Breaking News

దక్షిణాసియాకు 3,300 కొత్త విమానాలు అవసరం

Published on Thu, 01/29/2026 - 00:46

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రాబోయే దాదాపు రెండు దశాబ్దాల్లో 2044 నాటికి దక్షిణాసియాలోని ఎయిర్‌లైన్స్‌కి సుమారు 3,300 కొత్త విమానాలు అవసరం కానున్నాయి. ఇందులో భారత్‌ వాటా దాదాపు 90 శాతం ఉండనుంది. అమెరికన్‌ విమానాల తయారీ దిగ్గజం బోయింగ్‌ తమ కమర్షియల్‌ మార్కెట్‌ ఔట్‌లుక్‌ (సీఎంవో)లో ఈ మేరకు అంచనాలు వేసింది. బుధవారమిక్కడ ఏవియేషన్‌ సదస్సు వింగ్స్‌ 2026 కార్యక్రమం సందర్భంగా బోయింగ్‌ ఎండీ (కమర్షియల్‌ మార్కెటింగ్, 
యురేషియా, ఇండియన్‌ సబ్‌కాంటినెంట్‌) అశ్విన్‌ నాయుడు ఈ విషయాలు తెలిపారు. 

3,300 విమానాల డిమాండ్‌కి సంబంధించి 2,875 చిన్న విమానాలు, 395 పెద్ద విమానాలు ఉండవచ్చని చెప్పారు. ప్రాంతీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత్‌లో విమానాల సంఖ్య వచ్చే 20 ఏళ్లలో నాలుగు రెట్లు పెరగనుందని నాయుడు తెలిపారు. ఇదే సమయంలో భారత్, దక్షిణాసియాలో ప్యాసింజర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ సగటున 7 శాతం వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మధ్యతరగతి జనాభా, ఆర్థిక వృద్ధి, ఎయిర్‌పోర్టులు, కనెక్టివిటీ పెరుగుతుండటం ఇందుకు దోహదపడుతుందని 
వివరించారు. 

భారీగా సిబ్బంది .. 
వచ్చే రెండు దశాబ్దాల్లో ప్రాంతీయంగా విమానయాన సంస్థలకు సుమారు 1,41,000 మంది సిబ్బంది అవసరమవుతారని నాయుడు తెలిపారు. ఇందులో 45,000 మంది పైలట్లు, 45,000 మంది టెక్నీషియన్లు, 51,000 మంది క్యాబిన్‌ సిబ్బంది ఉంటారని వివరించారు. దక్షిణాసియాలో మెయింటెనెన్స్, రిపేర్, డిజిటల్‌ సర్వీసులు, శిక్షణ మొదలైన ఏవియేషన్‌ సరీ్వసులపై 195 బిలియన్‌ డాలర్ల పైగా పెట్టుబడులు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైటెక్‌ తయారీ రంగం, ఈకామర్స్‌ తదితర రంగాల దన్నుతో ఎయిర్‌ కార్గో మార్కెట్‌ గణనీయంగా వృద్ధి చెందనుందని, ఈ నేపథ్యంలో కొత్తవి, కన్వర్ట్‌ చేసిన ఫ్రైటర్ల సంఖ్య ప్రస్తుత స్థాయి నుంచి అయిదు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. 

Videos

Vijayawada : చెవిరెడ్డి రిలీజ్.. జైలు వద్ద YSRCP సంబరాలు

SIT విచారణకు గడువు కోరే యోచనలో KCR

ఒక్క ఏడాది ఓపిక పట్టండి..! సీక్వెల్స్ తో దద్దరిల్లిపోద్ది

రేవంత్ కుట్ర రాజకీయాలు!! హరీష్ రావు ఫైర్

పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్

మీ కుట్రలకు అంతు లేదా !! బాబు, పవన్ పై లక్ష్మీ పార్వతి ఫైర్

100 మంది 10 నిమిషాల్లో. కడపలో TDP చేసిన విధ్వంసం

Gadikota: రగులుతున్న ఆంధ్రా.. నీకు దమ్ముంటే

YSRCP Leaders : పై వాడే చూసుకుంటాడు.. త్వరలో లెక్క క్లియర్ చేస్తాడు

నా పార్టీ ఏంటో చూపిస్తా అన్నావ్ ఇప్పుడు ఏం అంటావ్ పవన్

Photos

+5

రంగస్థలం బ్యూటీ పూజిత పొన్నాడ లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ సావిత్రి బేబీ బంప్‌ స్టిల్స్ (ఫొటోలు)

+5

మేడారం మహా సంబరం.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

కుమారులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో హీరో ధనుశ్ (ఫొటోలు)

+5

అందాల రాశి... మానస వారణాశి... లేటెస్ట్ ఫోటోలు చూశారా?

+5

బేగంపేట్‌ : అట్టహాసంగా వింగ్స్‌ ఇండియా– 2026 ప్రారంభం (ఫొటోలు)

+5

వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణం (ఫొటోలు)

+5

ఆదివాసీ ఆచారాలతో సారలమ్మకు స్వాగతం.. మేడారంలో కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)

+5

'హే భగవాన్' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

ఫుల్ గ్లామరస్‌గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. ఫోటోలు