Breaking News

యాపిల్ ఐఫోన్ యూజర్లకు శుభవార్త..

Published on Thu, 01/22/2026 - 21:05

గూగుల్ పే గురించి వినుంటారు, ఫోన్‌పే ఉపయోగించుంటారు. యాపిల్ పే గురించి ఎప్పుడైనా విన్నారా?, అయితే ఈ వార్త మీ కోసమే. త్వరలోనే భారత్‌లో యాపిల్ పే సేవలు ప్రారంభం కానున్నాయి.

యాపిల్ ఐఫోన్ యూజర్లకు శుభవార్త. ఎందుకంటే.. భారత్‌లో యాపిల్ పే సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. యూజర్లు కార్డులను స్వైప్ చేయకుండానే చెల్లింపులు చేసుకునేలా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికోసం కంపెనీ ఇప్పటికే మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ సంస్థలతో చర్చలను ప్రారంభించింది.

భారతదేశంలో కూడా.. యాపిల్ సంస్థ అటు ప్రభుత్వంతోనూ, ఇటు ఆర్‌బీఐ తరఫున అనుమతులు పొందేందుకు కసరత్తు చేస్తోంది. ఈ సేవలు తొలుత యూపీఐ లేకుండానే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే.. యూపీఐ కోసం థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ అవసరం. కాబట్టి తొలుత కార్డు ఆధారంగా కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు అందుబాటులోకి వస్తాయి.

యాపిల్ వ్యాలెట్‌లో కార్డుల వివరాలను భద్రపరుచుకుంటే.. అవసరమైనప్పుడు యాపిల్ పే యాప్‌తో చెల్లింపులు జరపవచ్చు. ఈ సేవలు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఆధారంగా ట్యాప్-టు పే టెక్నాలజీతో పనిచేస్తాయి. భద్రత ప్రమాణాల రీత్యా ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీల ధ్రువీకరణలను తప్పనిసరి చేస్తారు. ఏది ఏమైనా.. యాపిల్ గనక రంగంలోకి దిగితే.. ప్రస్తుతం ఈ రంగంలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న గూగుల్ పే, ఫోన్ పేలకు గట్టిపోటీ ఉండే అవకాశాలున్నాయి. ప్రస్తుతం యాపిల్ పే సేవలు 89 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి.

#

Tags : 1

Videos

పట్టాలెక్కిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ జెండా ఊపిన ప్రధాని

RS Praveen : ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డిని విచారించాలి

Chandrasekhar : సచివాలయం ఉద్యోగులను చంపేస్తున్నారు.. ఇంకెంత మందిని బలి తీసుకుంటావ్

Kakinada : ఈ ప్రభుత్వానికి ఓటు వేసి నరకం చూస్తున్నాం..

ప్రతి పొలానికి పక్కా మ్యాప్.. పాసు పుస్తకాలు ముందు పెట్టి..

కిందపడ్డ బాలుడికి రేబిస్ ఇంజెక్షన్.. రిమ్స్ సిబ్బంది నిర్వాకం

బాలయ్య అల్లుడి కోసం 54 ఎకరాల ప్రభుత్వ భూమి!

దురంధర్ 2 డెకాయిట్ తగ్గేదెలే అంటున్న అడివిశేష్

పెద్ది పోస్ట్ పోన్..!

అంచనాలు పెంచేస్తోన్న నాగ్ 100 th మూవీ

Photos

+5

మంచు ముద్దలలో మునిగిన లోయ (ఫొటోలు)

+5

ఇది అంతులేని కథలా.. సిట్‌ విచారణ వేళ కేటీఆర్‌ (చిత్రాలు)

+5

కన్నడ బ్యూటీ విమలా రామన్ బర్త్‌డే.. క్రేజీ ఫోటోలు చూశారా?

+5

శ్రీకాకుళం : రథ సప్తమి వేడుకలు.. అదరహో (ఫొటోలు)

+5

కడప : కనుల పండువగా శ్రీరామ మహాశోభాయాత్ర (ఫొటోలు)

+5

‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

వేకేషన్‌ ఎంజాయ్‌ చేస్తోన్న చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ (ఫోటోలు)

+5

స్టన్నింగ్‌ అవుట్‌ఫిట్‌లో టాలీవుడ్ హీరోయిన్ ఇషా రెబ్బా (ఫోటోలు)

+5

నిన్ను విసిగించడం నాకెంత ఇష్టమో!: భావన (ఫోటోలు)