Vijayawada : చెవిరెడ్డి రిలీజ్.. జైలు వద్ద YSRCP సంబరాలు
Breaking News
వివో కొత్త స్మార్ట్‌ఫోన్.. రెండు వేరియంట్లు
Published on Thu, 01/29/2026 - 09:02
మొబైల్ తయారీ సంస్థ వివో తన ప్రీమియం సెగ్మెంట్లో జైస్ పార్టనర్షిప్తో ‘వివో ఎక్స్200టీ’ స్మార్ట్ మొబైల్‌ను లోకి విడుదల చేసింది. స్పెసిఫికేషన్ల చూస్తే.., 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 120హెచ్డీ రిఫ్రెష్ రేటు, హెచ్డీఆర్ 10+ సపోర్ట్ ఉంది 3.73 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్‌ను అమర్చారు. ఈ ఫోన్లో వెనక వైపు 50 ఎంపీ సామర్థ్యం కలిగిన 3, ముందువైపు 32 ఎంపీ కెమెరా లున్నాయి. 6,200ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. ఇది 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 40డబ్ల్యూ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.
ఇది రెండు వేరియంట్లలో లభిస్తోంది. 12జీబీ+ 256జీబీ వేరియంట్ రూ.59,999గా, 12జీబీ+ 512జీబీ వేరియంట్ ధర రూ.69,999గా ఉన్నాయి. ఈ మొబైల్‌కు ఐదేళ్ల పాటు ఓఎస్ అప్డేట్స్, 7ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు కంపెనీ హామీ ఇస్తోంది. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ కార్డులతో కొనుగోళ్లపై రూ.5వేలు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఫోన్ ఎక్సే్ఛంజీ బోనస్ రూ.5 వేలు లభిస్తుంది. ప్రస్తుతం ప్రీబుకింగ్స్ మొదలయ్యాయి.
ఇదీ చదవండి: ఏజెంటిక్ ఏఐ నిపుణులకు డిమాండ్
Tags : 1