జగన్ పేరు వింటే మీ ముగ్గురికి కలలో కూడా ఇది పడుతుంది
Breaking News
ఏఐకి ముసుగు మాయ!
Published on Sun, 01/11/2026 - 05:23
ఒక ముసుగు ఎంత పని చేస్తుందో ఊహించగలరా? నెదర్లండ్స్‌కు చెందిన డిజైనర్ జిప్ వాన్ లీవెన్ స్టెయిన్ రూపొందించిన ఈ పారదర్శకమైన ముసుగు, ముఖాన్ని దాచదు, కాని, యంత్రాల కళ్లను మాత్రం పూర్తిగా మోసం చేస్తుంది. మనిషికి స్పష్టంగా కనిపించే ముఖం, కంప్యూటర్‌కు మాత్రం విరిగిపోయిన మ్యాప్‌లా మారిపోతుంది. ఉట్రెక్ట్ విశ్వవిద్యాలయంలోని ‘సర్వైలెన్స్ ఎక్స్‌క్లూజన్ ’ ప్రాజెక్ట్‌లో భాగంగా తయారుచేసిన ఈ ముసుగు, ముఖాకృతిని స్వల్పంగా వంకరగా మలుస్తుంది. నవ్వు, కోపం, ఆశ్చర్యం వంటి భావాలు ఎదుటివారికి అచ్చం అలాగే కనిపిస్తాయి.
కాని, ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు వ్యవస్థలు ఆధారపడే కోణాలు, గీతలు, లెక్కలన్నీ ఇక్కడ గాలిలో కలిసిపోతాయి. మనిషికి ఇది ఒక కళాఖండం అయితే, యంత్రానికి మాత్రం చదవలేని భాష. ఈ ముసుగు ఒక్కసారిగా ఆన్ లైన్ లో వైరల్ అయింది. మీడియా కథనాల నుంచి డిజైన్ , రీసెర్చ్ జర్నల్స్ వరకు దీనిపై చర్చ మొదలైంది. ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలకు వ్యతిరేకంగా, ‘బలమైన ఆయుధం శబ్దం కాదు, సృజనాత్మకత’ అని చాటిచెప్పిన తొలి ప్రయత్నాల్లో ఇది ఒకటిగా నిలిచింది.
Tags : 1