జగన్ పేరు వింటే మీ ముగ్గురికి కలలో కూడా ఇది పడుతుంది
Breaking News
పచ్చని మనసున్న యంత్రాలు!
Published on Sun, 01/11/2026 - 05:27
మంచి మనసు ఉంటే అంతా మంచే జరుగుతుంది అన్నట్లు, మంచి మనసున్న యంత్రాలు కూడా మంచి పనులు చేయగలవు అని ఈ సాలెపురుగు రోబోలు నిరూపించాయి. చైనా ఎడారుల్లో 2025లో షాంసీ ప్రావిన్స్‌లో ప్రారంభమైన ‘గ్రీన్ వాకర్స్’ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ రోబోలు ఎడారిని ఒక పచ్చని తోటగా మారుస్తున్నాయి. వీటి చేతుల్లో ఆయుధాలు లేవు. కాని, గుండెల్లో పచ్చదనంపై ప్రేమ కోడ్ కొండంత ఉంది.
అందుకే, సూర్యకాంతినే శక్తిగా మార్చుకొని, ప్రతి అడుగుతో ఒక చెట్టును నాటుతూ ముందుకు సాగుతున్నాయి. ఇది కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు. ప్రకృతికి తిరిగి ఊపిరి పోసే ప్రయత్నం. భూమిపై అత్యంత కఠినమైన ప్రాంతాల్లో కూడా, సాంకేతికత సరైన దిశలో ఉపయోగిస్తే ఎలా మార్పు తేగలదో చూపించే అందమైన ఉదాహరణ. ఎడారి మధ్యలో మొలకెత్తిన ప్రతి చిన్న మొక్క, భవిష్యత్తు పచ్చగా ఉండబోతుందనే ఆశకు నడిచే సంకేతం.
Tags : 1