Breaking News

చాట్‌ జీపీటీకి గూగుల్ షాక్‌.. ‘జెమిని’లోకి పాత చాట్స్

Published on Wed, 02/04/2026 - 13:24

న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో గూగుల్ తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు సకల ‍ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు చాట్‌ జీపీటీ (ChatGPT) వాడుతున్న యూజర్లు గూగుల్ ‘జెమిని’కి మారాలనుకున్నప్పుడు, తమ పాత సంభాషణలు, డేటాను కోల్పోతామనే ఆందోళన  చెందేవారు. అయితే, ఈ సమస్యకు పరిష్కారంగా గూగుల్ ఇప్పుడు ‘ఇంపోర్ట్ ఏఐ చాట్స్’ (Import AI Chats) అనే కొత్త ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. ఫలితంగా యూజర్లు తమ పాత చాట్‌బాట్‌లలోని హిస్టరీని  సులభంగా జెమినికి బదిలీ  చేసుకోగలుగుతారు.

ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఉన్న ఈ ఫీచర్ గురించి ‘టెస్టింగ్ క్యాటలాగ్’ అనే నివేదిక కీలక వివరాలను గూగుల్‌ వెల్లడించింది. దీని ప్రకారం వినియోగదారులు చాట్‌ జీపీటీ లేదా క్లాడ్ (Claude) వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌ల నుండి తమ సంభాషణలను నేరుగా జెమినిలోకి తరలించుకోవచ్చు. దీనివల్ల ఏఐతో గతంలో జరిపిన చర్చలు, డేటా, సందర్భం (Context) ఏమాత్రం చెదిరిపోకుండా జెమినిలో కొనసాగించే అవకాశం  కలుగుతుంది.

ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించే సమయంలో డేటా భద్రతపై గూగుల్ స్పష్టతనిచ్చింది. వినియోగదారులు దిగుమతి చేసుకున్న ప్రతి సంభాషణ వారి యాక్టివిటీలో భాగంగా సేవ్  అవుతుందని సంస్థ పేర్కొంది. అయితే ఈ డేటాను తమ ఏఐ మోడల్స్‌ను మరింత మెరుగుపరిచేందుకు, శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగిస్తామని గూగుల్ వెల్లడించింది. అలాగే వినియోగదారులు తమ డేటాను ఎప్పుడైనా మేనేజ్ చేసుకునే లేదా డిలీట్ చేసే వెసులుబాటును కూడా కల్పిస్తున్నట్లు తెలిపింది.

అందిన సమాచారం ప్రకారం ఈ ప్రక్రియ అత్యంత సులభంగా ఉండనుంది. మొదట యూజర్లు తమ పాత ఏఐ ప్లాట్‌ఫారమ్ నుండి చాట్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత జెమిని యాప్‌లోని ‘ఇంపోర్ట్ ఏఐ చాట్స్’ బటన్‌ను క్లిక్ చేసి ఆ ఫైల్‌ను అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల జెమిని మీ పాత సమాచారాన్ని అర్థం చేసుకుంటుంది. తద్వారా మీరు పదేపదే అదే విషయాలను ఏఐకి వివరించాల్సిన అవసరం ఏర్పడదు.

ఇది కూడా చదవండి: స్క్రీన్ టైమ్‌: సరికొత్త నిర్వచనంలో ‘జెన్ జీ’

Videos

KLSR రేవంత్ బినామీ కంపెనీ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

బ్రేకప్ గురించి నోరు విప్పిన మృణాల్ ఠాకూర్..!

నీయవ్వ తగ్గేదేలే..! పుష్ప & ధురంధర్ డైరెక్టర్ మూవీ..!

శ్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన అమ్మాయి.. అర్ధరాత్రి గజగజ వణికిన డెలివరీ బాయ్

ఒక మాజీ మంత్రిని పోలీసులతో కొట్టిస్తారా? సినిమా మాములుగా ఉండదు

పోలీసుల సమక్షంలోనే అంబటి హత్యకు కుట్ర

కాపు కులంలో అంబటి అన్న ఒక టైగర్ పోలీసులకు మాస్ వార్నింగ్

మేం కూడా మీలాగే ప్లెక్సీలు పెడితే ఒప్పుకొంటావా చంద్రబాబు?

గూండాలను వేసుకొచ్చి దాడి చేయిస్తావా? గల్లా మాధవిపై జగన్ ఫైర్

అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేంటి?

Photos

+5

శరత్ కుమార్-రాధిక పెళ్లిరోజు.. కూతురి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో దద్దరిల్లిన గుంటూరు (చిత్రాలు)

+5

అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. మరిన్ని కొత్త (ఫొటోలు)

+5

ఫుడ్ అంటే ఎంత ఇష్టమో.. ఆషికా క్రేవింగ్స్ (ఫొటోలు)

+5

పశ్చిమ గోదావరిలో ఎంతో ఫేమస్ ఈ ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

నెట్‌ఫ్లిక్స్ గ్రాండ్ ఈవెంట్.. సగం బాలీవుడ్ ఇక్కడే ఉందిగా (ఫొటోలు)

+5

జ్యోతిర్లింగాల యాత్ర మొదలుపెట్టిన హీరోయిన్ (ఫొటోలు)

+5

క్యూట్ జోడీ.. జనవరి ఎంజాయ్ చేశారిలా (ఫొటోలు)

+5

అనసూయ డైలీ రొటీన్ ఇదే.. పోస్ట్ వైరల్ (ఫొటోలు)