Breaking News

లండన్‌లో పానీ పూరీ అమ్ముతున్న ఐఐటీ గ్రాడ్యుయేట్‌..!

Published on Tue, 02/03/2026 - 13:50

కార్పోరేట్‌ లైఫ్‌ని వద్దనుకుని మరి ఆతిథ్య రంగాన్ని ఎంచుకుంది భారత సంతతి మహిళ. ఒకప్పుడు శామ్‌మ్‌సంగ్‌ డిజైనర్‌గా పనిచేసిన ఆమె లండన్‌లో తన భర్తతో కలిసి సప్పర్‌ క్లబ్‌ని రన్‌ చేస్తుంది. అక్కడ ఆమె పానీపూరితో అపరిచిత భారతీయలును ఒకచోటకుకు చేర్చడమే కాదు వివిధ భారతీయ వంటకాలను పరిచయం చేస్తోంది, లాభాలు ఆర్జిస్తోంది కూడా. అయినా ఐఐటీ చదివి ఇలా

ఇదే  ఎందుకంటే..
ఆ దంపతులే అంకిత ఖాంతే, భర్త అమన్‌ కృష్ణ కలిసి  'ది బౌజీ క్లబ్' అనే సప్పర్ క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పుట్టిన ఖాంతే నాగ్‌పూర్‌లో ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తిచేసి, ఐఐటీ గుహతిలో మాస్టర్‌ డిగ్రిని పూర్తి చేసింది. ఆ తర్వాత 2024లో అమన్‌ కృష్ణను వివాహం చేసుకుని యూకేకి వెళ్లి స్థిరపడింది. 

ఇక ఆమె భర్త కృష్ణ ఉత్తరప్రదేశ్‌లోని ఓబ్రాలో జన్మించాడు. అతడు ఐఐటీ ధన్‌బాద్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ, ఐఐఐటీ హైదరాబాద్‌లో మాస్టర్‌ డిగ్రీని పూర్తిచేశాడని చెప్పుకొచ్చింది. తామిద్దరం లండన్‌ స్థిరపడ్డాక జాబ్‌ మార్కెట్‌ని పూర్తిగా స్టడీ చేశాం. అంతకుముందు తాను బెంగళూరులో శామ్‌సంగ​్‌లో ప్రొడక్ట్‌ డిజైనర్‌గా మూడేళ్లు పనిచేసినట్లు పేర్కొంది. స్నేహితులను అందరికి ఒక చోటకు చేర్చి హోస్టింగ్‌ చేయడం తనకు హాబీ అని ఆ అలవాటే..ఇలా 'ది బౌజీ క్లబ్' నిర్వహించాలనే ఆలోచనకు నాందిపలికిందన్నారు. 

పైగా దీని సాయంతో ఇంకా కొత్తవారు పరిచయమవ్వక ఇబ్బంది పడుతున్న భారతీయ ఎన్నారైలకు ఇది హెల్ప్‌​ అవ్వడమే కాకుండా ఆహారంతోనే సులభంగా అందర్నీ ఒకచోటకు చేర్చగలమని దీన్ని ప్రారంభించినట్లు వివరించింది. మొదట్లో కొంతమంది స్నేహితులతో ప్రారంభించామని, ఆ తర్వాత టిక్కెట్టు పొందాక సప్పర్‌ క్లబ్‌గా మారిందని చెప్పుకొచ్చింది. కొన్ని ఈవెంట్ల తర్వాత ప్రతి మొదటి పదినిమిషాలు చాలా ముఖ్యమైనవి అర్థమైందో దాంతో ..పానీపూరిని ఐస్‌ బ్రేకర్‌గా పరిచయం చేశాం. అలా ప్రతి విందులో ఇది సిగ్నేచర్‌ విందుగా పానీపూరితోనే ప్రారంభిస్తామని చెప్పుకొచ్చింది అంకిత. 

నెలకు సుమారు పది నుంచి 12 మంది ఆతిథ్యం ఇస్తామని..ఇక్కడ ఏడు కోర్సుల ఇండియన్-ఫ్యూజన్ మెనూను అందిస్తున్నట్లు వెల్లడించింది. టికెట్ట ధర ఒక్కొక్కరికి రూ. 6000. అయితే ఈ జంట ఎంత టర్నోవర్‌ వస్తుందో మాత్రం వెల్లడించలేదు. పండుగ సమయల్లో ఆ పండు నేపథ్య సిరీస్‌తో ఫుడ్‌ని అందిస్తారట కూడా. అంతేగాదు తాము ఐఐటీ గ్రాడ్యుయేట్లు కావడంతోనే వేగంగా అర్థంచేసుకోవడం, రిస్క్‌ తీసుకోవడం వంటివి చేయగలిగామని సగర్వంగా చెబుతోంది అంకిత. 

సప్పర్ క్లబ్ అంటే ఏమిటి?
ప్రైవేట్ డిన్నర్ పార్టీ, రెస్టారెంట్‌కి మాధ్యమంగా ఉంటుంది ఈ సప్పర్‌ క్లబ్‌. దీన్ని సామాజికి భోజన అనుభవంగా చెప్పొచ్చు. విభిన్న నేపథ్యాలున్న వ్యక్తులంతా ఒకచోట చేరి హాయిగా నచ్చిన ఆహారాన్ని ఆస్వాదించే అనుభూతిని అందిస్తుంది. 

రెస్టారెంట్‌లో కూడా ఇలానే ఉన్నా..అక్కడ వేరువేరుగా డైనింగ్‌ టేబుల్‌పై కూర్చొని ఆస్వాదిస్తాం. ఇక్కడ అలా కాదు ఒకచోట సమావేశమైన వ్యక్తుల్లా సహపంక్తి భోజనంలా తింటారు ఈ సప్పర్‌ క్లబ్‌లో. 

(చదవండి: బరువు తగ్గడం అంటే వ్యాయామాలు కాదు..! ఆ ఎనిమిది మార్పులు..)
 

#

Tags : 1

Videos

పోలీసులు లేకుండా రండి ఎవడి బలం ఏంటో తెలుస్తుంది

జైల్లో అంబటిని కలిసిన ముద్రగడ

అంబటి అల్లుడు,కూతురుని పరామర్శించిన అనిల్ కుమార్ యాదవ్

ఎవర్ని వదిలిపెట్టం.. బైరెడ్డి వార్నింగ్

KTR: 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? జాబ్ క్యాలెండర్ కు పాతర

మీకు దమ్ముంటే.. బాధితురాలి సంచలన సెల్ఫీ వీడియో..

Brahmaji : నావల్లే పూరి సినిమా ప్లాప్ అయ్యింది

Thanuja : ప్లీజ్ అలా అనడం మానేయండి.. నరకం అనుభవిస్తున్నా..

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఎయిర్ పోర్టులు

దేశం నుంచి వెళ్లిపోండి.. వాట్సాప్ కు సుప్రీంకోర్టు వార్నింగ్

Photos

+5

హీరోయిన్ జెనీలియా పెళ్లి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు (ఫొటోలు)

+5

'హనీ' ఈవెంట్‌లో అందంగా దివి (ఫొటోలు)

+5

'కపుల్ ఫ్రెండ్లీ' ట్రైలర్‌ ఈవెంట్‌ లో మెరిసిన హీరోయిన్‌ మానస వారణాసి (ఫొటోలు)

+5

నిర్మల్‌ : ఘనంగా ముజ్గి మల్లన్న జాతర (ఫొటోలు)

+5

’వెరైటీ ఇండియా పార్టీ‘లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)

+5

'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ధనుష్‌ 55వ సినిమా.. శ్రీలీల, సాయి పల్లవి క్రేజీ ఫోటోలు

+5

ఈషా రెబ్బా 'ఓం శాంతి' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అయిపోతున్న దివ్య భారతి (ఫొటోలు)