Breaking News

అల్లు అ‍ర్జున్ నుదురుపై డైలాగ్ పేపర్.. అదీ కారణం

Published on Fri, 02/06/2026 - 23:35

టాలీవుడ్‍‌ సినిమాల్లో ఒకప్పుడు దాదాపుగా తెలుగు నటీనటులు మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా కల్చర్ పెరిగిపోయిన తర్వాత భాషతో సంబంధం లేకుండా ఎక్కడెక్కడి వాళ్లో తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. గత కొన్నేళ్లలో చూసుకుంటే కీలకమైన సహాయ పాత్రల్లో ఎక్కువగా తమిళ, మలయాళ యాక్టర్స్ దర్శనమిస్తున్నారు. అందులో జయరామ్ ఒకరు. ఈయన అల్లు అర్జున్‌తో కలిసి 'అల వైకుంఠపురములో' మూవీలో నటిస్తున్నప్పుడు జరిగిన ఓ సరదా అనుభవం గురించి ఇన్నాళ్లకు బయటపెట్టారు. అది ఆసక్తికరంగా అనిపించింది.

'నాకు తెలుగు తెలియదు. డైలాగ్ ఎన్నిసార్లు చదివినా సరే గుర్తుండట్లేదు. చివరకు డైలాగ్‌ని ఓ కాగితంపై రాసి ఎదురుగా ఉన్న అల్లు అర్జున్ నుదురు, ఛాతీపై అంటించి, దాన్ని చూస్తూ డైలాగ్ చెప్పేశాను' అని జయరామ్.. తాజాగా మలయాళ ఎఫ్ఎమ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్వతహాగా మలయాళ నటుడు అయిన జయరామ్.. 2018లో అనుష్క 'భాగమతి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ధమాకా, ఖుషీ, హాయ్ నాన్న, గుంటూరు కారం, గేమ్ ఛేంజర్, మిరాయ్ సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. సాధారణంగా డైలాగ్స్ విషయంలో నంబర్స్ చదువుతారు, లేదంటే పక్కనున్న వ్యక్తులు ప్రాంప్ట్ ఇస్తుంటారు. కానీ జయరామ్ మాత్రం అలా కాకుండా ఏకంగా బన్నీ నుదురుపైనే డైలాగ్ పేపర్ పెట్టి చెప్పడం అంటే కాస్త విశేషమే అని చెప్పొచ్చు. 

Videos

ఇరాన్‌లో నీరు మాయం? దేశమే రోడ్డెక్కింది!

మనిషి చనిపోయినా కూడా వదలట్లే.. వీళ్ళు పోలీసులా.. రాక్షసులా..

పాకిస్తాన్‌కు అమెరికా బిగ్ షాక్ POK భారత్‌లో అంతర్భాగమే..

ఆ రోజు అలిపిరి ఘటన.. రేపు మాత్రం.... లడ్డూపై ఆగని బాబు అసత్య ప్రచారాలు

ఫస్ట్ టైం ఎమ్మెల్యే నువ్వు అహంకారం తగ్గించుకో.. లేదంటే..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో గొడవపై బాబు మోహన్ క్లారిటీ

అది నోరా..? ఇంకేమైనాన? చెప్పు తీసి కొడతారు జాగ్రత్త

మల్లా రెడ్డిపై దాడి... 150 మంది వచ్చి దబా దబా కొట్టారు

గజ్వాల్‌లో హై టెన్షన్.. హరీశ్‌రావుకు నిరసన సెగ

సోమిరెడ్డి కింగ్ ఆఫ్ కరప్పన్.. విజిలెన్స్ విచారణకు సిద్ధమా

Photos

+5

వైట్ టాప్ లో టాప్ లేపుతున్న జాక్వెలిన్.. గ్లామర్ (ఫొటోలు)

+5

సమ్మక్క–సారలమ్మ జాతర హుండీల లెక్కింపు (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈజలపాతం తెలుసా.. కదిలే వంతెనలు..అదిరే గుండెలు (ఫొటోలు)

+5

కొత్త సినిమా ప్రారంభోత్సవంలో సాయి పల్లవి, శ్రీలీల (ఫొటోలు)

+5

అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)

+5

ఐస్‌క్రీం ఈవెంట్ లో సినీ నటి రీతూవర్మ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఆభరణాల ప్రదర్శనలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో జన జాతరను చూశారా? (ఫొటోలు)

+5

హైదరాబాద్ : షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీ (ఫొటోలు)