Breaking News

పాలల్లో యూరియా.. ఐస్‌క్రీమ్‌లో డిటర్జెంట్!

Published on Thu, 02/05/2026 - 17:16

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు రాఘవ్ చద్దా రాజ్యసభలో ఆహారకల్తీపై ధ్వజమెత్తారు. భారతదేశంలో అతిపెద్ద అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం: ఆహార కల్తీనే అంటూ మండిపడ్డారు. పాలు దగ్గర నుంచి సుగంధ ద్రవ్యాలు, వంట నూనెలు, ప్యాకేజ్డ్ ఆహారాలు, పానీయాల్లో హానికరమైన రసాయనాలు, అధిక స్థాయిలో సంతృప్త కొవ్వులు, చక్కెర లేదా ఉప్పు వంటివి ఉన్నాయని అన్నారు. 

అవి అనారోగ్య కారకాలని, పైగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు. పైగా దాన్ని స్వచ్ఛత ముసుగులో ఉన్న నకిలీగా అభివర్ణించారు. మార్కెట్లోకి విషాన్ని తీసుకొచ్చి అమ్ముతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాదు సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా కల్తీకి సంబంధించిన వాటిని జాబితా చేశారు కూడా.

  • పాలలో యూరియా

  • కూరగాయలలో ఆక్సిటోసిన్

  • పనీర్‌లో కాస్టిక్ సోడా

  • సుగంధ ద్రవ్యాలలో ఇటుక పొడి

  • తేనెలో పసుపు రంగు

  • పౌల్ట్రీలో స్టెరాయిడ్లు

  • ఐస్‌క్రీమ్‌లో డిటర్జెంట్

పార్లమెంటులో పాలకల్తీ సమస్యను లేవనెత్తుతూ..చద్దా ఇలా అన్నారు. పరిశోధనల ప్రకారం పాల నమూనాలలో 71%  యూరియా, 64 శాతం సోడియం బైకార్బోనేట్ వంటి న్యూట్రలైజర్లు ఉన్నాయి. ఈ దేశంలో అమ్ముడవుతున్నంత పరిమాణంలో పాలు ఉత్పత్తి కావడం లేదు.

ఆక్సిటోసిన్ ఒక హానికరమైన రసాయనమని, ఇది తలతిరగడం, తలనొప్పి, గుండె వైఫల్యం, వంధ్యత్వం, క్యాన్సర్‌కు కారణమవుతుందని అన్నారు.

పరీక్షించిన ప్రతి నాలుగు ఆహార నమూనాలలో ఒకటి కల్తీ అయినట్లు తేలింది
2014-15 నుంచి 2026 వరకు, పరీక్షించిన అన్ని నమూనాల్లో 25 శాతం కల్తీ ఉన్నట్లు తేలిందని చెప్పారు . అంటే ప్రతి నాలుగు నమూనాలలో ఒకటి కల్తీకి గురవ్వుతుందని అర్థం. దీనివల్ల చాలా మంది అనారోగ్యానికి గురవ్వడమే కాదు ప్రాణాలు కూడా కోల్పోతున్నారంటూ ఆందోళన వ్యకం చేశారు చద్దా.

అంతేగాదు చద్దా అంతర్జాతీయంగా నిషేధించిన భారతీయ ఆహార ఉత్పత్తుల గురించి ప్రస్తావిస్తూ.. ఈ దేశంలోని రెండు అతిపెద్ద గరం మసాలా కంపెనీలను అమెరికా, యూకే, యూరప్ అంతటా నిషేధించారు. ఎందుకంటే వాటిలో కేన్సర్‌కు కారణమయ్యే పురుగులమందులు ఉన్నాయి. కానీ అవే సుగంధ ద్రవ్యాలు భారతదేశంలో ఇప్పటికీ పెద్ద మొత్తంలో అమ్ముడవుతుండటం బాధకరం అని అన్నారు.

రాఘవ్ చద్దా దిద్దుబాటు చర్యలను కూడా సూచించారు
ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాలని కోరుతూ, ఆమ్‌ఆద్మీపార్టీ ఎంపీ ఈ చర్యలను సిఫార్సు చేశారు:

1. మానవశక్తిని పెంచి..ప్రయోగశాల పరీక్షా సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI)ని బలోపేతం చేయడం.
2. నేరస్థులను అరికట్టడానికి కఠినమైన జరిమానాలను ప్రవేశపెట్టడం.
3. కల్తీ ఉత్పత్తుల పేర్లు, బహిరంగంగా  వెల్లడించడం మార్కెట్ నుంచి తక్షణమే తొలగించేలా చర్చలు తీసుకోవడం వంటివి చేయాలి. 

 

(చదవండి: 70 ఏళ్ల మహిళకు అంతుపట్టని సమస్య..! కంగుతిన్న వైద్యులు)

Videos

చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతున్నారు

లోక్ సభలో మోదీపై దాడి? బయటపడ్డ సంచలన వీడియో..

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరో వీడియో.. ఈ సారి ఏకంగా కారులో

అంబటి చాలా వీక్ గా ఉన్నారు.. చెప్పుకోలేనంత బాధ అనుభవిస్తున్నారు

ధురంధర్ దెబ్బకి వెనక్కి తగ్గిన పెద్ది..

చంద్రబాబుపై బైరెడ్డి వేటగాడు కథ.. నవ్వులే నవ్వులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఢిల్లీ, ఆర్ సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్

ఫిలిప్పీన్స్ లో అగ్నిప్రమాదం.. 5 వేల మందికి పైగా..!

మీకు రోజులు దగ్గరపడ్డాయి.. అంబటి రాంబాబు చిన్న కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

బ్లూ డ్రెస్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ అందాలు (ఫోటోలు)

+5

ఈయనే నా కెప్టెన్‌: శేఖర్‌ కమ్ముల కూతురు (ఫోటోలు)

+5

ప్రతి జన్మకూ నువ్వే కావాలి: శ్రీలీల (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో వండర్‌ పార్క్‌లో లహరి (ఫోటోలు)

+5

బర్త్‌డే బ్యూటీ 'స్వాతిరెడ్డి'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

‘శ్రీ చిదంబరంగారు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రవితేజ సోదరుడి తనయుడు మాధవ్‌ ‘మారెమ్మ’ మూవీ టీజర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు (ఫొటోలు)

+5

నేను తప్పు చేసినా సహించావ్‌.. సంఘవి ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

అంబటి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)