KLSR రేవంత్ బినామీ కంపెనీ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Breaking News
పెద్దమ్మ తల్లి ఆలయంలో ఛార్మి, పూరి పూజలు.. వీడియో వైరల్
Published on Wed, 02/04/2026 - 16:09
జూబ్లీహిల్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని హీరోయిన్ ఛార్మి, డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శించుకున్నారు. వీరిద్దరు హైదరాబాద్‌లోని పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దమ్మ దర్శనం అనంతరం వీరిద్దరు బయటికొస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. టాలీవుడ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయ్ సేతుపతి బర్త్‌డే సందర్భంగా నేడు(జనవరి 16) ఈసినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రానికి స్లమ్ డాగ్ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. 33 టెంపుల్ రోడ్ అనే ట్యాగ్‌లైన్ తో వస్తున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో విజయ్ సేతుపతి బిచ్చగాడిలా చిరిగిన దుస్తులు ధరిస్తూనే.. చేతిలో కత్తి పట్టుకొని కళ్లజోడుతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు.
కాగా.. ఈ పాన్ ఇండియా చిత్రంలో సంయుక్త హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు.
Director #PuriJagannadh & #CharmyKaur Spotted At Shri Peddamma Talli Temple pic.twitter.com/ofas8ZxFfC
— idlebrain.com (@idlebraindotcom) February 4, 2026
Tags : 1