట్‌వర్క్‌ మిశ్రమంతో ఏరోట్రోపోలిస్‌ హబ్‌గా శంషాబాద్‌ అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏ నగరంలోనైనా సరే రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రాంతం సాధారణంగానే శరవేగంగా అభివృద్ధి చెందుతుంది.

కానీ, శంషాబాద్‌ ప్రాంతానికి మెరుగైన రోడ్లతో పాటు విమానయానం, రైలు మార్గం.. అన్ని రకాల మెరుగైన రవాణా సదుపాయాలతో అనుసంధానమై ఉన్నాయి. అంతేకాదు శంషాబాద్‌కు తెలంగాణలోని సగానికి పైగా జిల్లాలతో అనుసంధానమైన ఔటర్‌ రింగ్‌ రోడ్డు కనెక్టివిటీ కూడా ఉంది. అలాగే భవిష్యత్తులో మెట్రో రైలు, రీజినల్‌ రింగ్‌ రోడ్‌(త్రిబుల్‌ ఆర్‌)తో కూడా అనుసంధానమవుతుంది.

ఐటీ హబ్‌లతో అనుసంధానం.. 
దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌లలో రాజీవ్‌గాంధీ విమానాశ్రయం ఒకటి. ఇక్కడి నుంచి సుమారు వందకు పైగా నగరాలు అనుసంధానమై ఉన్నాయి. ఏటా 2.7 కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవలే ప్రభుత్వం శంషాబాద్‌ వరకూ మెట్రో విస్తరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన నగరంతో పాటు గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ వంటి ఐటీ కేంద్రాలకు ప్రయాణం సులువవుతుంది.

విమానాశ్రయ కారిడార్‌ సమీపంలోని ఇళ్లు, హోటళ్లు, వాణిజ్య ప్రాపర్టీలకు డిమాండ్‌ ఏర్పడుతోంది. అలాగే దేశంలోని ప్రధాన ఐటీ హబ్‌లైన బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్‌ నగరాలను ఈ హైస్పీడ్‌ రైలు అనుసంధానించనుంది. ఐటీ ఉద్యోగులు ఒకే పని దినంలో ఒక నగరం నుంచి మరొక నగరానికి సులువుగా రాకపోకలు సాగించే వీలుంటుంది. తద్వారా విద్య, వైద్యం, పర్యాటక రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి.

ఈ ప్రాంతాలకు డిమాండ్‌.. 
2–3 ఏళ్లలో శంషాబాద్, ఔటర్‌ వెంట ఉన్న ప్రాంతాలలో భూముల ధరలు 15–25 శాతం మేర పెరిగాయి. విమానాశ్రయం, గిడ్డంగులు, లాజిస్టిక్‌ హబ్‌లు, ప్రతిపాదిత మెట్రో మార్గానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందాయి. తాజా ప్రకటనతో శంషాబాద్‌ నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, మణికొండ, హైటెక్‌ సిటీ, కోకాపేట ప్రాంతాలలో భారీ నివాస సముదాయాలు వస్తాయి.

సమగ్ర అభివృద్ధి దిశగా..
ఈ ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే కేవలం హైరైజ్‌ అపార్ట్‌మెంట్లు వస్తే చాలదు. ఆస్పత్రులు, పాఠశాలలు, రిటైల్, ఇతర పౌర సౌకర్యాలు కూడా అదే స్థాయిలో రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే రోజువారీ అవసరాల కోసం ప్రధాన నగరంపై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ఒత్తిడి పెరుగుతుంది.

ప్రస్తుతం శంషాబాద్‌లో అపార్ట్‌మెంట్ల ధరలు చ.అ.కు రూ.6–8 వేలుగా ఉండగా.. భూముల ధరలు గజానికి రూ.55–60 వేలుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన సంస్థలు శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల నిర్మాణం కోసం శంషాబాద్, చుట్టు పక్కల ప్రాంతాల వైపు దృష్టిసారించాయి. 2027 నాటికి ఏటా 10–17 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సీ–సూట్‌ ట్రాన్సిట్‌ ఆఫీస్‌గా..
స్థిరాస్తి రంగంలో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఏరోట్రోపోలిస్‌ హబ్‌తో శంషాబాద్‌ ఒక ప్రత్యేకమైన ఆర్థిక ఇంజిన్‌ను సృష్టిస్తుంది. ఇతర మెట్రో నగరాలకు ప్రయాణ సమయం తగ్గుతుండటంతో ఈ ప్రాంతం ఎగ్జిక్యూటివ్‌లకు, కార్పొరేట్లకు సీ–సూట్‌కు ట్రాన్సిట్‌ ఆఫీస్‌గా మారుతుంది. ఫైవ్‌స్టార్‌ హాస్పిటాలిటీ, కన్వెన్షన్‌ సెంటర్లకు డిమాండ్‌ ఏర్పడుతుంది. అలాగే మెరుగైన రవాణా సదుపాయాలతో ఏవియేషన్, ఫార్మా వంటి పారిశ్రామిక కారిడార్లు, లగ్జరీ రెసిడెన్షియల్‌ క్లస్టర్లుగా అభివృద్ధి చెందుతాయి.

Videos

ఇరాన్‌లో నీరు మాయం? దేశమే రోడ్డెక్కింది!

మనిషి చనిపోయినా కూడా వదలట్లే.. వీళ్ళు పోలీసులా.. రాక్షసులా..

పాకిస్తాన్‌కు అమెరికా బిగ్ షాక్ POK భారత్‌లో అంతర్భాగమే..

ఆ రోజు అలిపిరి ఘటన.. రేపు మాత్రం.... లడ్డూపై ఆగని బాబు అసత్య ప్రచారాలు

ఫస్ట్ టైం ఎమ్మెల్యే నువ్వు అహంకారం తగ్గించుకో.. లేదంటే..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో గొడవపై బాబు మోహన్ క్లారిటీ

అది నోరా..? ఇంకేమైనాన? చెప్పు తీసి కొడతారు జాగ్రత్త

మల్లా రెడ్డిపై దాడి... 150 మంది వచ్చి దబా దబా కొట్టారు

గజ్వాల్‌లో హై టెన్షన్.. హరీశ్‌రావుకు నిరసన సెగ

సోమిరెడ్డి కింగ్ ఆఫ్ కరప్పన్.. విజిలెన్స్ విచారణకు సిద్ధమా

Photos

+5

వైట్ టాప్ లో టాప్ లేపుతున్న జాక్వెలిన్.. గ్లామర్ (ఫొటోలు)

+5

సమ్మక్క–సారలమ్మ జాతర హుండీల లెక్కింపు (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈజలపాతం తెలుసా.. కదిలే వంతెనలు..అదిరే గుండెలు (ఫొటోలు)

+5

కొత్త సినిమా ప్రారంభోత్సవంలో సాయి పల్లవి, శ్రీలీల (ఫొటోలు)

+5

అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)

+5

ఐస్‌క్రీం ఈవెంట్ లో సినీ నటి రీతూవర్మ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఆభరణాల ప్రదర్శనలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో జన జాతరను చూశారా? (ఫొటోలు)

+5

హైదరాబాద్ : షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీ (ఫొటోలు)