జోగి రమేష్‌ను పరామర్శించిన బొత్స
Breaking News
నేను ఏదీ అర్థం చేసుకోలేకున్నా: తమన్నా
Published on Sat, 02/07/2026 - 07:05
అందం ఏ ఒక్కరికీ సొంతం కాదు. అయినా ఎవరి అందం వారికి ముద్దే. అదేవిధంగా అందం అనేది చూసేవారి దృష్టిని బట్టి ఉంటుందంటారు. అలాంటి అందాల్లో తమన్నా అందమే వేరయా అని పేర్కొనవచ్చు. ఈమె ఒక్కో చిత్రంలో ఒక్కో విధంగా తన అందాలను మార్చుకుంటారు. అలా ఏ కోణంలో చూసిన తమన్నా అందంగానే కనిపిస్తారు. అలా తన అందచందాలతో, హావభావాలతో రెండు దశాబ్దాలకు పైగా భారతీయ సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.
కాగా ఈ 36 ఏళ్ల భామ ఇప్పటికీ కథానాయకిగా నాటౌట్‌గా నిలబడడం మరో విశేషం. అదేవిధంగా ఐటం సాంగ్స్‌లోనూ యువతను గిలిగింతలు పెట్టడంలో ఈ బ్యూటీది ప్రత్యేక శైలి అనే చెప్పాలి. అలా ఒక్క ఐటమ్ సాంగ్‌కు రూ.6 కోట్లు డిమాండ్ చేస్తున్న నటి తమన్నా. కాగా చిన్న గ్యాప్ తర్వాత ఈ అమ్మడు తాజాగా కోలీవుడ్లో విశాల్‌కు జంటగా సుందర్.సి దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఆ మధ్య ప్రేమ వ్యవహారంలో చిక్కుకొని వార్తల్లో నిలిచారు. విజయ్‌వర్మ అనే బాలీవుడ్ నటుడితో కొద్దిరోజులు చట్టాపట్టాలేసుకొని తిరిగారు. అదీ మూడునాళ్ల ముచ్చటే అయ్యింది. కొంతకాలానికే వీరి మధ్య బ్రేకప్ అయ్యింది.
ఇటీవల ఇకపై ఐటెం సాంగ్స్‌లో నటించనని పేర్కొన్న తమన్నా మళ్లీ ఇప్పుడు ప్రముఖ హీరోల చిత్రాల్లో అలాంటి పాటల్లో నటించడానికి సిద్ధమే అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. తమన్నా లైఫ్‌లో తను తీసుకున్న నిర్ణయాలనే పలుమార్లు మార్చుకుంటూ వెళ్తుందా అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇలాంటి ప్రశ్నే ఇటీవల ఒక కార్యక్రమంలో ఎదురైన ప్రశ్నకు తమన్నా ఆసక్తికరమైన బదులు చెప్పారు. తనను తానే అర్థం చేసుకోలేకపోతున్నానని, ఇతరులు ఎలా అర్థం చేసుకోగలరని పేర్కొన్నారు.
Tags : 1