Breaking News

రిపబ్లిక్‌ డే ఆహ్వాన పత్రిక స్పెషాల్టీ ఇదే..! అష్టలక్ష్మి రాష్ట్రాల..

Published on Mon, 01/19/2026 - 13:55

భారత్‌ జనవరి 26న 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి నుంచి అతిథులకు ప్రత్యేకంగా ఆహ్వానపత్రికను పంపుతారు. అయితే ఈసారి గణతంత్ర దినోత్సవ ఆహ్వాన పత్రిక 'ఎట్ హోమ్' అత్యంత ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ 'ఎట్ హోమ్' ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో నైపుణ్యం కలిగిని కళకారులకు నివాళిగా నిలిచింది. అంతేగాదు ఇది భారతదేశ ఈశాన్య ప్రాంతం కళాత్మక మేధస్సుకు ఘన నివాళిగా పేర్కొనవచ్చు. మరి ఈ విశేషల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

'పీస్ సిల్క్'తో ఆహ్వానం..
జనవరి 26న రాష్ట్రపతి భవన్‌కు అతిథులు వచ్చినప్పుడు, ప్రత్యేకంగా రూపొందించిన ఎరి సిల్క్ సాంప్రదాయ శాలువా కప్పి వారిని సాదరంగా స్వాగతిస్తారు. సాధారణంగా 'పీస్ సిల్క్' అని పిలువబడే ఎరి సిల్క్, ఈశాన్య భారతదేశం  సాంస్కృతిక ఫాబ్రిక్. అలాగే ఇది వారి జీవనోపాధిలో అత్యంత ముఖ్యమైన ఫ్యాబ్రిక్‌ ఇది. ఉత్పత్తి, మన్నిక పరంగా అత్యంత విలువైన ఫ్యాబ్రిక్‌ ఇది. అలాగే ఇందులో అష్టలక్ష్మీ రాష్ట్రాలవారిగా ఆయా సాంస్కృతిక వారసత్వాలు, సహజ ప్రకృతి దృశ్యమానాలు కూడా పొందుపరిచి ఉన్నాయి. 

నాగాలాండ్  నుంచి ఆ రాష్ట్ర జంతువు మిథున్ తోపాటు డెండ్రాన్ పువ్వుప్రాతినిధ్యం వహిస్తుంది, మణిపూర్ అరుదైన శిరుయి లిల్లీ, అంతరించిపోతున్న సంగై జింకల వ్యక్తీకరణ ఉంటుంది. త్రిపుర నాగకేసర్ పువ్వు. భారతీయ బటర్ క్యాట్ ఫిష్, అలాగే మిజోరాం రెడ్ వాండా ఆర్చిడ్, హిమాలయన్ సెరోవ్ వంటి ఇతర రాష్ట్రాల చిహ్నాలు ఈశాన్య పర్యావరణ వైవిధ్యాన్ని మరింతగా హైలెట్‌ చేసి చూపుతుంది ఈ శాలువా.

ఆద్యంతం అద్భుతం ఆహ్వాన పెట్టే..
ఇక అతిధులకు పంపే రాష్ట్రపతి ఆహ్వాన పత్రికలో అత్యంత ప్రత్యేకతలు ఉన్నాయి. దీని గురించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోషల్‌ మీడియా ఎక్స్‌లో షేర్‌ చేస్తూ.." ఈ ఏడాది ఆహ్వాన కిట్‌ భారతదేశ ఈశాన్య ప్రాంత జీవన సంప్రదాయాలను జరుపుకుంటుంది. ఈ ఆహ్వానం అష్టలక్ష్మీ రాష్ట్రాల నైపుణ్యం కలిగిన చేతి వృత్తుల వారికి నివాళి." అని పేర్కొన్నారు. ఇక్కడ ఆహ్వాన పెట్టే కూడా ఈశాన్య ప్రాంతాలలో దీర్ఘకాలంగా స్థిరపడిన చేతిపనుల పద్ధతుల నుంచి తీసుకోవడం విశేషం. 

ఇది మగ్గంపై తయారు చేసిన వెదురు చాప. వార్ప్‌పై రంగు వేసిన కాటన్‌ దారాలను, నేతపై చక్కగా విభజింపబడిన వెదురును ఉపయోగిస్తూ రూపొందించారు. ఇది త్రిపురలోని చేతి వృత్తుల వారి కళకు దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. బయటి కవర్‌లో ఆహ్వానితుడి చిరునామా చేతితో తయారు చేసిన కాగితంతో ట్యాగ్‌ చేశారు. అలాగే మేఘాలయలో రూపొందించిన వెదురు ఆభరణం ఉంటుంది. దీన్ని ప్రత్యేకంగా పొగబెట్టిన వెదురు ముక్కలను ఉపయోగించి రూపొందిస్తారు. ఇది మట్టి గోధుమ రంగును కలిగి ఉంటుంది. 

కవర్‌, పెట్టె రెండింటి మీద అస్సామీ మాన్యుస్క్రిప్ట్ పెయింటింగ్ అలంకారణ నమునాలను తీసుకున్నారు. ఈ కళాత్మక ఆహ్వాన పత్రికను అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించింది. ఎప్పటిలానే ఈసారి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు రాష్ట్రపతి భవన్ ఆతిథ్యం ఇస్తుంది. అయితే ఈసారి విచ్చేసే అతిథులకు భారత సాంస్కృతిక, కళాత్మక వారసత్వాన్ని స్వయంగా తెలుసుకుని, అనుభవం పొందేలా ఆహ్వాన ప్రతికను ఇలా విలక్షణంగా రూపొందించింది. 

అంతేగాదు పెట్టే లోపల అష్టభుజి వెదురునేతను గోడాకు వేలాడదీసుకునేలా స్క్రోల్‌ కూడా ఉంది. దీన్ని విప్పగానే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, తిప్రుర రాష్ట్రాల చేతిపనులను కళాత్మక ప్రదర్శిన కనువిందు చేస్తుంది. ఆ స్క్రోల్‌ని త్రివర్ణ దారాలతో అల్లడం మరింత హైల్‌ట్‌గా నిలిపింది ఆ కార్డుని. 

సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఆహ్వాన కార్డు..భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలోని ప్రతి రాష్ట్రంలోని రోజువారీ జీవితం, విలక్షణ సంప్రదాయాలు, ప్రత్యేకమైన హస్తకళా పద్ధతులు, ప్రజల హస్తకళా నైపుణ్యం, అక్కడి సహజ పర్యావరణ వ్యవస్థలు తదితరాలను ప్రతిబింబించే అంశాల సంగమం. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసినా..ఈ ఆహ్వాన పత్రిక అలా ప్రజల మదిలో శాశ్వతంగా నిలిచిపోయేలా కళకు, సాంస్కృతిక వారసత్వానికి కేరాఫ్‌గా నిలిచే అపురూపమైన డిజైన్‌ ఇది.

 

(చదవండి: కళ్లకు గంతలు...సహా ఆ సిటీలో వెరైటీ డేటింగ్స్‌ ఎన్నో...)

 

 

Videos

Ravi Teja: ప్రేమ పేరుతో యువతిని మోసం 10 ఏళ్ల జైలు శిక్ష

Palnadu: సిగ్గులేకుండా రికార్డింగ్ డ్యాన్స్ లు పైగా లోకేష్, పవన్ ఫోటోలు

Guntur : కోట్ల భూమికి.. 30 లక్షలా? చెత్త ప్యాకేజీ..

Kannababu : మెడికల్ కాలేజీలకు డబ్బులేవ్ కానీ NTR విగ్రహం కోసం రూ. 1750 కోట్లు

చలో విజయవాడ.. మేమేంటో చూపిస్తాం

ఏపీలో పేకాటలపై కారుమూరి ఫైర్

BRS నాయకుడిపై ఎమ్మెల్యే రాజాసింగ్ PA దాడి

Jada Sravan: మీరు టీడీపీకే హోం మంత్రి, డిప్యూటీ సీఎంలా

Karanguda : రోడ్లు వేయడం లేదంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు

Karnataka : ఆఫీస్ లోనే ముద్దులు, కౌగిలింతలు అడ్డంగా దొరికిన DGP..

Photos

+5

హీరోయిన్స్ నయనతార, త్రిషల స్నేహ బంధం... ఫోటోలు

+5

రాతివనం.. అపురూపం

+5

రెడ్ డ్రెస్ లో మెరిసిన ధురంధర్ మూవీ హీరోయిన్ సారా అర్జున్ (ఫొటోలు)

+5

మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)

+5

జపాన్ లో పుష్ప 2 ప్రమోషన్స్ లో అల్లు అర్జున్, రష్మిక (ఫొటోలు)

+5

మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

హీరోయిన్ హల్దీ వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ

+5

హీరోయిన్‌ సంఘవి కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

2016లో అనసూయ ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)