Breaking News

క్విక్‌ డెలివరీకి బ్లింకిట్‌ బై..

Published on Wed, 01/14/2026 - 00:02

న్యూఢిల్లీ: డెలివరీ వర్కర్లపై ఒత్తిడి పెరుగుతోందన్న ఆందోళనల నడుమ క్విక్‌ కామర్స్‌ సంస్థ బ్లింకిట్‌ ’10 నిమిషాల్లో డెలివరీ’ నినాదాన్ని పక్కన పెట్టింది. జెప్టో, ఇన్‌స్టామార్ట్‌లాంటి మిగతా సంస్థలు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డెలివరీ అగ్రిగేటర్‌ సంస్థలతో గత వారం భేటీ అయిన కేంద్ర కార్మీక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఇచ్చిన సూచనల మేరకు కంపెనీలు ’10 మినిట్‌’ డెలివరీ డెడ్‌లైన్‌ని తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. మాండవీయ సారథ్యంలో జరిగిన సమావేశంలో బ్లింకిట్, జెప్టో, జొమాటో, స్విగ్గీలాంటి దిగ్గజాలు పాల్గొన్నాయి.

బ్లికింగ్ట్‌ సత్వరం ఆదేశాలను అమలు చేస్తూ తమ బ్రాండింగ్‌ నుంచి 10 నిమిషాల్లో డెలివరీ హామీని తొలగించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీనికి తగ్గట్లుగా కంపెనీ తన బ్రాండ్‌ మెసేజింగ్‌ని కూడా అప్‌డేట్‌ చేసింది. ‘10 నిమిషాల్లో 10,000 పైగా ఉత్పత్తుల డెలివరీ‘ హామీని ‘మీ ఇంటి ముంగిట్లోకే 30,000కు పైగా ఉత్పత్తుల డెలివర్‌ అవుతాయి‘ అని మార్చింది. ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని, 10 మినిట్స్‌ ఇన్‌స్టంట్‌ డెలివరీ సిస్టమ్‌కు స్వస్తి పలకడాన్ని గిగ్, ప్లాట్‌ఫాం సర్విస్‌ వర్కర్ల యూనియన్‌ స్వాగతించింది. 10 నిమిషాల డెలివరీని వ్యతిరేకిస్తూ గిగ్‌ వర్కర్లు నూతన సంవత్సరం రోజున దేశీయంగా సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే.  

Videos

విభజన హామీలు ముగిశాయనే వాళ్లు ఆంధ్రా ద్రోహులు: చలసాని

Ravi Chandra : లోకేష్ రెడీగా ఉండు.. నీ కాలర్ పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు

చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్..?

Talasani : మా ఆత్మగౌరవంపై దెబ్బ కొడితే చూస్తూ ఊరుకోం

Satish Reddy: కేసులో మాఫీ చేసుకుని సంబరపడకు YSRCP నిన్ను వదిలిపెట్టదు

గ్రీన్ లాండ్ విలీనం కోసం బిల్లు తెచ్చిన అమెరికా

Kannababu : 8 కేసులు ఎత్తేశారు..ED పెట్టిన కేసులో గోల్ మాల్

విజయవాడ హైవేపై లారీ బోల్తా పల్టీ కొట్టిన కట్టెల లోడ్ లారీ

Achanta: ఎమ్మెల్యే సేవలో ఎంపీడీవో.. గుండెపోటు నాటకం?

CCTV Footage: కోనసీమలో కారు బీభత్సం

Photos

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)

+5

'నారీ నారీ నడుమ మురారి' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అందంగా కవ్విస్తూనే యాక్షన్‌ మోడల్‌లో రాజాసాబ్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్‌ నటులు విజయకుమార్ (ఫోటోలు)

+5

ప్రముఖ నటుడికి సన్మానం.. హాజరైన మీనా (ఫోటోలు)

+5

ఒకే ఫ్రేమ్‌లో నమ్రత, లక్ష్మీ ప్రణతి (ఫోటోలు)

+5

పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత మరింత కళగా సమంత (ఫోటోలు)

+5

బుల్లితెర నటులు 'ఇంద్రనీల్, మేఘన'ల గృహప్రవేశం (ఫోటోలు)