జమ్మూకశ్మీర్ : దోడా జిల్లాలో ఘోర ప్రమాదం
Breaking News
గర్వించే క్షణం..! గణతంత్ర దినోత్సవాల్లో హైలెట్‌గా నారీ శక్తి గర్జన..
Published on Thu, 01/22/2026 - 11:34
భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకులకు సర్వాంగ సుందరంగా ముస్తాబవనుంది. ఈసారి న్యూఢిల్లీ వేదికగా కర్తవ్యపథంలో జరుగు కవాతు ప్రదర్శన చారిత్రాత్మక ఘట్టంగా మారనుంది. ఎందుకుంటే సాయుధ సేవలో నాయకత్వ సరిహద్దులను పునర్నర్మిస్తున్న ఈతరం మహిళలకు ఈ అరుదైన దృశ్యం ఓ ప్రేరణ కూడా. ఈసారి గణతంత్ర దినోత్సవ వేడకల్లో నిర్వహించే కవాతులో పురుషులతో కూడిన సీఆర్పీఎఫ్ బృందానికి జమ్మూ కాశ్మీర్‌కి చెందిన సిమ్రాన్ బాలా నాయకత్వం వహించనున్నారు. ఎవరీమె..? ఆమెకు ఈ అత్యున్నత అవకాశం ఎలా అందుకున్నారంటే..
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తున్న సిమ్రాన్ బాలా 140 మందికి పైగా పురుషులతో కూడిన సీఆర్పీఎఫ్ బృందానికి నాయకత్వం వహిస్తునన్న తొలిమహిళ. పైగా దేశ చరిత్రలోని ఇది తొలిసారి కూడా. ఆమె జమ్మూ కాశ్మీర్ రాజౌరి జిల్లా నౌషెరాకు చెందినది. నియంత్రణ రేఖకు సమీపంలో నివశించిన ఆమె నిత్యం యూనిఫాంలో కనిపించే అధికారుల సమక్షంలో పెరిగింది.
దాంతో క్రమశిక్షణ, సేవ, బాధ్యతలనేవి ఆమె రోజువారీ జీవితంలో ఆటోమేటిగ్గానే భాగమయ్యాయి. అలాగే రాజౌరీ జిల్లా నుంచి సీఆర్పీఎఫ్‌లో చేరి తొలి మహిళ కూడా సిమ్రానే కావడం విశేషం. ఆంక్షలు, సామాజిక పరిమితులు ఎక్కువగా ఉండే ప్రాంతం నుంచి శివంగిలా సాయుధ దళాల్లోకి ప్రవేశించిందామె. ఆమె యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పరీక్షలలో తొలి ప్రయత్నంలో విజయం అందుకుని సీఆర్పీఎప్‌లో చేరారామె. అంతేగాదు అఖిల భారత స్థాయిలో 82వ ర్యాంకు సాధించింది.
అలాగే జమ్మూకాశ్మీర్ నుంచి అర్హత సాధించిన ఏకైక మహిళా అభ్యర్థి కూడా ఆమె. ఇక సీఆర్పీఎఫ్‌లో పురుషుల బృందానికి నాయకత్వం వహించే అవకాశం ఆమె మెరిట్, కమాండ్ ఆఫీసర్‌గా ఉన్న అనుభవం ఆధారంగా లభించింది. అయితే ఇదేం అంత ఈజీగా చేసే మార్చ్ కాదు. అంతమంది ఒకేసారి ఒకే భంగిమలో చేయడానికి, తగిన వాయిస్ కమాండ్, నాయకత్వ ఉనికి తదితరాలన్ని ఉండాలి. ఆ విషయంలో సిమ్రాన్ ప్రత్యేకంగా నిలవడంతోనే సీనియర్ అధికారులు ఆమెకు అత్యున్నత అవకాశం ఇచ్చారు.
ఈసారి సీఆర్పీఎఫ్ మార్చ్ కవాతుకి మించిన ఆకర్షణగా నిలవనుంది. ఎందుకంటే ఓ 26 ఏళ్ల యువ మహిళ సారథ్యంలో పురుష బృందాన్ని నడిపించడం అనేది.. మాములు విషయంకాదు. నిజంగా ఆ రోజు కనువిందు చేయనున్న ఆ దృశ్యం.. నారీ శక్తి అజేయమైన సామర్థ్యాన్ని యావత్తు భారతదేశానికి వినిపించేలా నిశబ్దంగా గొంతెత్తి చాటుతుంది.
(చదవండి: 40లలో ప్రెగ్నెన్సీ సరుక్షితమేనా..? ఉషా వాన్స్, కత్రినా కైఫ్..)
Tags : 1