Breaking News

ఐటీ ఉద్యోగమా.. ఊడిగమా?

Published on Thu, 02/05/2026 - 12:51

ఐటీ కంపెనీల్లో పని గంటలు, ఉద్యోగులపై పని ఒత్తిడి ఆందోళనలు ఇటీవల ఎక్కువయ్యాయి. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ బహుళజాతి ఐటీ సంస్థ తనను ఏళ్ల తరబడి ఓవర్‌టైమ్ చెల్లించకుండా అధిక పని గంటలు చేయమని బలవంతం చేసిందని ఆరోపిస్తూ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తెలంగాణ కార్మిక శాఖను ఆశ్రయించాడు. దేశంలో పని గంటలపై పరిశ్రమ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది.

రోజుకు 16 గంటల పని
టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనం ప్రకారం.. ఫిర్యాదుదారు శ్రీధర్ మేరుగు తన 14 ఏళ్ల ఉద్యోగ కాలంలో చాలా సార్లు రోజుకు 16 గంటలకు పైగా పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు. అదనంగా పనిచేసిన గంటలకు తగిన పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

తగిన వేతనం లేకుండా అధిక షిఫ్టుల్లో పనిచేయాలని ఆశించడం అన్యాయమని, కార్మిక చట్టాలను సంస్థ ఉల్లంఘించిందని శ్రీధర్ ఆరోపించారు. ఓవర్‌టైమ్ వేతనాలు చెల్లించకుండా నిరాకరించడంతో ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కూడా ఆయన ఆశ్రయించారు.

అనారోగ్యంలోనూ పనిభారం
తాను అనారోగ్యానికి గురైన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని, అయినప్పటికీ పని కొనసాగించాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని శ్రీధర్ తెలిపారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున షిఫ్ట్ భత్యాలను కూడా కంపెనీ నిరాకరించిందని ఆయన ఆరోపించారు.

సిబ్బంది కొరతను కారణంగా చూపుతూ నిరంతరం ఒత్తిడి పెంచారని, మూడు నుంచి నాలుగు నెలల పాటు రోజుకు 16 గంటలకు పైగా పని చేసిన తర్వాతే ఈ సమస్యను అధికారికంగా లేవనెత్తినట్లు చెప్పారు. అయితే చట్టవిరుద్ధమైన పని పరిస్థితుల్లో పనిచేయడానికి నిరాకరించాడనే కారణంతోనే 2025 సెప్టెంబర్‌లో తనను ఉద్యోగం నుంచి తొలగించారని శ్రీధర్‌ ఆరోపిస్తున్నారు.

చట్టబద్ధమైన వడ్డీ, జరిమానాలతో పాటు పెండింగ్‌లో ఉన్న ఓవర్‌టైమ్ బకాయిలను చెల్లించాలని యూఎస్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆ కంపెనీని ఆదేశించాలని శ్రీధర్ కార్మిక శాఖకు విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ ఐటీ రంగంలో పెరుగుతున్న ఆందోళన
హైదరాబాద్‌కు చెందిన ఇతర ఐటీ ఉద్యోగులు కూడా వారానికి 40 గంటలకంటే ఎక్కువగా పని చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. చట్టపరమైన హక్కు ఉన్నప్పటికీ చాలా మంది ఉద్యోగులు ఓవర్‌టైమ్ క్లెయిమ్ చేయడానికి వెనుకాడుతున్నారు.

దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఐటీ ప్రొఫెషనల్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత వేతనం లేని వారాంతపు, సెలవు రోజుల పని సాధారణంగా మారిపోయిందని తెలిపారు. పొడిగించిన పని గంటలను పాటించలేకపోతే పరోక్ష ఒత్తిడి, ఉద్యోగం కోల్పోతామన్న భయం ఉద్యోగులను వెంటాడుతోందని ఆయన అన్నారు.

పని ఒత్తిడితో పోతున్న ప్రాణాలు
పని ఒత్తిడిని తట్టుకోలేక హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సతీష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన మరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి, ఇంటర్ చదువుతున్న తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనల వెనుక కూడా తీవ్రమైన పని ఒత్తిడే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Videos

చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతున్నారు

లోక్ సభలో మోదీపై దాడి? బయటపడ్డ సంచలన వీడియో..

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరో వీడియో.. ఈ సారి ఏకంగా కారులో

అంబటి చాలా వీక్ గా ఉన్నారు.. చెప్పుకోలేనంత బాధ అనుభవిస్తున్నారు

ధురంధర్ దెబ్బకి వెనక్కి తగ్గిన పెద్ది..

చంద్రబాబుపై బైరెడ్డి వేటగాడు కథ.. నవ్వులే నవ్వులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఢిల్లీ, ఆర్ సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్

ఫిలిప్పీన్స్ లో అగ్నిప్రమాదం.. 5 వేల మందికి పైగా..!

మీకు రోజులు దగ్గరపడ్డాయి.. అంబటి రాంబాబు చిన్న కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

బ్లూ డ్రెస్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ అందాలు (ఫోటోలు)

+5

ఈయనే నా కెప్టెన్‌: శేఖర్‌ కమ్ముల కూతురు (ఫోటోలు)

+5

ప్రతి జన్మకూ నువ్వే కావాలి: శ్రీలీల (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో వండర్‌ పార్క్‌లో లహరి (ఫోటోలు)

+5

బర్త్‌డే బ్యూటీ 'స్వాతిరెడ్డి'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

‘శ్రీ చిదంబరంగారు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రవితేజ సోదరుడి తనయుడు మాధవ్‌ ‘మారెమ్మ’ మూవీ టీజర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు (ఫొటోలు)

+5

నేను తప్పు చేసినా సహించావ్‌.. సంఘవి ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

అంబటి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)