Breaking News

డీప్‌ఫేక్‌కు చెక్‌ పెట్టే టెక్నాలజీ!

Published on Thu, 01/22/2026 - 19:11

సోషల్ మీడియా ఎంత వేగంగా విస్తరిస్తోందో.. ఏఐ జనరేషన్, డీప్‌ఫేక్ వ్యాప్తి కూడా అంతే జోరుగా వ్యాప్తి చెందుతున్నాయి. వీటిని ఉపయోగింగి యూజర్ల అనుమతి లేకుండానే.. కొందరు తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి, వారిని అపఖ్యాతిపాలు చేస్తున్నారు. ఇది ఎక్కువగా మహిళలపై ప్రభావం చూపుతోంది.

ఏఐ జనరేషన్, డీప్‌ఫేక్ భారిన పడిన ప్రముఖుల జాబితాలో రష్మికా మందన, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, అనిల్ కపూర్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి మొదలైనవారు ఉన్నారు. చాలామంది ఈ విషయంపై న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయినప్పటికీ.. మార్ఫింగ్ ఫోటోలు, ఇతర తప్పుడు సమాచారాలను ప్రచారం వంటివి ఇప్పటికీ ఎదో ఒక మూల బయటపడుతూనే ఉన్నాయి. ఈ సమస్యకు చరమగీతం పాడేందుకు ఓ ఇద్దరు కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థులు కొత్త ఏఐ ఇంటర్‌ఫేస్ అభివృద్ధి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంకు చెందిన ఫైనల్ ఇయర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థులైన ''జీ. వెంకట కార్తికేయ ఆర్యన్ & బి. లోకేష్'' ఎనిమిది నెలలు శ్రమించి అపరిక్స్ (APARYX) పేరుతో కొత్త ఏఐ ఇంటర్‌ఫేస్ అభివృద్ధి చేశారు. నష్టం జరగక ముందే అరికట్టడం మంచిది.. అనే సిద్ధాంతం ఆధారంగా దీనిని డెవలప్ చేశారు.

అపరిక్స్ అనేది.. ఇతర వ్యవస్థల కంటే భిన్నంగా ఉంటుంది. అంతే కాకుండా.. కంటెంట్ అప్లోడ్ అవ్వడానికి ముందే దానిని పరిశీలిస్తుంది. సెల్ఫ్ అడాప్టివ్ ఏఐ ఇంజిన్, అడ్వాన్స్డ్ డీప్‌ఫేక్ డిటెక్షన్ మోడల్స్ ఉపయోగించి.. ప్రతి ఫైల్‌నూ చెక్ చేస్తుంది. కంటెంట్‌ను మూడు విధాలుగా (లెవెల్స్‌) విభజిస్తుంది.

➤0 నుంచి 0.35 వరకు: అప్లోడ్ చేయడానికి అనుమతిస్తుంది
➤0.35 నుంచి 0.75 వరకు: వార్నింగ్ ఇస్తుంది
➤0.75 నుంచి 1 వరకు: అప్లోడ్ చేయడానికి అనుమతించదు / అప్లోడ్ బ్లాక్ చేస్తుంది

డీప్‌ఫేక్, మార్ఫింగ్ వీడియోలు, ఏఐ క్రియేట్ న్యూడ్ కంటెంట్, లేదా అనుమతిని పొందని ఎక్స్‌ప్లిసిట్ మెటీరియల్ గుర్తించినప్పుడు అపరిక్స్ ఆటోమేటిక్‌గా అప్లోడ్ చేయడాన్ని బ్లాక్ చేస్తుంది. అయితే కొంత తక్కువ మార్పులు చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తే వార్నింగ్ ఇస్తుంది. ఆ వార్నింగ్ యాక్సెప్ట్ చేయకపోతే.. అప్లోడ్ చేయడానికి అనుమతించదు. 

కంటెంట్ హ్యాష్, టైమ్ స్టాంప్, ప్లాట్‌ఫామ్ యూస్డ్ వంటి వాటిని ఆడిట్ చేయడానికి ఇందులో శాండ్‌బాక్స్ ఉంటుంది. దీని ద్వారా డీప్‌ఫేక్‌ ఫోటోలను ఎవరు అప్లోడ్ చేసారనేది గుర్తించడానికి మాత్రమే కాకుండా.. వాటిని ఎన్నిసార్లు షేర్ చేసారు అనేది గుర్తించవచ్చు.

అపరిక్స్ పేరును సంస్కృత పదమైన అపరిజిత నుంచి తీసుకున్నారు. దీని అర్థం అదృశ్య రక్షకుడు (కనిపించకుండా రక్షించేవాడు). పేరుకు తగిన విధంగా.. ఈ సిస్టం (అపరిక్స్) డీప్‌ఫేక్ వంటి వాటి నుంచి కాపాడుతుంది. దీనిని రూపొందించిన విద్యార్థులు ప్రస్తుతం పేటెంట్ కోసం అప్లై చేసుకున్నారు, పేటెంట్ పబ్లిష్ కూడా పూర్తయింది. అయితే ఇది ప్రస్తుతం టెక్నికల్ ఎగ్జామినేషన్స్‌లో ఉంది.

Videos

విజయ్ కి గుడ్ న్యూస్ TVK పార్టీ గుర్తు ఇదే..

RK Roja: రెడ్ బుక్ అని తిరిగేవాళ్లకు వడ్డీతో ఇచ్చేద్దాం

బాబు భూ సెర్వే... చంద్రబాబుపై మధుసూదన్ రెడ్డి పంచులు

కేతిరెడ్డి పెద్దారెడ్డి పై దాడి చేసేందుకు స్కేచ్ తెగించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

వైఎస్సార్‌సీపీ ఎంపీలతో వైఎస్‌ జగన్‌ కీలక సమావేశం

నువ్వు నాటిన విత్తనాలు వృక్షాలు అయితే ఎలా ఉంటుందో చూపిస్తా బాబుకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సిట్ నోటీసులు ఇస్తారా?: హరీష్ రావు

కేటీఆర్ కు సిట్ నోటీసులు

విద్యుత్ చార్జీలు తగ్గించినట్టు ప్రభుత్వం తప్పుడు ప్రచారం

ట్రంప్ VS న్యూసమ్... సొంత దేశంలోనే గొడవలు

Photos

+5

వేకేషన్‌ ఎంజాయ్‌ చేస్తోన్న చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ (ఫోటోలు)

+5

స్టన్నింగ్‌ అవుట్‌ఫిట్‌లో టాలీవుడ్ హీరోయిన్ ఇషా రెబ్బా (ఫోటోలు)

+5

నిన్ను విసిగించడం నాకెంత ఇష్టమో!: భావన (ఫోటోలు)

+5

ఇప్పుడు స్టార్‌ సెలబ్రిటీస్‌.. పదేళ్ల కిందట ఎలా ఉన్నారంటే? (ఫోటోలు)

+5

బ్లాక్‌ & వైట్‌ డ్రెస్‌లో జిగేలుమంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

మేడారం మహాజాతరలో తొలిఘట్టం...ఘనంగా మండమెలిగె పండుగ (ఫొటోలు)

+5

ఫుల్‌ జోష్‌లో బిగ్‌బాస్‌ విష్ణు ప్రియ (ఫోటోలు)

+5

ఎల్లే లిస్ట్ అవార్డులు 2026...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)

+5

కాలుదువ్వుతూ..రంకెలేస్తూ రంగంపేట జల్లికట్టు (ఫొటోలు)