జమ్మూకశ్మీర్ : దోడా జిల్లాలో ఘోర ప్రమాదం
Breaking News
అంతకంటే ఎక్కువ ఇంకేం కోరుకోలేను.. మహేశ్ ఎమోషనల్ పోస్ట్
Published on Thu, 01/22/2026 - 13:30
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి, నటి నమ్రత శిరోద్కర్ 54వ పుట్టిన రోజు నేడు(జనవరి 22). ఈ సందర్భంగా మహేశ్ తన భార్యకు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ.. ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘హ్యాపీ బర్త్‌డే ఎన్‌ఎస్‌జీ(నమ్రత శిరోద్కర్).. ప్రతి విషయంలోనూ వెలకట్టలేని ప్రేమతో, ఓపికతో నా వెంటే తోడుగా ఉన్నావ్, అంతకంటే ఎక్కువ నేనేం కోరుకోలేను’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు.
నమ్రత, మహేశ్‌లది ప్రేమ వివాహం. వంశీ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట..2005లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలను పూర్తిగా పక్కకి పెట్టి సమయం మొత్తం ఫ్యామిలీకే కేటాయించింది. మహేశ్ సినిమాలు, షూటింగ్ విషయాలతో పాటు ఆర్థిక వ్యవహారాలను కూడా ఆమె చూసుకుంటుంది.
మహేశ్ సినిమా విషయాలకొస్తే.. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే మూవీ చేస్తున్నాడు. కె.ఎల్.నారాయణ, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రని పోషిస్తున్నారు. 2027లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Tags : 1