రాబడులకు మెరుగైన దారి

Published on Mon, 01/12/2026 - 08:04

న్యూఢిల్లీ: పెట్టుబడి ద్వారా సంపద సృష్టించుకోవాలని భావించే వారు రిస్క్‌ తీసుకునేందుకు సైతం సిద్ధం కావాల్సిందే. ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్‌లో రాబడులు ఇన్వెస్టర్‌ రిస్క్‌ సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా 10–15–20 ఏళ్లు అంతకుమించిన దీర్ఘకాల లక్ష్యాలకు సంబంధించి పెద్ద మొత్తంలో సమకూర్చుకోవాలని భావించే వారికి ఈక్విటీ ఫండ్స్‌ ఎంతో అనుకూలం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యం దిశగా కేంద్ర సర్కారు పనిచేస్తోంది. కనుక రానున్న ఒకటి రెండు దశాబ్దాల పాటు భారత ఆర్థిక వ్యవస్థ మరింత విస్తరిస్తుందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. కనుక ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం ఈక్విటీల్లో.. అందులోనూ లార్జ్‌క్యాప్‌తోపాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌కు తప్పక చోటు కలి్పంచుకోవాలి. మిడ్‌క్యాప్‌ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న వైట్‌ఓక్‌ క్యాపిటల్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ గురించి విశ్లేషణ ఇది.  

రాబడులు 
ఈ పథకం ప్రారంభమై మూడేళ్లు అయింది. 2022 సెప్టెంబర్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. కానీ, మొదటి మూడేళ్లలో మిడ్‌క్యాప్‌ విభాగంలో దిగ్గజ ఫండ్స్‌ పథకాల మించి బలమైన పనితీరు నమోదు చేసింది. ఏడాది కాలంలో పెట్టుబడులపై 5.28 శాతం రాబడిని ఇవ్వగా.. మూడేళ్లలో చూసుకుంటే వార్షిక రాబడి 28 శాతం వరకు ఉంది. కానీ, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 150 టీఆర్‌ఐ మూడేళ్లలో ఏటా ఇచి్చన రాబడి 23.51 శాతంగానే ఉంది. ఇక మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ విభాగం సగటు రాబడి 22.97 శాతంతో పోల్చినా వైట్‌ఓక్‌ క్యాపిటల్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ అదనపు రాబడిని తెచ్చిపెట్టు తెలుస్తోంది. మిడ్‌క్యాప్‌ విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ ఫండ్, కోటక్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్, నిప్పన్‌ ఇండియా మిడ్‌క్యాప్‌ ఫండ్, మోతీలాల్‌ ఓస్వాల్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ను రాబడి పరంగా అధిగమించింది. బలమైన రాబడులు ఒక్కటే ప్రామాణికం కాదు. స్థిరమైన పనితీరు, అస్థిరతల్లో స్థిరత్వాన్ని చూడాల్సి ఉంటుంది. ఆ విధంగానూ ఈ పథకానికి మంచి మార్కులే పడతాయి. 110 వారాల్లో ఈ పథకం రాబడులు నికర సానుకూలంగా ఉన్నట్టు డేటా తెలియజేస్తోంది.  

పెట్టుబడుల విధానం 
భవిష్యత్తులో దిగ్గజాలు కాగల కంపెనీలను గుర్తించి ఈ పథకం పెట్టుబడులు పెడుతుంటుంది. ఇప్పటికే ఈ పథకం ఇన్వెస్ట్‌ చేసిన కొన్ని స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ మిడ్‌క్యాప్‌గా, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ లార్జ్‌క్యాప్‌గా అవతరించాయి. పెట్టుబడుల్లో మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌కు ఎక్కువ కేటాయింపులు చేస్తుంటుంది. ఆ తర్వాత లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌కు ప్రాధాన్యం ఇస్తుంది.  

పోర్ట్‌ఫోలియో 
ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.4,346 కోట్ల పెట్టుబడులున్నాయి. ఇందులో 97 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసింది. వీటిని పరిశీలిస్తే మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో 56.36 శాతం ఎక్స్‌పోజర్‌ కలిగి ఉంది.  లార్జ్‌క్యాప్‌ కంపెనీలకు 32.61 శాతం కేటాయించింది. స్మాల్‌క్యాప్స్‌లో 9.53 శాతం ఇన్వెస్ట్‌ చేసింది. పోర్ట్‌ఫోలియోలో ఏకంగా 120 స్టాక్స్‌ను కలిగి ఉంది. పైగా టాప్‌ 10 స్టాక్స్‌లో పెట్టుబడులు 29 శాతం మించి లేవు. అంటే పెట్టుబడుల్లో ఏకీకృత రిస్క్‌ను తగ్గించే విధంగా పెట్టుబడులున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ రంగ స్టాక్స్‌లో 25.4 శాతం ఇన్వెస్ట్‌ చేసింది. హెల్త్‌కేర్‌ కంపెనీలకు 15.48 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 15.24 శాతం, ఇండ్రస్టియల్స్‌ కంపెనీలకు 13.45 శాతం, కన్జూమర్‌ డి్రస్కీíÙనరీ కంపెనీలకు 12 శాతం చొప్పున కేటాయించింది. 

Videos

పండగ లీవ్ కోసం పాట్లు పడ్తున్న రాజేష్

విధ్వంసకర ఇన్నింగ్స్ తో రెచ్చిపోయిన సోఫియా డివైన్

రాకెట్‌ ప్రయోగంలో అంతరాయం

మిగిలేది ఆవకాయ తొక్కే.. బాబు, పవన్ పై బైరెడ్డి సెటైర్లే సెటైర్లు

సినిమా టిక్కెట్ల వివాదం.. సీఎం Vs మంత్రి.. పవన్ కు ఒకే.. ప్రభాస్ కు నో

కరూర్ తొక్కిసలాట వెనుక కుట్రకోణం

టోల్ ప్లాజా నిర్లక్ష్యం.. ప్రమాదాలకు దారి

గుంటూరు సంక్రాంతి సంబరాల్లో RK రోజా, అంబటి

బోరబండలో యువతీ దారుణ హత్య

వెనుజుల అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన ప్రకటన..!

Photos

+5

బుల్లితెర నటులు 'ఇంద్రనీల్, మేఘన'ల గృహప్రవేశం (ఫోటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)

+5

రంగవల్లికలు.. సప్తవర్ణ మల్లికలై (ఫోటోలు)

+5

'ది రాజా సాబ్‌' స్పెషల్‌ మీట్‌లో సందడిగా చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

మిసెస్‌ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ క్వీన్స్ (ఫోటోలు)

+5

సంక్రాంతి జోష్‌.. వాహనాల రద్దీతో రోడ్లు ఫుల్‌ (ఫొటోలు)