జోగి రమేష్ ఇంటి వద్ద వైఎస్ జగన్ ప్రెస్ మీట్
Breaking News
హైదరాబాద్‌లో మరో కొత్త జీసీసీ.. భారీగా ఉద్యోగాలు
Published on Fri, 02/06/2026 - 11:36
హైదరాబాద్: దిగ్గజ వెల్ మేనేజ్‌మెంట్ ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ సంస్థ హైదరాబాద్‌లో ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ని ప్రారంభించినట్లు వెల్లడించింది. అలాగే కొత్త కార్యకలాపాలకు హెడ్‌గా రమేష్ కాజాను నియమించుకున్నట్లు తెలిపింది.
ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ తమ టెక్నాలజీ, కార్యకలాపాలను విస్తరించే క్రమంలో ఆర్థిక సేవల్లో విస్తృతంగా ప్రతిభావంతుల లభ్యత, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, వ్యాపారాన్ని కొనసాగించేందుకు సంబంధించిన సానుకూలాంశాలు ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుంది.
భారీగా ఉద్యోగావకాశాలు
వచ్చే మూడు నుంచి అయిదేళ్ల వ్యవధిలో టెక్నాలజీ, ఆపరేషన్స్, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్, డేటా అండ్ అనలిటిక్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ విభాగాలకు సంబంధించి హైదరాబాద్‌లో ఎల్‌పీఎల్ వందల కొద్దీ ఉద్యోగాలను కల్పించనుంది.
ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రస్తుతం తమ టీమ్ కోసం ప్రతిభావంతులను నియమించుకునే ప్రక్రియలో ఉంది. నెట్‌వర్క్ సెక్యూరిటీ, కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏఐ ఇంజినీరింగ్, డేటా ప్లాట్‌ఫామ్స్, మిడిల్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌వ్యాప్తంగా నిపుణులైన ఇంజినీర్లు, టెక్నాలజిస్టులు వీరిలో ఉండనున్నారు.
భారత్‌లోని ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌లో ఉద్యోగావకాశాల కోసం ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ లింక్డ్‌ఇన్ (LinkedIn) పేజీ, ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కెరియర్స్ సైట్‌ని సందర్శించాలని కంపెనీ సూచించింది.
ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ గురించి..
ఫార్చూన్ 500 కంపెనీ అయిన ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ (Nasdaq: LPLA) అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో ఒకటి. 32,000 మందికి పైగా ఫైనాన్షియల్ అడ్వైజర్లకు, 1,200కు పైగా ఆర్థిక సంస్థల వెల్త్ మేనేజ్‌మెంట్ విధానాలకు సపోర్ట్ అందిస్తూ దాదాపు 80 లక్షల మందికి సంబంధించి 2.4 ట్రిలియన్ డాలర్ల నిధులను నిర్వహిస్తోంది.
అధునాతన ఫైనాన్షియల్ టెక్నాలజీ సాధనాలు, అప్లికేషన్ల వినూత్న ప్లాట్‌ఫాం దన్నుతో, ఆర్థిక సలహాదారులు తమ క్లయింట్లకు వ్యక్తిగతీకరించిన ఆర్థిక ప్రణాళికలను అందించడానికి ఉపయోగించే ఇన్వెస్ట్‌మెంట్ సొల్యూషన్స్ , వెల్త్ మేనేజ్‌మెంట్ ప్రోడక్టులను ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ అందిస్తోంది.
Tags : 1