Breaking News

మారుతున్న ఇష్టాలు.. వసతులకే ప్రాధాన్యం!

Published on Sun, 01/18/2026 - 07:00

ఇంటి కొనుగోలుదారుల ఇష్టాలు మారుతున్నాయి. మొన్నటి వరకు ధరకు ప్రాధాన్యం ఇచ్చిన గృహ కొనుగోలుదారులు ఇప్పుడు వసతులను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇల్లు కొనేటప్పుడు ఆ ప్రాజెక్ట్‌ వరకు మాత్రమే పరిమితం కాకుండా చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా విద్యా, వైద్యం వసతులు ఎలా ఉన్నాయనేది ప్రధానంగా చూస్తున్నారు. అత్యవసరంలో ఎంత సమయంలో ఆస్పత్రికి వెళ్లవచ్చు? ఎంత దగ్గరలో ఆరోగ్య సేవలు ఉన్నాయో ఆరా తీస్తున్నారు. పెరిగిన ఆరోగ్య జాగ్రత్తలలో భాగంగా ఇంట్లో పిల్లలు, పెద్దల ఆరోగ్య అవసరాల రీత్యా వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇల్లు విశాలంగా ఉండటమే కాదు, కమ్యూనిటీలో సకల సౌకర్యాలు ఉండాలనేది నేటి కస్టమర్ల డిమాండ్‌. పిల్లల కోసం క్రీడా సదుపాయాలు, పెద్దలకు క్లబ్‌హౌస్, జిమ్, స్విమ్మింగ్‌ పూల్‌ వంటి సదుపాయాలు ఉండాలని కోరుకుంటున్నారు. నివాస ప్రాజెక్ట్‌లలో ఎక్కువ స్థలం ఖాళీ వదిలి, పచ్చదనం అధికంగా ఉంటే అలాంటి కమ్యూనిటీలలో ఇంటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లల ఆలనా పాలనా చూసే డే కేర్‌ సెంటర్లు ఉండాలని కస్టమర్లు భావిస్తున్నారు. భార్యభర్తలిద్దరూ ఆఫీసుకు వెళ్తే పిల్లలను చూసుకోవడం కష్టంగా మారుతోంది.

వర్క్‌ ఫ్రం హోమ్‌ పద్ధతిలో ఇంటి నుంచే పనిచేస్తున్నా.. పిల్లలను చూసుకునే పరిస్థితి లేకుండా పోతోంది. అందుకే కమ్యూనిటీలలో డే కేర్‌ సదుపాయాలను ఉండాలని కోరుకుంటున్నారు. వీకెండ్‌ వసతులు అవసరమే.. ఇంటి నుంచి ఆఫీసు ఎంత దూరంలో ఉందనేది గృహ కొనుగోలుదారులు ప్రధానంగా చూస్తున్నారు. సిటీ ట్రాఫిక్‌లోనే అధిక సమయం వృథా అవుతోంది కాబట్టి.. దూరం, సమయం అనేది ప్రధానంగా మారాయి.

అదే సమయంలో ప్రజారవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది పరిశీలించాకే ఇంటి కొనుగోలుపై నిర్ణయం తీసుకుంటున్నారు. వీకెండ్‌ వస్తే కుటుంబంతో కలిసి సమయం గడిపేందుకు షాపింగ్‌ మాల్స్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్లు, రిక్రియేషన్‌ క్లబ్స్‌ వంటివి ఎంత దూరంలో ఉన్నాయనేవి సైతం ఇంటి కొనుగోలుదారులు చూస్తున్నారు.

Videos

TDP నేతల చేతిలో చంపబడ్డ మంద సాల్మన్ కొడుకుల సంచలన వ్యాఖ్యలు

దమ్ముంటే టచ్ చెయ్.. హౌస్ అరెస్ట్ పై అశోక్ బాబు వార్నింగ్

వైయస్సార్, ఎన్టీఆర్ పై రేవంత్ రెడ్డి ప్రశంసలు

నేను ఆ ఉద్దేశంతో అనలేదు.. క్లారిటీ ఇచ్చిన రెహమాన్

అపాయింట్ మెంట్ కోరుతూ ఏపీ డీజీపీకి MLC లేళ్ల అప్పిరెడ్డి లేఖ

సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ

హైవేపై ప్రమాదాలు..ఒకరు మృతి..

ట్రంప్ టారిఫ్.. షాక్ ఇచ్చిన యూరప్

మహిళ డ్యాన్సర్లతో మంత్రి వాసంశెట్టి డాన్స్.. బయటపడ్డ సంచలన వీడియో

లక్ష పెట్టుబడి.. నాలుగేళ్లలో రూ. 64 లక్షలు చేసిన కంపెనీ

Photos

+5

హీరోయిన్ హల్దీ వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ

+5

హీరోయిన్‌ సంఘవి కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

2016లో అనసూయ ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

మేడారం సందడి (ఫోటోలు)

+5

'యుఫోరియా' మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ బ్లాక్ బస్టర్ మీట్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా, శర్వానంద్‌ (ఫోటోలు)

+5

బుడ్డోడితో బీచ్‌లో బుల్లితెర నటి లహరి (ఫోటోలు)

+5

నువ్వే పెద్ద బంగారానివి! (ఫోటోలు)

+5

మిహికా: 2016.. అంతా సెల్ఫీలమయం (ఫోటోలు)