Srikakulam: మృత్యు వలయంలో తాబేళ్లు
Breaking News
ముఖేష్ అంబానీ ఒక్కరోజు సంపాదన ఎంతో తెలుసా?
Published on Sat, 01/10/2026 - 16:50
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'ముఖేష్ అంబానీ' గురించి అందరికి తెలుసు. చమురు, పెట్రోకెమికల్స్, రిటైల్, డిజిటల్ మొదలైన వ్యాపారాలను నడుపుతున్న.. ఈ పారిశ్రామిక దిగ్గజం రోజుకు ఎంత సంపాదిస్తారనేది.. బహుశా చాలామందికి తెలుసుకుండక పోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.
1957 ఏప్రిల్ 19న ధీరూభాయ్ & కోకిలాబెన్ అంబానీ దంపతులకు జన్మించిన ముఖేష్ అంబానీ.. ప్రస్తుతం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాల దేశాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ప్రస్తుతం ఈయన సుమారు 113 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 16వ అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.
కొన్ని నివేదికలు ప్రకారం.. ముఖేష్ అంబానీ ప్రతిరోజూ దాదాపు రూ.163 కోట్లు సంపాదిస్తున్నారు. ఈ ఆదాయం ఆయన జీతం నుంచి రాదు. కంపెనీ లాభాలు, వాటా, పెట్టుబడి మొదలైన వాటి నుంచి వస్తుంది. మార్కెట్ హెచ్చుతగ్గులను బట్టి సంపదలో చిన్న వ్యత్యాసం కనిపిస్తుంది.
ముఖేష్ అంబానీ ఐదేళ్ల నుంచి కంపెనీలో జీతం తీసుకోలేదు. అయితే షేర్ నుంచి, వాటాల నుంచి మాత్రం ప్రతి సంవత్సరం గణనీయమైన లాభాలు వస్తున్నాయి. సంస్థ లాభాలు, షేర్ విలువ పెరిగినప్పుడు ఈయన సంపద మరింత పెరుగుతూ ఉంటుంది.
ఇదీ చదవండి: H-1B వీసా కొత్త ఫీజులు.. మార్చి 1 నుంచి అమల్లోకి!
Tags : 1