ఇంటికి మంచి రేటు రావాలంటే.. ఇవిగో చిన్న టిప్స్‌..

Published on Sun, 02/01/2026 - 14:50

కొనేటప్పుడు తక్కువ ధర, అమ్మేటప్పుడు ఎక్కువ ధర కావాలని కోరుకునేది ఒక్క స్థిరాస్తి రంగంలోనే.. నివాసం ఉండేందుకు కొనేవారు కొందరైతే.. పెట్టుబడి కోసం కొనుగోలు చేసే వారు ఇంకొందరు. ఏదేమైనా భవిష్యత్తు అవసరాల కోసం ఇంటిని విక్రయించే సమయంలో అధిక ధర రావాలని కోరుకోవడం సహజం. అయితే సాధారణ ఇళ్లతో పోలిస్తే నిర్వహణ బాగున్న ఇంటికే ధర అధికంగా వస్తుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న టిప్స్‌తో సొంతింటిని లాభదాయక ఆస్తిగా ఎలా మార్చుకోవచ్చో ఒకసారి చూద్దాం.

ఇల్లు విక్రయించాలని నిర్ణయించుకోవడంతోనే సరిపోదు. ఎలాంటి సమయంలో విక్రయించాలో కూడా తెలిసుండాలి. లేకపోతే ప్రాపర్టీ అమ్ముడుపోకపోవడమే కాదు ఇష్టం వచ్చిన రేటుకు అడిగే ప్రమాదం ఉంటుంది. అందుకే మార్కెట్‌ బాగున్నప్పుడే ఇంటిని విక్రయించాలే తప్ప ప్రతికూల సమయంలో అమ్మాలనుకుంటే మాత్రం మనం పెట్టిన ధర కంటే తక్కువకు పోయే ప్రమాదం ఉంటుంది.

రీసెర్చ్‌ చేశాకే నిర్ణయం.. 
ముందుగా మీ ఇల్లు ఉన్న పరిసర ప్రాంతాల్లో భూములు, ఫ్లాట్ల ధరలు ఎంత ఉన్నాయో పరిశోధన చేయాలి. రీసేల్‌ ప్రాపరీ్టల మార్కెట్‌ ఎలా ఉంది? ఎంత రేటుకు పోతున్నాయో పరిశీలించాలి. ఒకట్రెండు రీసేల్‌ ప్రాపర్టీ యజమానులతో మాట్లాడి.. ఇల్లు కొనేందుకు ముందుకొచ్చే కొనుగోలుదారుల ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవాలి. ఆ తర్వాత మీరు విక్రయించాలనుకున్న ఇంటికి ఒక ధరను నిర్ణయించుకోవాలి. అంతే తప్ప మీ పెట్టుబడి, అవసరాలు, లాభం అన్నీ కలుపుకొని ఇంటికి రేటు కట్టకూడదు. అలా చేస్తే అంత రేటుకు రీసేల్‌ ప్రాపర్టీ కొనేబదులుగా కొత్త ఇల్లే వస్తుందని కస్టమర్లు భావిస్తారు.  

అందమైన ఇంటికే అధిక ధర.. 
సాధారణ ఇళ్లతో పోలిస్తే మీ ఇంటికి ధర రావాలంటే ముందుగా కొంత ఖర్చు పెట్టక తప్పదు. కంటికి ఇబ్బెట్టుగా, బెదురుకొట్టే రంగులు కాకుండా లేత రంగులను వేసుకోవాలి. మనసుకు ప్రశాంతత కలిగించే తెలుపు, నీలం వంటి వర్ణాలను ఉపయోగించాలి. సాధారణ ఇళ్లతో పోలిస్తే ఆహ్లాదకరంగా, అందంగా ఉండే ఇళ్లు 40–50 శాతం వేగంగా అమ్ముడవుతాయని, 10 శాతం ధర అధికంగా పలుకుతుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. నల్లాలు, పైప్‌లైన్ల లీకేజీలు ఉంటే రిపేర్‌ చేయించాలి. దీంతో ఇంటి యజమానిపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. తెగిపోయిన విద్యుత్‌ వైర్లు, పలికిన స్విచ్‌ బోర్డ్‌లు వంటివి ఏమైనా ఉంటే సరిచేయాలి. లేకపోతే విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.  

పరిసరాలు పరిశుభ్రం
విక్రయించే ఇంటిని మాత్రమే అందంగా తీర్చిదిద్దితే సరిపోదు.. పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వరద, మురుగు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంటే అందమైన పువ్వులు, సువాసన వెదజల్లే మొక్కలను పెంచాలి. దీంతో కొనుగోలుదారులకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఇల్లు కొనేందుకు వచ్చే కస్టమర్లు ఇంటి లోపల గదులు, కిచెన్, బాత్‌రూమ్‌ వంటి వాటిని పరిశీలిస్తారు. ఇంటి లోపల వస్తువులను ఆకర్షణీయంగా సర్దుకోవాలి. ఇష్టం వచి్చనట్లు వస్తువులు ఉంటే అందవిహీనంగా కనిపించడమే కాకుండా ధర కాస్త తగ్గే ప్రమాదం ఉంటుంది.

మొదటి 5 నిమిషాలు కీలకం..  
రీసేల్‌ ప్రాపర్టీలు కొనే కస్టమర్లు ఇల్లు చూసే తొలి ఐదు నిమిషాలు కీలకం. అందుకే ఇంటి లోపలికి రాగానే ఆహ్లాదభరిత వాతావరణం కనిపించేలా అందమైన కర్టెన్లు, లేతరంగులతో స్వాగతం పలికేలా చూసుకోవాలి. బెడ్‌రూమ్, కిచెన్‌లో వస్తువులను సరైన రీతిలో సర్దిపెట్టుకోవాలి. వంట గదిలో నూనె మరకలు వంటివి ఉంటే శుభ్రం చేసుకోవాలి. బాత్‌రూమ్‌లో దుర్గంధం లేకుండా చూసుకోవాలి. బాల్కనీలో దుస్తులు ఆరబెట్టేందుకు ఏర్పాటు చేసే తీగలు వంటివి అడ్డుగా లేకుండా పద్ధతి ప్రకారం ఉండేలా చూసుకోవాలి. పూల కుండీలలో అందమైన మొక్కలు పెంచుకోవాలి.

రీసేల్‌ చెక్‌ లిస్ట్‌ 

  • ఇంటిని శుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపించేలా ఉండాలి. ఇంట్లో వస్తువులు గజిబిజిగా లేకుండా పద్ధతి ప్రకారం ఉండేలా చూసుకోవాలి.

  • మార్కెట్‌లో వాస్తవ ధర ఎంతో ఉందో తెలుసుకున్న తర్వాతే ఇంటికి ధరను నిర్ణయించాలి. అత్యాశకు పోకుండా కస్టమర్‌కు బేరసారాలకు అవకాశం ఇవ్వాలి.

  • అశుభ రోజులు, ప్రతికూల సమయంలో కాకుండా పండుగలు, శుభదినాలలో ఇంటిని విక్రయించడం వల్ల కస్టమర్లు త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

  • నమ్మకమైన మధ్యవర్తులు, ఏజెంట్లు, డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రాపరీ్టల రీసేల్‌ చేస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది.

  • కస్టమర్లతో విక్రయ ఒప్పందం, ఇతరత్రా డాక్యుమెంటేషన్‌ పక్కాగా చేసుకోవాలి.  

పక్కా డాక్యుమెంట్లు.. 
ఇంటి రిజిస్ట్రేషన్‌ కాగితాలు, నల్లా, విద్యుత్‌ బిల్లులు, ఇంటి పన్ను రశీదులు, ఇంటికి సంబంధించిన ఇతర డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. ఇల్లు కొనే కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలి. డాక్యుమెంట్లు పక్కాగా ఉంటేనే ధర అధికంగా వస్తుంది. ఇంటిపై బ్యాంక్‌ రుణం, ఇతరత్రాలు ఏమైనా ఉంటే కస్టమర్లకు ముందుగానే వివరించాలి.  

Videos

ప్రశ్నిస్తే ఇళ్లు తగలబెడతారా.. ఈ నిప్పే మీ ప్రభుత్వాన్ని దహిస్తుంది

అంబటి ఇంటికి భద్రత.. హైకోర్టు కీలక ఆదేశాలు

బడుగు జీవికి.. భరోసా లేని బడ్జెట్

మానవత్వం మర్చిపోయారు.. పోలీసులు బాగా నటించారు

దాడి తర్వాత.. ఇంటిని పరిశీలించిన జోగి రమేష్

అంబటిపై దాడి.. బైరెడ్డి నెక్స్ట్ లెవల్ వార్నింగ్

ఏపీలో రాషపతి పాలన..! వెంటనే కేంద్ర బలగాలను దింపండి..

APకి గుండు సున్నా.. చంద్రబాబు పరపతి ఉత్తదే!

KCRను విచారించిన సిట్.. 4 గంటలు ప్రశ్నల వర్షం

పాక్ పై భారత్ ఘన విజయం

Photos

+5

మై సౌత్‌ దివా 9వ ఎడిషన్‌ క్యాలెండర్‌ లాంచ్ లో మెరిసిన అందాల భామలు (ఫొటోలు)

+5

అందాల సినీతార ఉల్కా గుప్తా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌.. ఫుల్‌ రష్‌ (ఫొటోలు)

+5

జనవరి ఇలా గడిచింది.. రుక్మిణి వసంత్ పోస్ట్ (ఫొటోలు)

+5

పూల చీరలో అనుపమ పరమేశ్వరన్ హొయలు (ఫొటోలు)

+5

తమన్నా కొత్త బిజినెస్ లాంచ్.. హీరోయిన్ల సందడి (ఫొటోలు)

+5

సిట్‌ విచారణకు కేసీఆర్‌.. వేల మంది పోలీసుల బందోబస్తు (ఫొటోలు)

+5

అంకెల్లో ఆర్థికం.. చీరల్లో సంప్రదాయం (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఫిబ్రవరి 01-08)

+5

ఒక్కచోట చేరిన బిగ్‌బాస్‌ సెలబ్రిటీలు.. కాకపోతే! (ఫొటోలు)