చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతున్నారు
Breaking News
Parliament session: స్టైలిష్ సిల్క్ చీరలో మెరిసిన కంగనా..!
Published on Thu, 02/05/2026 - 16:08
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ యాక్టింగ్ పరంగా విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి వేలాది అభిమానులను సొంతం చేసుకున్న అందాల నటి. ఫ్యాషన్ పరంగాను ఆమె సాటిలేరవ్వరూ అన్నంతగా హుందాగా, స్టైలిష్‌గా ఉంటారామె. ఈనెల ఫిబ్రవరి 04న జరిగిన పార్లమెంట్ సమావేశం అనంతరం బయటకు వచ్చిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఒక్కసారిగా ఆమె అభిమానులు రాజకీయనాయకురాలిగా హుందాగా కనిపించడంలో నీకు సాటిరావెవ్వరూ అని ప్రశంసిస్తూ పోస్టులు ముంచెత్తారు. ఆమె ఆధునిక మహిళలా బ్రోకెడ్ ఎంబ్రాయిడరీతో కూడిన పట్టు చీర విత్ ట్రెంచ్ కోట్-శైలి జాకెట్‌తో అత్యంత అందంగా కనిపించారామె.
అచ్చం సాంప్రదాయ శైలి చీర కట్టుతో చక్కగా మడత పెట్టిన పల్లు, ఫుల్‌హ్యాండ్స్ జాకెట్‌తో పార్లమెంట్ రేంజ్‌కి తగినట్లుగా అత్యంత హుందాగా ఉంది ఆమె ఆహార్యం. అలాగే లైట్ మేకప్, బ్యాక్‌సన్‌గ్లాస్, చేతిలో హెర్మెస్ బ్యాగ్‌తో అత్యంత ముగ్దమనోహరంగా ఉందామె. సింపుల్‌గా చెప్పాలంటే ఆత్మవిశ్వాసంతో కూడిన రాజకీయ నాయకురాలిలా అందరి దృష్టిని ఆకర్షించేలా ప్రత్యేకంగా కనిపించారామె.
(చదవండి: 70 ఏళ్ల మహిళకు అంతుపట్టని సమస్య..! కంగుతిన్న వైద్యులు)
Tags : 1