స్మార్ట్‌ గ్లాసెస్‌... సో డేంజర్‌!

Published on Thu, 02/05/2026 - 01:26

సరికొత్త సాంకేతికతలో స్మార్ట్‌ గ్లాసెస్‌ ట్రెండ్‌ ఒకటి. హ్యాండ్స్‌–ఫ్రీ సెల్ఫీల నుంచి ఇన్‌స్టంట్‌ ట్రాన్సాక్షన్స్‌ వరకు స్మార్ట్‌ గ్లాసెస్‌ ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాల మాట ఎలా ఉన్నా... మహిళల ప్రైవసీకి సంబంధించి స్మార్ట్‌ గ్లాసెస్‌ బ్యాడ్‌ గ్లాసెస్‌గా తయారయ్యాయి.

 స్మార్ట్‌గ్లాసెస్‌తో మహిళల వీడియోలు తీసి వివిధ సైట్‌లలో  అప్‌లోడ్‌ చేస్తున్నారు. మహిళలకు తెలియకుండా స్మార్ట్‌గ్లాసెస్‌  కెమెరాతో వీడియోలు తీయడం అనేది యూఎస్, యూకేలలో ప్రమాదకరమైన ట్రెండ్‌గా మారింది...

బస్‌స్టాప్‌లో నిలబడినప్పుడో, ఏ షాపింగ్‌ మాల్‌లోనో ఉన్నప్పుడో స్మార్ట్‌గ్లాసెస్‌ ధరించిన వ్యక్తి మీ దగ్గరకి వచ్చి... ‘హాయ్‌ అండీ... మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా ఉంది’ అని మాట కలిపి చాలాసేపు మాట్లాడవచ్చు.

చివరికి... ‘ఒకరి పోలికలతో ఒకరు ఉండడం సహజమే కదండీ. నేను పొరబడ్డాను...సారీ...’ అంటాడు. ‘భలేవారండీ, ఈ మాత్రం దానికి సారీ ఎందుకు!’ అని మనం అంటాం.

→ కట్‌ చేస్తే...
కొన్ని రోజుల తరువాత మీ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లోనో, టిక్‌టాక్‌లోనో కనిపించవచ్చు. షాక్‌కు గురి చేయవచ్చు. అభ్యంతరకరమైన  సైట్స్‌లోనూ కనిపించి మిమ్మల్ని ఆందోళనకు గురి చేయవచ్చు. ‘అసలు.. నా వీడియో ఈ సైట్‌లోకి ఎలా వచ్చింది!’ అని ఆలోచిస్తుండగా మీతో మాట్లాడిన వ్యక్తి గుర్తుకు వస్తాడు.

‘నాతో మాట్లాడింది నిజమేగానీ. అతడి చేతిలో సెల్‌ఫోన్‌లాంటిదేమీ కనిపించలేదే!’ అని అతడికి క్లీన్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. నిజాకి ఆ వీడియో సృష్టికర్త అతడే!
అతను పెట్టుకున్న స్మార్ట్‌గ్లాసెస్‌ కేవలం గ్లాసెస్‌ మాత్రమే కాదు. అందులో కెమెరా కూడా ఉంటుంది.

యూఎస్, యూకేలలో ‘స్మార్ట్‌ గ్లాసెస్‌ బాధితులు’ ఎంతోమంది ఉన్నారు. సాంకేతికతలో మరో ముందుడుగుగా ‘స్మార్ట్‌ గ్లాసెస్‌’  వచ్చాయి. హ్యాండ్స్‌–ఫ్రీ సెల్ఫీలు, ఇన్‌స్టంట్‌ ట్రాన్సాక్షన్స్, వాయిస్‌–యాక్టివేటెడ్‌ అసిస్టెంట్స్‌లాంటి సదుపాయాల మాట ఎలా ఉన్నా కొన్ని సందర్భాలలో ఇవి మహిళల పాలిట పీడకలగా మారుతున్నాయి.

→ భయపడవద్దు
గత నెల ఇంగ్లాండ్‌లో ఓ నలభై ఏడేళ్ల మహిళ ఒక వ్యక్తిని కోర్టుకు లాగింది. ఇంతకీ ఆ వ్యక్తి చేసిన నేరం ఏమిటి? ఒక హోటల్లో ఆమెకు తెలియకుండా తన స్మార్ట్‌గ్లాసెస్‌తో అభ్యంతరకరమైన రీతిలో వీడియో తీయడానికి ప్రయత్నిస్తుంటే ఆమెకు అనుమానం వచ్చి, అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కోర్టుకు లాగింది. కొద్దిమంది బాధితులు మాత్రం ‘నలుగురికి తెలిస్తే పరువు పోతుంది’ అనుకుంటూ బ్లాక్‌మెయిల్‌ చేసే వారి బెదిరింపులకు లొంగిపోతున్నారు. వారు ఎంత డిమాండ్‌ చేస్తే అంత సొమ్ము ఇచ్చేస్తున్నారు.

సూపర్‌ మార్కెట్‌కు వెళ్లిన తనను అపరిచితుడు ఎవరో రే–బాన్‌ మెటా స్మార్ట్‌ గాసెస్‌తో అభ్యంతర కరమైన రీతిలో వీడియో తీశాడని ఒక మహిళ ఆన్‌లైన్‌లో కన్నీరు మున్నీరు అయింది. ‘ఎవరో చేసిన దుర్మార్గమైన పనికి మానసికంగానే కాదు, శారీరకంగా కూడా బలహీన పడిపోయాను’ అని ‘ఎక్స్‌’లో చేసిన పోస్ట్‌లో వెల్లడించింది ఆ బాధిత మహిళ.

→ ఆ లైట్‌ వెలగక పోవచ్చు కూడా!
సార్ట్‌ఫోన్‌ కెమెరా తో ఎవరైనా షూట్‌ చేస్తుంటే వెంటనే గమనించి అడ్డుకోవచ్చు. అయితే స్మార్ట్‌ గ్లాసెస్‌తో రికార్డ్‌ చేస్తున్న విషయం తెలియకపోవడం వల్ల ప్రమాదాన్ని పసిగట్టలేము. స్మార్ట్‌ గ్లాసెస్‌ విషయానికి వస్తే, ఉదాహరణకు మెటా ప్రాడక్ట్‌ రే–బాన్‌ స్మార్ట్‌ గ్లాసెస్‌ను తీసుకుంటే...రికార్డింగ్‌ చేస్తున్నప్పుడు గ్లాసెస్‌లోని తెల్లటి చిన్న ఎల్‌ఈడి ఇండికేటర్‌ వెలుగుతుంది. ఈ లైట్‌ ఆధారంగా వీడియో రికార్డింగ్‌ జరుగుతున్న విషయం తెలుసుకోవచ్చు. అయితే ఈ లైట్‌ పగటి వెలుగులో, ప్రకాశవంతమైన పరిసరాలలో అంతగా కనిపించదు. కొందరు ఈ లైట్‌ కనిపించకుండా కూడా మ్యానేజ్‌ చేస్తున్నారు.

కొన్ని గ్లాసెస్‌కు రికార్డింగ్‌ ఇండికేటర్‌ లేకపోవడం వల్ల అక్రమంగా వీడియో తీస్తున్నవారి పని మరింత సులువు అవుతుంది. ముఖ్యంగా తక్కువ ధరల్లో వచ్చే చైనీస్‌ మోడల్స్‌లో ఈ ఫీచర్‌ కనిపించడం లేదు.

స్మార్ట్‌ గ్లాసెస్‌లోని ఎల్‌ఈడి లైట్‌ ఎందుకు వెలుగుతుందనేది చాలామందికి తెలియక పోవడం వల్ల అనుమానం రావడం లేదు. యూఎస్, యూకేలలో ప్రైవసీ చట్టాలు రకరకాలుగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాలలో వీడియోలు తీయడం నేరం కాదు. మనకు తెలియకుండానే కేఫ్, మెట్రోస్టేషన్, పార్క్, ఆలయం సమీపంలో ఎవరైనా వీడియో షూట్‌ చేసి ఉండవచ్చు. 

ఆ వీడియోలో మనం ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి, ఫుటేజి తీసివేయాలని డిమాండ్‌ చేయడానికి చట్టపరమైన అధికారం లేదు. అయితే ఇతరులు అభ్యంతరం చెప్పినప్పుడు రికార్డింగ్‌ నిలిపివేయాలని టెక్‌ కంపెనీలు చెప్పవచ్చు. యూఎస్, యూకేలలోనే కాదు మన దేశంలోనూ స్మార్ట్‌గ్లాసెస్‌ దుర్వినియోగానికి సంబంధించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.

→ పరిష్కారం లేదా?
‘అవగాహన, అప్రమత్తతే సమస్యకు పరిష్కారం’ అంటున్నారు టెక్‌ నిపుణులు. ‘సందేహంతో ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి. అనుమానంగా అనిపిస్తే సమాచారం ఇవ్వాలి’ అని కూడా చెబుతున్నారు. కెమెరాలు ఉన్న అన్ని స్మార్ట్‌గ్లాసులలోనూ స్పష్టమైన లైట్లు, సంకేతాలు ఉండవనే విషయం తెలుసుకోవాలి.
 
డేంజర్‌ ట్రెండ్‌!
యూఎస్‌. యూకేలలో స్మార్ట్‌ గ్లాసెస్‌ కెమెరాలను ఉపయోగించి మహిళలకు తెలియకుండా వారి  వీడియోలు తీసి. వివిధ సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయడం అనేది ప్రమాదకరమైన ధోరణిగా మారింది. వీడియో ఫుటేజీని సైకలాజికల్‌ మేనిప్యులేషన్‌ కోసం ఉపయోగించే ప్రమాదకరమైన «ధోరణి పెరిగింది.

‘నాకు తెలియకుండానే నా వీడియోను చిత్రీకరించి, ఏదో సైట్‌లో పోస్ట్‌ చేశారు. ఆ తరువాత నేను పడిన ఇబ్బందులు ఇన్నీ అన్నీ కావు. ఎంత దారుణం ఇది!’ అంటూ న్యూయార్క్‌లో ఉండే కెసీ జనంజని కళ్లనీళ్ల పర్యంతం అయింది. ‘ఈ పని వారు యాదృచ్ఛికంగా, సరదా కోసం చేశారనుకోవడం లేదు. విషపూరిత ఆలోచనలతోనే చేస్తున్నారు’ అంటుంది కెసీ.

Videos

KLSR రేవంత్ బినామీ కంపెనీ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

బ్రేకప్ గురించి నోరు విప్పిన మృణాల్ ఠాకూర్..!

నీయవ్వ తగ్గేదేలే..! పుష్ప & ధురంధర్ డైరెక్టర్ మూవీ..!

శ్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన అమ్మాయి.. అర్ధరాత్రి గజగజ వణికిన డెలివరీ బాయ్

ఒక మాజీ మంత్రిని పోలీసులతో కొట్టిస్తారా? సినిమా మాములుగా ఉండదు

పోలీసుల సమక్షంలోనే అంబటి హత్యకు కుట్ర

కాపు కులంలో అంబటి అన్న ఒక టైగర్ పోలీసులకు మాస్ వార్నింగ్

మేం కూడా మీలాగే ప్లెక్సీలు పెడితే ఒప్పుకొంటావా చంద్రబాబు?

గూండాలను వేసుకొచ్చి దాడి చేయిస్తావా? గల్లా మాధవిపై జగన్ ఫైర్

అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేంటి?

Photos

+5

నేను తప్పు చేసినా సహించావ్‌.. సంఘవి ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

అంబటి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)

+5

శరత్ కుమార్-రాధిక పెళ్లిరోజు.. కూతురి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో దద్దరిల్లిన గుంటూరు (చిత్రాలు)

+5

అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. మరిన్ని కొత్త (ఫొటోలు)

+5

ఫుడ్ అంటే ఎంత ఇష్టమో.. ఆషికా క్రేవింగ్స్ (ఫొటోలు)

+5

పశ్చిమ గోదావరిలో ఎంతో ఫేమస్ ఈ ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

నెట్‌ఫ్లిక్స్ గ్రాండ్ ఈవెంట్.. సగం బాలీవుడ్ ఇక్కడే ఉందిగా (ఫొటోలు)

+5

జ్యోతిర్లింగాల యాత్ర మొదలుపెట్టిన హీరోయిన్ (ఫొటోలు)